Friday, November 29, 2019
Monday, November 25, 2019
కార్తీక పురాణం- 30వ రోజు పారాయణం (అమావాస్య రోజున)
ధర్మసూక్ష్మ కథనాన్ని ఋషులడిగారు. ఓ సూతమహర్షీ, మాకు పుణ్యమైన హరి మాహాత్మ్యం బోధించారు. ఇంకా కార్తీక పురాణం మహత్తును, కార్తీక మాహాత్మ్యాన్ని సంక్షిప్తంగా వివరించండి అని అడిగారు. ఇదే ఫలశ్రుతి.
కలియుగంలో కలుషిత మానసులై రోగాదులకు లోనై సంసార సముద్రంలో మునిగి ఉన్న వారికి అనాయాసంగా పుణ్యం లభించేది మార్గం ఏది?
ధర్మంలో ఎక్కువ ధర్మం ఏది, దేని వలన మోక్షం సిద్ధిస్తుంది, దేవతల్లో ఉన్నతమైన దేవుడెవరు?? ఏ కర్మ చేత మోహం నశిస్తుంది???
కలియుగంలో మానవులు మందమతులు, జడులు, మృత్యుపీడితులు అవుతారు. వారికి అనాయాసంగా మోక్షం దొరికే ఉపాయం చెప్పండి అని అడిగారు.
వారి మాటలకు సూతుడు మునీశ్వరులారా, మీరడిగిన ప్రశ్న చాలా బాగుంది. మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చింది. కాబట్టి సర్వసుఖకరమైన దాన్ని చెబుతాను, వినండి.
మీరు అల్పబుద్ధులైన జనాలకు మోక్షోపాయం చెప్పమని కోరారు. ఈ ప్రశ్న లోకోపకారం కోసం కావడం వల్ల నాకు చాలా ఆనందదాయకమైనది. అనేక యాగాదులు చేసినా, అనేక పుణ్యతీర్థాల్లో స్నానాదులు ఆచరించినా ఏ ఫలం పొందుతారో ఆ ఫలం ఇలాంటి మంచి మాటల వలెనే లభిస్తుంది.
మునీశ్వరులారా, కార్తీక ఫలం వేదోక్తమైనది. కార్తీక వ్రతం హరికి ఆనంద కారణం. సర్వశాస్ర్తాలను సంపూర్ణంగా చెప్పడానికి నేను సమర్థుడను కాదు, కాలం కూడా చాలదు. కాబట్టి శాస్త్ర సారం చెబుతాను వినండి.
శ్రీహరి కథను సంగ్రహంగా చెబుతాను. శ్రీహరి పట్ల ఆసక్తులై, ఆకర్షితులైన వారు ఘోరమైన నరకాల్లో పడకుండా సంసార సముద్రం నుంచి తరిస్తారు. కార్తీకంలో హరిని పూజించి స్నానం, దానం, ఆలయాల్లో రాత్రి వేళ దీపం వెలిగించే వారు అనేక పాపాల నుంచి శీఘ్రంగా ముక్తులవుతారు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించింది మొదలు 30 రోజులు కార్తీక వ్రతం చేయాలి. అలా చేసే వాడు జీవన్ముక్తుడవుతాడు.
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్ర్తీలు కార్తీక వ్రతం చేయకపోతే తమ పూర్వీకులతో సహా అంధతామిశ్రం అనే నరకంలో (చీకటిమయమై ఏమీ కనిపించదిని) బాధలనుభవిస్తారు. ఇందులో ఎలాంటి సంశయం లేదు.
కార్తీక మాసంలో కావేరీ జలంలో స్నానం చేసే వారు దేవతల చేత ప్రశంసలు పొందుతూ హరిలోకం చేరతారు. కార్తీక మాసంలో స్నానం చేసి హరిని పూజించిన వారు విగత పాపులై వైకుంఠం చేరతారు.
మునీశ్వరులారా, కార్తీక వ్రతం చేయని వారు వేయి జన్మల్లో ఛండాలురై పుడతారు. కార్తీక మాసం బహు పుణ్యకరం. సర్వమాసాల్లో శ్రేష్ఠమైనది. కార్తీక వ్రతం హరిప్రీతిదాయకం. సమస్త పాపహరం. దుష్టాత్ములకు ఇది అలభ్యం. తులలో రవి ఉండగా కార్తీక మాసంలో స్నానం, దానం, పూజ, హోమం, హరిసేవ చేసే వారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షం పొందుతారు.
కార్తీక మాసంలో దీపదానం, కంచుపాత్ర దానం, దీపారాధనం, ధాన్య, ఫల, ధన, గృహదానం అనంత ఫలప్రదాలు.
ధనికుడు గాని, దరిద్రుడు గాని హరి ప్రీతి కోసం కార్తీక మాసంలో కథను విన్నా, కథను వినిపింపచేసినా అనంత ఫలం పొందుతారు. కార్తీక మాహాత్మ్యం సర్వపాపాలను హరింపచేస్తుంది. సమస్త సంపత్తులు కలుగచేస్తుంది. అన్ని పుణ్యాల కన్నా అధికం. ఎడరు ఈ పవిత్రమైన, విష్ణు ప్రీతికరమైన అధ్యాయం వింటారో వారు ఈ లోకంలో గొప్ప సుఖాలనుభవించి పరలోకంలో బ్రహ్మానందం పొందుతారు. తిరిగి ఒక జననమరణ ప్రవాహంలో పడకుండా చేసేదే పరమ సుఖం లేదా నిత్య సుఖదాయిని. ఇది ఆచరించి అందరూ ముక్తి పొందుతారి ఆశిస్తున్నాను అంటూ సూత మహర్షి ముగించాడు.

30వ
రోజు పారాయణం ముగిసింది.
పద్మపురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యం సమాప్తం
కార్తీక పురాణం- 29వ రోజు పారాయణం (బహుళ చతుర్దశి రోజున)
సప్తవింశాధ్యాయం
నారదుని హితవుపై రవంత చింతించిన రవి సుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుని నతనతో తీసుకు వెళ్తూ మార్గమధ్యంలో నరకం లోకంలో భిన్న విభాగాలను చూపిస్తూ వివరించాడు.
తప్తవాలుకము : ఓ ధనేశ్వరా మరణించిన వెంటనే పాపకర్ములను ఇక్కడకు తీసుకువస్తారు. వారి శరీరాలు కాలుస్తూ ఉంటే దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తూ ఉంటారు. దీనిని తప్తవాలుక నరకం అంటారు. వైశ్వదేవవరులైన అతిథులను పూజించని వారు; గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేదవిదులను, యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు అన్నాడు.
అంధతామిస్రము : ఈ నరకంలోసూది మొనలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచేస్తూ ఉంటాయి. ఇది పదహారు రకాలుగా కుక్కలు, గ్రద్దలు, కాకులు మొదలైన పక్షిజంతుసమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాలను భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలో దండనలు అనుభవిస్తూ ఉంటారు.
క్రకచము : ఇది మూడో నరకం. ఇక్కడ పాపాత్ములను అడ్డంగా, నిలువుగా, ఏటావాలుగా, ఐమూలంగా అంగాంగాలనూ రంపాలతో కోస్తూ ఉంటారు.
అసివ్రతవనం : ఇది నాలుగో రకం నరకం. భార్యాభర్తలు, తల్లిదండ్రుల నుంచి సంతానం విడదీసిన పాపులంతా ఈ నరకానికి చేరతారు. వారిని నిలువెల్లా బాణాలతో గుచ్చి, అసివ్రతాలచే కోస్తూ ఉంటారు. ధారలు కారే నెత్తుటి వాసనకు తోడుళ్లు వెంటబడి తరుముతూ ఉంటే భయపడి పారిపోవాలని పరుగులు తీస్తూ పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట వంటి విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది.

కూటశాల్మలి : పరస్ర్తీలను, పరద్రవ్యాన్ని హరించిన వారు, ఇతరులకు అపకారం తలపెట్టిన వారు ఈ నరకంలో శిక్షలు అనుభవిస్తూ ఉంటారు.
రక్తపూయము : ఆరవదైన ఈ రక్తపూయ నరకంలో పాపాత్ములను తలకిందులుగా వేలాడదీసి యమకింకరులు దండిస్తూ ఉంటారు. కులాచారాల రీత్యా తినకూడని వస్తువులు తిన్న వారు, పరనింద చేసిన వారు, చాడీలు చెప్పిన వారు ఈ నరకానికి చేరతారు.
కుంభీపాకము : ఇది నరకాలన్నింటిలోనూ ఘోరాతిహోరమైనది, అత్యంత నికృష్టమైనది. మొట్టమొదట నిన్ను చేర్చింది ఆ నరకానికే. దుష్ట ద్రవ్యములు, దుర్భరాగ్ని కీలలు, దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది.
రౌరవము : నరకాలన్నింటిలో ఎనిమిదోదైన ఈ నరకం చేరిన వారు వేలాది సంవత్సరాల పాటు ఇక్కడ శిక్షలు అనుభవించాల్సిందే. ఈ నరకంలో పడిన వారికి విముక్తి దీర్ఘకాలికం.
ధనేశ్వరా, మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ర్దమని అంటారు. ఈ రెండు రకాల పాపాలూ కలిపి ఏడు విధాలుగా ఉంటాయి. అపకీర్ణం, సాంక్తేయం, మలినీకరణం, జాతిభ్రంశం, ఉపవీతకం, అతి పాతకం, మహా పాతకం. దుష్టులైన నరులు, దుష్ట చర్యలకు పాల్పడిన వారు ఈ నరకాలన్నీ వరుసగా అనుభవిస్తూ ఉంటారు. కాని నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం వలన ఈ నరకాలను తప్పించుకోగలిగావు. కేవలం దర్శనమాత్రంగానే ఈ నరకాలు దాటావు.
ఇలా అన్ని రకాల నరకాలను దృశ్యమానంగా చూపిస్తూ ఆ యమదూత అతన్ని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతను యక్షరూపుడై, కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరు పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరచిన ధరయక్ష తీర్థం ఇతని పేరు మీద ఏర్పడిందే.
అందువలన పాపహారిణి, శోకనాశని అయిన ఈ కార్తీక వ్రతప్రభావం వలన మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు అని సత్యభామకు చెప్పిన శ్రీకృష్ణుడు సంధ్యానుష్ఠానం కోసం స్వగృహానికి వెళ్లాడని సూతమహాముని ఋషులకు ప్రవచించాడు.
సప్తవింశోధ్యాయ సమాప్తః
---------------
---------------
అష్టావింశోధ్యాయము
సూతుడు ఇలా చెబుతున్నాడు
ఈ కార్తీక మాసం పాపనాశని, విష్ణు ప్రియకరి. భక్తులకు భుక్తి, ముక్తి ప్రదాయిని. కల్పోక్త విధిగా ముందుగా విష్ణుజాగారం, ప్రాతః స్నానం, తులసీ సేవ, ఉద్యాపనం, దీపదానం అనే ఈ ఐదింటినీ ఆచరించిన వారు ఇహంలో భుక్తి పొందగలుగుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించింది మరొకటి లేదు. ధర్మార్ధ కామ మోఖాలు నాలుగింటికీ ఈ వ్రతాన్ని ఆచరించాల్సిందే.

కష్టాల్లో ఉన్న వాడు, దుర్గమ అరణ్యాల పాలైన వాడు, రోగగ్రస్తులు ఈ వ్రతాన్ని పాటించాలి. ఎలాంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతం మానకుండా ఆచరిస్తూ శివాలయంలోనో, విష్ణ్వాలయంతోనో హరిజాగారం చేయాలి. శివవిష్ణు ఆలయాలు సమీపంలో లేనప్పుడు రావి చెట్టు వద్ద లేదా తులసీవనంలో వ్రతం చేసుకోవచ్చు. విష్ణుసన్నిధానంలో విష్ణుకీర్తన ఆలపించే వారు సహస్ర గోదాన ఫలాన్ని, వాద్యాలు వాయించే వారు అశ్వమేథ ఫలాన్ని, నర్తకులు సర్వతీర్థాల ఫలాన్ని పొందుతారు. ఆపదల్లో ఉన్న వాడు, రోగి, మంచినీరు దొరకని వాడు కేశవ నామాలు చేస్తే చాలును. వ్రతోద్యాపనకు శక్తి లేని వారు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది.
శ్లో- అవ్యక్త రూపిణో విష్ణోః స్వరూపో బ్రాహ్మణో భువి
శ్రీ మహావిష్ణువు స్వరూపమే బ్రాహ్మణుడు. కాబట్టి కార్తీక మాసంలో బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం.
అందుకు శక్తి లేని వారు గోపూజ చేసినా చాలును. ఆ పాటి శక్తయినా లేని వారు రావి, మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే కార్తీక వ్రతం సంపూర్ణం చేసిన ఫలాన్ని పొందగలుగుతారు.
దీపదానం చేసే స్తోమత లేని వారు, దీపారాధనకైనా తాహతు లేని వారు ఇతరులు వెలిగించిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి వలన కొండెక్కకుండా పరిరక్షించానా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేని వారు తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి.
రావి-మర్రి
సూతుడు చెప్పింది విని ఇతర వృక్షాలన్నింటి కన్నా కూడా రావి, మర్రి వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణ తుల్యమైన పవిత్రత ఎలా పొందాయి అని మునులు అడిగారు.
పూర్వం ఒక సారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు, అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్లి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు అలిగిన పార్వతీదేవి సృష్టిలో క్రిమికీటకాదులు కూడా సురతంలో సుఖపడుతున్నాయి. అలాంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత భంగం కలిగించిన మీరు చెట్లుగా పడిఉండండి అని శపించింది. ఆ కారణంగా దేవతలందరూ వృక్షాలుగా మారిపోయారు. ఆ పరిణామంలో బ్రహ్మ పాలాశ వృక్షంగానూ, విష్ణువు అశ్వత్థంగాను, శివుడు వటవృక్షంగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గలవి గనుకనే రావి, మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధించినది కావడం వల్ల శనివారంనాడు మాత్రమే పూజనీయమయింది. ఇతర వారాల్లో రావి చెట్టు తాకరాదు అని చెప్పి ముగించాడు సూతుడు.
శ్రీపద్మ పురాణాంతర్గతమైన కార్తీక మాహాత్మ్యం 27, 28అధ్యాయాలు సమాప్తం
29వ రోజు పారాయణం ముగిసింది.
Saturday, November 23, 2019
కార్తీక పురాణం- 28వ రోజు పారాయణం (బహుళ త్రయోదశి రోజున)
పంచవింశాధ్యాయం
శ్రీ కృష్ణుడు సత్యభామతో ఇలా చెబుతున్నాడు. సత్యభామా, నారదుడు చెప్పిన ఆ కథలతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ మూడు వ్రతాలూ కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలయ్యాయి. మాఘ, కార్తీక వ్రతాలు వలెనే తిథులలో ఏకాదశి, క్షేత్రాల్లో ద్వారక నాకు అత్యంత ప్రీతికరమైనవి. వీటిని ఎవరైతే విధివిధానంగా ఆచరిస్తారో వారు నాకు యజ్ఞాది క్రతువులు, కర్మకాండలు చేసిన వారి కన్నా చేరువైపోతారు. అటువంటి వారు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వారవుతారు.
శ్రీకృష్ణుని మాటలతో విస్మయం చెందిన సత్యభామ స్వామీ ధర్మదత్తుడు ధారపోసిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది.కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయంకృతాలో, కర్తల నుంచి దత్తములో అయినవి సరే, అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలేర్పడే విధానం ఏమిటి, వివరించు అని కోరడంతో గోవిందుడిలా చెప్పసాగాడు.
పాపపుణ్యాలు ఏర్పడే విధానం
శ్లో -దేశగ్రామకులానిస్యుర్భోగభాం జికృతాధిషు
కలౌతు కేవలం కర్తా ఫలభక్పుణ్యపాపయోః
ప్రియా, కృతయుగంలో చేసిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపర యుగంలోని పాపపుణ్యాలు వారి వంశాలకి చెందినవి అయి ఉంటాయి. కలియుగంలో చేసే కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే చెందుతుంది.
సంసర్గ రహిత సమాయుక్తాలనే పాపపుణ్యాలను గురించి చెబుతాను, విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్ర్తీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను, సంపూర్ణంగాను అనుభవిస్తున్నాడు.
వేలాది బోధనల వలన, యజ్ఞం చేయడం వలన, పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాల్లో నాలుగో వంతు మాత్రమే పొందుతున్నాడు. ఇతరులు చేసిన పాపపుణ్యాలను చూడడం వలన, తలంచుకోవడం వలన అందులోని వందో భాగాన్ని పొందుతున్నాడు. ఇతరులను దూషించే వాడు, తృణీకరించే వాడు, చెడుగా మాట్లాడే వాడు, పితూరీలు చేసే వాడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యం జారవిడుచుకుంటున్నాడు. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకునే వాడు తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యం ఇచ్చి తీరాలి. అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఇతరులకు జారవిడుచుకున్న వాడవుతాడు. పంక్తి భోజనాల్లో, భోక్తల్లో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరో భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నానసంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో మాట్లాడినా వారు తమ పుణ్యంలో ఆరో వంతు పుణ్యాన్ని ఇతరులకు కోల్పోతాడు. ఎవరి నుంచి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించే సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనం ఇచ్చిన వానికే దక్కుతుంది. కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన వచ్చే పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందితుంది.
ఋణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేషరుణానికి సరిపోయేటంత పుణ్యం ఋణదాతకు చెందుతుంది. పాపం కాని, పుణ్యం కాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన వాడు, ఆ పని చేయడంలో తోడ్పడే వాడు, దానికి తగినంత సాధన సంపత్తులు సమకూర్చే వాడు, ప్రోత్సహించే వాడు తలా ఆరోవంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాల్లో రాజుకు, శిష్యుని పాపపుణ్యాల్లో గురువుకు, కుమారుని నుంచి తండ్రికి, భార్య నుంచి భర్తకు ఆరోభాగం చెందుతుంది. ఏ స్ర్తీ అయితే పతిభక్తి గలదై నిత్యం భర్తను సంతోషపెడుతుందో ఆమె తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన సేవకుడు లేదా కొడుకు ఇతరుల చేసిన ఆచరింపచేసిన పుణ్యంతో తనకు ఆరో వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకే నిమిత్తం లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడంలేదు. అందుకే సజ్జన సాంగత్యమే అత్యంత ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను.
పంచవింశోధ్యాయ సమాప్తః
-------------------
శ్రీకృష్ణుని మాటలతో విస్మయం చెందిన సత్యభామ స్వామీ ధర్మదత్తుడు ధారపోసిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది.కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయంకృతాలో, కర్తల నుంచి దత్తములో అయినవి సరే, అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలేర్పడే విధానం ఏమిటి, వివరించు అని కోరడంతో గోవిందుడిలా చెప్పసాగాడు.
పాపపుణ్యాలు ఏర్పడే విధానం
శ్లో -దేశగ్రామకులానిస్యుర్భోగభాం
కలౌతు కేవలం కర్తా ఫలభక్పుణ్యపాపయోః
ప్రియా, కృతయుగంలో చేసిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపర యుగంలోని పాపపుణ్యాలు వారి వంశాలకి చెందినవి అయి ఉంటాయి. కలియుగంలో చేసే కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే చెందుతుంది.
సంసర్గ రహిత సమాయుక్తాలనే పాపపుణ్యాలను గురించి చెబుతాను, విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్ర్తీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను, సంపూర్ణంగాను అనుభవిస్తున్నాడు.
వేలాది బోధనల వలన, యజ్ఞం చేయడం వలన, పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాల్లో నాలుగో వంతు మాత్రమే పొందుతున్నాడు. ఇతరులు చేసిన పాపపుణ్యాలను చూడడం వలన, తలంచుకోవడం వలన అందులోని వందో భాగాన్ని పొందుతున్నాడు. ఇతరులను దూషించే వాడు, తృణీకరించే వాడు, చెడుగా మాట్లాడే వాడు, పితూరీలు చేసే వాడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యం జారవిడుచుకుంటున్నాడు. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకునే వాడు తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యం ఇచ్చి తీరాలి. అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఇతరులకు జారవిడుచుకున్న వాడవుతాడు. పంక్తి భోజనాల్లో, భోక్తల్లో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరో భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నానసంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో మాట్లాడినా వారు తమ పుణ్యంలో ఆరో వంతు పుణ్యాన్ని ఇతరులకు కోల్పోతాడు. ఎవరి నుంచి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించే సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనం ఇచ్చిన వానికే దక్కుతుంది. కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన వచ్చే పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందితుంది.
ఋణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేషరుణానికి సరిపోయేటంత పుణ్యం ఋణదాతకు చెందుతుంది. పాపం కాని, పుణ్యం కాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన వాడు, ఆ పని చేయడంలో తోడ్పడే వాడు, దానికి తగినంత సాధన సంపత్తులు సమకూర్చే వాడు, ప్రోత్సహించే వాడు తలా ఆరోవంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాల్లో రాజుకు, శిష్యుని పాపపుణ్యాల్లో గురువుకు, కుమారుని నుంచి తండ్రికి, భార్య నుంచి భర్తకు ఆరోభాగం చెందుతుంది. ఏ స్ర్తీ అయితే పతిభక్తి గలదై నిత్యం భర్తను సంతోషపెడుతుందో ఆమె తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన సేవకుడు లేదా కొడుకు ఇతరుల చేసిన ఆచరింపచేసిన పుణ్యంతో తనకు ఆరో వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకే నిమిత్తం లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడంలేదు. అందుకే సజ్జన సాంగత్యమే అత్యంత ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను.
పంచవింశోధ్యాయ సమాప్తః
-------------------
షడ్వింశోధ్యాయం
ధనేశ్వరుడి కథ-సత్యాంగత్య మహిమ
చాలా కాలం క్రితం అవంతీపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడుండే వాడు. సహజంగానే ధనికుడైన అతడు కులాచార భ్రష్టుడై, పాపాసక్తుడై చరించే వాడు. అసత్యాలు పలుకుతూ వేశ్యలతో గడుపుతూ మధుపానాలు, దొంగతనాలు చేస్తూ కాలం గడిపే వాడు. షడ్రసాలు, కంబళ్లు, చర్మాల వర్తకం చేసేవాడు. వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడం అతని అలవాటు. అదే విధంగా ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తుంది.
ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతి పెద్ద యాత్రాస్థలంగా మారింది. వచ్చేపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా, ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతీరోజూ నర్మదా నదీ తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన, జప, దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు. నృత్య, గాన, మంగళ వాద్యయుతంగా హరికీర్తనలు, కథలు ఆలపించే వారు, విష్ణుముద్రలను ధరించిన వారు, తులసి మాలలతో అలరారుతున్న వారు అయిన భక్తులను చూశాడు. చూడడమే కాదు, నెల పొడుగునా తానక్కడే మసులుతూ ఉండడం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూ ఉండే వాడు. ఎందరో పుణ్యవంతులను స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడూ విష్ణునామోచ్చారణచేశాడు.
నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తీకోద్యాపనా విధినీ, విష్ణు జాగారాన్ని కూడా ధనేశ్వరుడు దర్శించాడు. పౌర్ణమినాడు గో బ్రాహ్మణ పూజలాచరించి, దక్షిణ భోజనాదులు సమర్పించే వ్రతస్థులను చూశాడు. సాయంకాల వేళల్లో శివప్రీత్యర్ధం చేసే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామా, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమా!
శ్లో - మమరుద్రస్యయః కశ్చిదంతరం పరికల్పయేత్
తస్యపుణ్య క్రియాస్సర్వా నిష్ఫలాస్స్యర్న సంశయః
ఎవరైతే నన్ను, శివుని భేదభావంతో చూస్తారో వారి సమస్త పుణ్యకర్మలు వృధా అయిపోతాయి. శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపురాసుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయన ఆ రోజున ఆరాధనీయుడయ్యాడు.
ఇక ధనేశ్వరుడు ఈ పూజామహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోను, వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కాని ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణసర్పం అతన్ని కాటు వేయడం, అతను తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసి తీర్థం సేవింపచేయడం, ఆ అనంతర క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది.
మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుడిని పాశబద్ధుని చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకెళ్లారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు హే యమధర్మరాజా! వీడు ఆగర్భ పాపాత్ముడే, అణువంతమైనా పుణ్యం చేసిన వాడు కాడు అని చెప్పాడు. ఆ మాట విన్న దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుని తలను చితక్కొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు.
ఆ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయం కాలునికి విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి తిరిగి విచారణ చేయబోతుండగా అక్కడకు విచ్చేసిన దేవర్షి నారదుడు ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజుల్లో నరక నివారకాలైన పుణ్యాలు ఆచరించాడు. గనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శన, స్పర్శన, భాషణలకు పాత్రులో వారు ఆ సజ్జనుల పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతున్నాడు. అటువంటిది ధనేశ్వరుడు ఒక నెల పాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను సంపాదించుకున్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతడు కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్ధం పొందాడు. కర్ణపుటాల్లో హరినామస్మరణం విన్నాడు. పుణ్య నర్మదీ తీర్ధాలతో వీని దేహం సుస్నాతమయింది. అందరు హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడే అని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు. పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలయమైన నరకంలో ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్లిపోయాడు.

శ్రీపద్మ పురాణాంతర్గతమైన కార్తీక మాహాత్మ్యం 25, 26 అధ్యాయాలు సమాప్తం
28వ రోజు పారాయణం ముగిసింది.
కార్తీక పురాణం- 27వ రోజు పారాయణం (బహుళ ద్వాదశి రోజున)
త్రయోవింశొధ్యాయం
విష్ణుగణాలు చెప్పిన చోళ, విష్ణుదాసుల కథానంతరం ఓ గణాధిపతులారా, జయవిజయులు వైకుంఠంలోని ద్వారపాలకులని విన్నాను. వారెలాంటి పుణ్యం చేసుకోవడం వల్ల విష్ణుస్వరూపులై అంత స్థానం పొందారో తెలియచేయండి అంటూ ధర్మదత్తుడు అడిగాడు.
జయవిజయుల పూర్వజన్మం
తృణబిందుని కూతురు దేవహూతి. కర్దమ ప్రజాపతి దృక్ స్ఖలనం వలన ఆమెకి ఇద్దరు కుమారులు కలిగారు. వారే జయవిజయులు. వారిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు. అనతరం అష్టాక్షరీ మంత్రాన్ని పఠించడం వల్ల వారు విష్ణుసాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేదవిదులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞావంతులుగా ప్రసిద్ధి చెందారు. మరుదత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించాలని కోరాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్లి ఒకరు బ్రహ్మ, మరొకరు యాజకుడుగా ఉండి ఆ యజ్ఞాన్ని విజయవంతంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు వారికి లెక్కలేనంతగా దక్షిణ ఇచ్చాడు. ఆ సొమ్ముతో అన్నదమ్ములిద్దరూ ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వహించాలని వాంఛించారు. కాని మరుత్తు ఇచ్చిన దక్షిణ పంపకంలో ఇద్దరికీ తగాదా వచ్చింది. ఇద్దరికీ చెరి సగం అయి జయుడంటే తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు అన్నాడు. ఆ వాదోపవాదాల సందర్భంగా క్రోధంతో విజయుడు అలిగి నువ్వు మొసలివైపో అంటూ జయునికి శాపం పెట్టాడు. జయుడు కూడా అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజమై పుడతావులే అని ఎదురు శాపం పెట్టాడు. తప్పు గ్రహించిన సోదరులిద్దరూ విష్ణువును పూజించి ఆయనను సాక్షాత్కరింపచేసుకున్నారు. తమ
పరస్పర శాపాలను, దానికి కారణాలను వివరించి ప్రభూ, నీకు అత్యంత సన్నిహితులమైన మేము మొసలిగాను, ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరం. మాకు శాపాల నుంచి విముక్తి పొందే మార్గం చూపించమని వేడుకున్నారు.
విష్ణుమూర్తి నవ్వుతూ జయవిజయులారా, నా భక్తుల మాటలు పొల్లు పోకుండా చేయడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాదవాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను.అంబరీషుని వాక్యం మన్నించి వివిధ యోనుల్లోను జన్మించి దశావతారాలు ధరించాను. మీరు సత్యం తప్పిన వారు కావడం చేత శాపాలను అనుభవించి అంత్యంతో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించాడు. విష్ణుమూర్తి ఆదేశాన్ని శిరసావహించి జయవిజయులు గండకీ నదీ ప్రాంతంలో మకర, మాతంగాలుగా జన్మించారు. పూర్వజన్మ జ్జ్ఞానం గలవారై విష్ణుచింతనలోనే కాలం గడపసాగారు. అలా ఉండగా కార్తీక మాసం వచ్చింది.
కార్తీక స్నానం చేసేందుకు ఏనుగు రూపంలో ఉన్న జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోకి దిగిందే తడవుగా విజయుడు ఆ ఏనుగు పాదాన్ని బలంగా కరిచి పట్టుకున్నాడు. విడిపించుకోవడంలో విఫలుడైన జయుడు విష్ణువుని ప్రార్థించాడు. తలచిందే తడవుగా అక్కడ ప్రత్యక్షమైన విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని ప్రయోగించి కరిమకరాలు రెండింటికీ మోక్షప్రాప్తి కలిగించాడు. అప్పటి నుంచి ఆ క్షేత్రం హరిక్షేత్రంగా ప్రసిద్ధిలోకి వచ్చింది. విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రాయుధం ఒరిపిడి కారణంగా ఆ గండకీ నదిలోని శిలలకు చక్రచిహ్నాలు ఏర్పడ్డాయి.
ఓ ధర్మదత్తా నువ్వు అడిగిన విష్ణు ద్వారపాలకులైన జయవిజయులు వారిద్దరే. అందు వలన
నీవు కూడా దంభమాత్సర్యాలు విడనాడి సమదర్శనుడవై సుదర్శనాయుధుని చరణసేవలను ఆచరించు. తుల, మకర,
మేష సంక్రమణాల్లో ప్రాతః స్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షణ దీక్ష పాటించు. గో బ్రాహ్మణులను, విష్ణుభక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యం, పులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. జన్మ ఎత్తిన నాటి నుంచి నీవు ఆచరిస్తున్న ఈ కార్తీక విష్ణు వ్రతం కన్నా దాన, తపో, యజ్ఞ, తీర్థాలు ఏవీ గొప్పవి కావని తెలుసుకో. ఓ విప్రుడా దైవప్రీతికరమైన విష్ణువ్రతాచరణం వలన నీవూ, నీ పుణ్యంలో సగభాగం అందుకోవడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. మేము ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్తున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునికి బోధించి ధర్మదత్తుని తిరిగి వ్రతాచరణోన్ముఖుణ్ని చేశారు. అనంతర
కలహ సమేతంగా విమానంలో వైకుంఠానికి బయలుదేరారు.
ఓ పృథురాజా, అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడు వింటాడో, ఇతరులకు వినిపిస్తాడో వాడు శ్రీమహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణుసాన్నిధ్యం పొందదగిన జ్హానవంతుడవుతాడు అని నారదుడు చెప్పాడు.
త్రయోవింశోధ్యాయ సమాప్తః
--------------
నారదుడు చెప్పిందంతా విన్న పృథు చక్రవర్తి ఆశ్చర్యచకితుడై "హే దేవర్షీ, ఇప్పుడు నీవు చెప్పిన హరిక్షేత్రం, గండకీ నదుల వలెనే గతంలో కృష్ణ, సరస్వతీ నదుల గురించి కూడా విన్నాను. ఆ మహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక, ఆ క్షేత్రాలకు చెందినవా వివరింపు" అని కోరాడు. అందుకు నారదుడు శ్రద్ధగా విను, కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం. సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మాహాత్మ్యం వర్ణించడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదంటూ ఆ కథ చెప్పసాగాడు.
కృష్ణ, సరస్వతీ నదుల ఉద్భవం
ఒకానొక చాక్షుస మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్య పర్వత శిఖరాలపై సవనం చేసేందుక సమాయత్తం అయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలు, మునులు ఒకానొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు దీక్ష ఇవ్వడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రం సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు.
దీక్షాముహూర్తం అతిక్రమించరాదనే నియమం వల్ల భృగు మహర్షి హే విష్ణూ, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు. ముహూర్తం దాటిపోతోంది. ఇప్పుడేంటి గతి అని ప్రశ్నించారు. శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరో భార్య అయిన గాయత్రిని దీక్షాసతిగా నిర్ణయించండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష ఇవ్వడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన
స్థానంలో దీక్షితురాలై ఉన్న ఆ సవతి గాయత్రిని చూపి మత్సరంలో
శ్లో - అపూజ్యా యత్ర పూజ్యంఏ, పూజ్యానాంచ వ్యతిక్రమః
త్రీణిత్రత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం
ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడతారో, పూజనీయులు పూజలందుకోవడంలేదో అక్కడ కరువు, భయం, మరణం అనే మూడు విపత్తులూ కలుగుతాయి.
బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ఠురాలైన ఉవిద ప్రజలకు కనిపించని రహస్య నదీ రూపం పొందుగాక. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నా కన్నా చిన్న దాన్ని ఆశీనురాలిని చేశారు. కనుక మీరు జడీభూత నదీ నదీ రూపాలు పొందండి అని శపించింది.
సరస్వతీ దేవి క్రోధంతో పలికిన ఆ వచనాలు వింటూనే గాయత్రి చివ్వున లేచి దేవతలు వారిస్తున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తో నాకు కూడా ఆ విధమైన భర్తేనన్న మాట విస్మరించి అకారణంగా శపించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపం ఇచ్చింది.
ఈ లోపల హరిహరులా వాణిని సమీపించి మేము నదులైనట్టయితే లోకాలననీ అతలాకుతలం అయిపోతాయి. గనుక అవివేకంతో ఇచ్చిన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు. కాని ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలనే నా కోపం రూపంగా యాగానికి విఘ్నం జరిగింది. వాగ్దేవినైనా నా మాట తప్పదు. మీరందరూ నదీరూపాలు ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించాల్సిందే. సవతులమైన నేనూ, గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాం అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలూ జడాలుగానూ, రూపాలు నదులుగానూ మారాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు ఇతర నదీరూపాలుగానూ మారిపోయారు.
బ్రహ్మవిష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగానూ, వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించనారంభించారు. గాయత్రి, సరస్వతీ నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమం పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా, వినినా, వినిపించినా వారి వంశఃమంతా కూడా నదీ దర్శన, స్నాన పుణ్యఫలం పొంది తరించిపోతుంది.
పద్మపురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యం అధ్యాయాలు సమాప్తం
27వ
రోజు పారాయణం ముగిసింది
Subscribe to:
Posts (Atom)