Tuesday, November 14, 2017

కార్తీక పురాణం 30వ అధ్యాయ‌యు

ధ‌ర్మ‌సూక్ష్మ క‌థ‌న‌ము

ఋషుల‌డిగిరి. ఓ సూత‌మ‌హ‌ర్షీ మాకు పుణ్య‌మైన హ‌రి మాహాత్మ్య‌మును చెప్పితిరి. ఇంకా కార్తిక మాహాత్మ్య‌మును విన‌గోరితిమి, చెప్ప‌వ‌ల‌సిన‌ది.
క‌లియుగ‌మునందు క‌లుషిత మాన‌సులై రోగాదుల‌కు లోబ‌డి యుండి సంసార స‌ముద్ర‌మందు మునిగి యున్న వారికి అనాయాస‌ముగా పుణ్య‌ము ల‌భించెడిది ఏది?
ధ‌ర్మ‌ములోఎక్కువ ధ‌ర్మ‌మేది?   దేని వ‌ల‌న మోక్ష‌ము సిద్ధించును?  దేవ‌త‌ల లోప‌ల ఎక్కువ దేవుడెవ్వ‌డు?  ఏ క‌ర్మ‌చేత మోహ‌ము న‌శించును? క‌లియుగ‌మున మాన‌వులు మంద‌మ‌తులు, జ‌డులు, మృత్యుపీడితులును అగుదురు. వారికి అనాయాస‌ముగా మోక్ష‌ము దొరికెడి ఉపాయ‌ము చెప్పుము. ఇంకా ఇత‌ర‌మైన హ‌రిక‌థ‌ను చెప్పుము.

వారి మాట‌ల‌కు సూతుడు ఇలా ప‌లికాడు. మునీశ్వ‌రులారా! మీర‌డిగిన ప్ర‌శ్న చాలా బాగున్న‌ది. మంగ‌ళ‌క‌ర‌మైన హ‌రికీర్త‌న స్మృతికి వ‌చ్చింది. కాబ‌ట్టి స‌ర్వ‌సుఖ‌క‌ర‌మైన దానికి చెప్పెద‌ను, వినుడు.
మీరు అల్ప‌బుద్ధుల‌యిన జ‌నుల‌కు మోక్షోపాయ‌మును చెప్పుమ‌ని కోరితిరి. ఈ ప్ర‌శ్న లోకోప‌కార‌ము కొర‌యినందున నాకు చాలా ఆనంద‌దాయ‌క‌మైన‌ది. అనేక యాగాదులు చేసియు, అనేక పుణ్య‌తీర్థ‌ములందు స్నానాదిక‌మాచ‌రించియు ఏ ఫ‌ల‌ము పొందెద‌లో ఆ ఫ‌ల‌ము ఇటువంటి మంచి మాట‌ల చేత ల‌భ్య‌మ‌గును.
మునీశ్వ‌రులారా!  వినండి. కార్తీక ఫ‌ల‌ము వేదోక్త‌మైన‌ది. అన‌గా కార్తీకమందు వేదోక్త ఫ‌ల‌మును పొందెద‌ర‌ని భావ‌ము. కార్తీయ వ్ర‌త‌ము హ‌రికి ఆనంద కార‌ణ‌ము, స‌ర్వ‌శాస్త్రముల‌ను సంపూర్ణ‌ముగా చెప్పుట‌కు నేను స‌మ‌ర్థుడ‌ను కాను, కాల‌ము చాల‌దు, కాబ‌ట్టి శాస్త్రసార‌ముల‌లో సార‌మును చెప్పెద‌ను వినుడు. 

శ్రీ‌హ‌రి క‌థ‌ను సంగ్ర‌హ‌ముగా చెప్పెద‌ను వినుడు. శ్రీ‌హ‌రికాస‌క్తులు ఘోర‌మైన న‌ర‌కాల యందు ప‌డ‌క సంసార స‌ముద్ర‌ము నుండి త‌రింతురు.
కార్తీక‌మందు హ‌రిని పూజించి స్నాన‌ము, దాన‌ము, ఆల‌య‌ములందు రాత్రి దీప‌మును వెలిగించుట చేయు వారు అనేక పాప‌ముల నుంచి శీఘ్ర‌ముగా ముక్తుల‌గుదురు. సూర్యుడు తులారాశి యందు ప్ర‌వేశించిన‌ది మొద‌లు ముప్ప‌ది దిన‌ములు ఒక్క కార్తీక వ్ర‌త‌మును చేయ‌వ‌లెను. అట్ల చేయువాడు జీవ‌న్ముక్తుడ‌గును సుమా.
బ్రాహ్మ‌ణులు గాని, క్ష‌త్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని, స్త్రీలు గాని కార్తీక వ్ర‌త‌మునుచేయ‌ని ఎడ‌ల త‌మ పూర్తుల‌తో కూడా అంథ‌తా మిస్ర‌మ‌నుపేరు గ‌ల న‌ర‌క‌మును (చీక‌ట్ల‌తోగ్రుడ్డిద‌గు న‌ర‌క‌ము) పొందుదురు, సంశ‌య‌ము లేదు. 

కార్తీక‌మాస‌మందు కావేరి జ‌ల‌మందు స్నాన‌మాచ‌రించు వారు దేవ‌త‌ల చేత కొనియాడ‌బ‌డి హ‌రిలోక‌మును పొందుదురు. కార్తీక మాస‌మునందు స్నాన‌ము చేసి హ‌రిని పూజించు మాన‌వుడు విగ‌త పాపాడై వైకుంఠ‌మును చేరును.
మునీశ్వ‌రులారా!  కార్తీక‌వ్ర‌త‌మును చేయ‌ని వారు వేయి జ‌న్మ‌ములందు చండాలురై పుట్టుదురు. కార్తీక మాస‌ము పుణ్య‌క‌ర‌ము. స‌మ‌స్త మాస‌ములందు శ్రేష్ఠ‌ము. కార్తీక వ్ర‌త‌ము హ‌రి ప్రీతిదాయ‌క‌ము. స‌మ‌స్త పాప‌హ‌ర‌ము. దుష్టాత్ముల‌కు అల‌భ్య‌ము. తుల యందు ర‌వి ఉండ‌గా కార్తీక మాస‌మందు స్నాన‌ము, దాన‌ము, పుజ‌, హోమ‌ము, హ‌రి సేవ చేయువారు స‌మ‌స్త దుఃఖ విముక్తులై మోక్ష‌మందెద‌రు.
కార్తీక మాస‌మునందు దీప‌దాన‌ము, కంచుపాత్ర‌దాన‌ము, దీపారాధ‌న‌ము, ధాన్యు, ఫ‌ల‌ము, ధ‌న‌ము, గృహ‌దాన‌ము అనంత ఫ‌ల‌ప్ర‌ద‌ములు. 


ధ‌నికుడు గాని, ద‌రిద్రుడు గాని హ‌రి ప్రీతి కొర‌కు కార్తీక మాస‌మందు క‌థ‌ను విన్నా, క‌థ వినిపింప‌చేసినా అనంత‌ఫ‌ల‌మునొందుదురు. కార్తీక మాహాత్మ్య‌ము స‌ర్వ‌పాప‌ముల‌ను న‌శింప‌చేయును.  స‌మ‌స్త సంప‌త్తుల‌ను క‌లుగ‌చేయును. అన్ని పుణ్య‌ముల క‌న్నా అధిక‌ము. ఎవ‌డు ఈ ప‌విత్ర‌మ‌గు విష్ణువుకు ప్రీతిక‌ర‌మ‌గు అధ్యాయ‌మును వినునో వాడు ఈ లోక‌మున గొప్ప సుఖాల‌ను అనుభ‌వించి ప‌ర‌లోక‌మున బ్ర‌హ్మానంద‌ము పొందును. తిరిగి ఒక జ‌న‌న‌మ‌ర‌ణ ప్ర‌వాహ‌మున ప‌డ‌కుండా చేయున‌దియే ప‌ర సుఖ‌ము లేదా నిత్య సుఖ‌ము...

                               కార్తీక పురాణ‌ము స‌మాప్తం

 

Friday, November 10, 2017

శ్ర‌ద్ధాంజ‌లి


స్నేహ‌శీలి, స‌దాచార సంప‌న్నులు, మిత‌భాషి శ్రీ‌మాన్ గుండావ‌ఝ‌ల రామ‌శాస్ర్తిగారు తేదీ 9-11-2017 ఉద‌యం మ‌నల‌నంద‌రినీ వ‌ద‌లి శ్రీ‌రామ సాయుజ్యాన్ని చేరార‌నిన తెలియ‌చేయ‌డానికి విచారిస్తున్నాను.


 వీరు త‌మ స‌హ ధ‌ర్మ‌చారిణి శ్రీ‌మ‌తి క‌ల్యాణిగారితో క‌లిసి మ‌న ప్ర‌థ‌మ అష్టోత్త‌ర శ‌త సుంద‌ర‌కాండ‌లోని ఒక సుంద‌ర‌కాండ‌ను వారి గృహ‌మునందు నిర్వ‌హించారు. 

వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని మ‌న సుంద‌ర‌కాండ యావ‌త్  కుటుంబ స‌భ్యుల‌ము ఆ ప‌రంధాముని వేడుకుందాము...

శృంగారం సింగ‌రాచార్యులు