Friday, May 15, 2009

నైవేద్యం ఎందుకు...


మనం దేవునికి పూజ చేసినప్పుడు నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకుంటాం. అసలు భగవంతునికి నైవేద్యం ఎందుకు పెట్టాలి? మనం పెట్టిన దాన్ని ఆయన ఆరగిస్తున్నాడా, లేదే...ఆయనకీ సమర్పయామి అని చెప్పి దాన్ని మనమే తింటున్నాం...ఆయన తినని కాడికి నైవేద్యం పెట్టడం ఎందుకు? దాన్ని ప్రసాదంగా మనమే తినడం ఎందుకు? ఇవన్నీ మనకి అంటూ చిక్కని ప్రశ్నలే...ప్రసాదమే కాదు మనం దేవునికి దక్షిణ కూడా ఇస్తున్నాం...అది మాత్రం ఆయన తీసుకుంటున్నాడా ;లేదే...ఇందులో ఒక అంతరార్థం ఉంది. శ్రీ కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు చేసేదెవరు, చేయించేదెవరు...అన్నింటికీ కారణభూతుడు ఆయనే...ప్రపంచంలో ఆహారానికైనా, సంపదకైనా సంపూర్ణ హక్కులున్న యజమాని ఆయన. మనం తినే తిండి నుంచి కట్టుకునే బట్ట, ఉండే ఇల్లు అన్నీ ఆయన భిక్షే..భగవంతునికి మనం నైవేద్యం పెడుతున్నాం అంటే ఇదంతా నీవిచ్చిందే..దీన్ని నీ ఖాతాలో వేసుకుంటే ఆ తర్వాత మేము అనుభవించదగిన వాటా మేం తీసుకుంటాం అని చెప్పడం అన్న మాట...భగవంతుడు నైవేద్యం రూపంలో తనకు అందిన దాన్ని ఒక ఖాతాలో వేసి ఎవరి అర్హతలకి అనుగుణంగా వారికీ పంచి ఇస్తాడు...ఇదే దక్షిణ లేదా నైవేద్యం రహస్యం ...