Thursday, January 21, 2016

తొంద‌ర‌పడండి

మ‌నం కొద్ది రోజుల క్రిత‌మే ద్వితీయాష్టోత్త‌ర శ‌త సుంద‌ర‌కాండ మ‌హోత్స‌వాలు విజ‌య‌వంతంగా పూ్ర్తి చేసుకుని తృతీయాష్టోత్త‌ర శ‌త సుంద‌ర‌కాండ నిర్వ‌హ‌ణ‌కు స‌మాయ‌త్తం అవుతున్నాం. దీనికి సంబంధించిన షెడ్యూలు ఇప్ప‌టికే అంద‌రికీ స‌ర్కులేట్ చేశాం. అయినా అంద‌రి సౌల‌భ్యం కోసం మ‌రోసారి అంద‌చేస్తున్నాం...

గురువుగారి నివాసం నంబర్ 438, సౌత్ ఎండ్ పార్క్, మ‌న్సూరాబాద్‌, ఎల్‌బిన‌గ‌ర్‌, హైద‌రాబాద్‌లో హోమ‌రూపంలో జ‌రుగ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఆస‌క్తి గ‌ల వారు త్వ‌ర‌గా త‌మ పేర్లు న‌మోదు చేసుకోవాల‌ని గురువుగారు ఇప్ప‌టికే అంద‌రికీ తెలియ‌చేశారు. రెండు కుండాల‌తో నాలుగు రోజులు జ‌రిగే ఈ క్ర‌తువులో 32 మంది దంప‌తుల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది. స‌మ‌యం చాలా త‌క్కువ ఉంది. అయినా ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ హోమంలో పాల్గొనేందుకు ఆస‌క్తి ప్ర‌క‌టిస్తూ పేర్లు న‌మోదు చేసుకోలేదు. 32 మంది క‌న్నా ఎక్కువ మంది దంప‌తులు వ‌స్తే లాట‌రీ తీసి అందులో ఎంపికైన అదృష్ట‌వంతుల‌కు మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించాల‌ని గురూజీ భావిస్తే అస‌లు ఒక్క ద‌ర‌ఖాస్తు కూడా రాక‌పోవ‌డం గురువుగారికి బాధ‌గా ఉంది. ఈ విష‌యం దృష్టిలో ఉంచుకుని ఆస‌క్తి గ‌ల వారు స‌త్వ‌రం పేర్లు న‌మోదు చేసుకోవ‌ల‌సిందిగా సూచ‌న‌. మ‌నం భ‌ద్రాచ‌లం యాత్ర‌కు వెళ్ళే స‌మ‌యానికి కూడా త‌గినంత మంది ముందుకు రాక‌పోతే రాముల‌వారి స‌న్నిధిలోనే ఆ విష‌యం ప్ర‌క‌టించి ఆస‌క్తి గ‌ల వారి పేర్లు అక్క‌డిక‌క్క‌డే తీసుకుని లాట‌రీ తీయాల‌ని గురువుగారు భావిస్తున్నారు. అంత‌క‌న్నా ముందే మ‌న పేర్లు న‌మోదు చేసుకుని తృతీయాష్టోత్త‌ర శ‌త సుంద‌ర‌కాండ‌కు చ‌క్క‌ని ఆరంభం ఇద్దాం. త్వ‌ర‌పడండి. వాట్స‌ప్‌లో పేర్లు ఇచ్చినా గురూజీకి అంద‌చేయ‌డం జ‌రుగుతుంది. 

కార్య‌క్ర‌మం వివ‌రాలు
ఫిబ్ర‌వ‌రి 2        : క‌ల‌శ‌స్థాప‌న‌, కంక‌ణ‌ధార‌ణ‌లు
ఫిబ్ర‌వ‌రి 3-6     : రెండు కుండాల‌తో సుంద‌ర‌కాండ క్ర‌తువు 
ఫిబ్ర‌వ‌రి 7        : స‌హ‌స్ర‌నామార్చ‌న‌

Tuesday, January 19, 2016

కుడి ఎడ‌మైతే పొర‌పాటు లేదోయ్‌...

భ‌ద్రాచ‌లం యాత్ర‌కు అంతా సిద్ధం అవుతోంది. బ‌స్సుల ఏర్పాటు కూడా పూర్త‌యింది. రెండు బ‌స్సుల్లోనూ యాత్రికుల‌కు సీట్ల కేటాయింపు స్వ‌యంగా గురువుగారే చేశారు. కాని వ్య‌వ‌ధి త‌క్కువ‌గా ఉండ‌డంతో పాటు త్వ‌రితంగా అంద‌రికీ స‌మాచారం అంద‌చేసే ప్ర‌య‌త్నంలో సీట్ల కేటాయింపు చార్టుల్లో ఎడ‌మ‌, కుడి సీట్ల‌ను గుర్తించ‌డంలో ఒక‌టి రెండు చిన్న పొర‌పాట్లు చోటు చేసుకున్న‌ట్టు మా దృఫ్టికి వ‌చ్చింది. కాని సీట్ల సంఖ్య‌కు అనుగుణంగానే కేటాయింపు జ‌రిగింది. ఒక‌టి రెండు చిన్న పొర‌పాట్లుంటే బ‌స్సుల‌కు క‌న్వీన‌ర్లుగా నియ‌మితులైన ఆత్మూరి రాఘ‌వ‌రావు, క‌స్తూరి కాంతారావుగార్లు ఇద్ద‌రూ అప్ప‌టిక‌ప్పుడు ఎవ‌రికీ ఎలాంటి అసౌక‌ర్యం లేని రీతిలో స‌ద్దుబాటు చేస్తార‌ని గురువుగారు తెలియ‌చేస్తున్నారు. అది కూడా వారిద్ద‌రి సొంత నిర్ణ‌యం ఏ మాత్రం కాదు.అంతా గురూజీ మార్గ‌ద‌ర్శ‌కం మేర‌కే జ‌రుగుతుంది. చిన్న చిన్న విష‌యాల‌కు ప‌ట్టుద‌ల‌ల‌కు పోకుండా మ‌నంద‌రం యాత్ర‌కు పోయి విజ‌య‌వంతంగా తిరిగివ‌ద్దాం. ఇది కూడా గురువుగారి సందేశ‌మే... 

భ‌ద్రాచ‌లం యాత్ర బ‌స్సు 2


భ‌ద్రాచ‌లం యాత్ర బ‌స్సు 1


Sunday, January 17, 2016