Tuesday, May 12, 2020
Sunday, April 19, 2020
Saturday, April 18, 2020
ఈ రోజు ధన్వంతరి హోమం దృశ్యాలు
కరోనాసుర సంహారాన్ని కోరుతూ శ్రీరామనామ జపం చేయాలన్న మన గురూజీ సందేశం మేరకు అందరం రంగంలోకి దిగి మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు శ్రీరామనామ పారాయణం ఎంతో భక్తి శ్రద్ధలతో చేశాము. మొత్తం 300 మందికి పైగా శిష్యులు, వారి బంధుమిత్రులు శ్రీరామనామ పారాయణ దీక్ష స్వీకరించి శ్రీ రామనామం జపించారు. మొదట మార్చి 28 నుంచి ప్రారంభించి ఏప్రిల్ 8వ తేదీ లోగా కోటి వెయ్యి నూట ఎనిమిది (1,00,01,108) నామాలు పారాయణ చేయాలని గురూజీ నిర్దేశించారు. అప్పటికే ఆ సంఖ్య దాటిపోయింది. అయినా కూడా ఈ నెల 14 వరకు జపాన్ని గురూజీ పొడిగించారు. ఇంకా తుది లెక్క తెలియాల్సి ఉంది. నా ఉద్దేశంలో అందరం కలిసి చేసిన నామజపం 2 కోట్లు దాటిపోయి ఉంటుంది. ఈ రోజున గురువుగారు శ్రీరామనామ జపం చేసిన వారందరి పేర్ల మీద సంకల్పం చెప్పి లోకకల్యాణం, సర్వజన క్షేమం, కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి ఆకాంక్షిస్తూ ధన్వంతరి హోమం సమీపంలోనే ఉన్న ఒక బ్రాహ్మణోత్తముని సహాయంతో నిర్వహించి సుదరకాండ కుటుంబం అందరికీ తమ ఆశీస్సులు అందచేశారు. ఆ ఫొటోలు, వీడియోలు అందరి కోసం పోస్ట్ చేస్తున్నాను.
Tuesday, April 14, 2020
రామనామ జపం పూర్తయింది, శనివారం ధన్వంతరి హోమం
గురువుగారు పంపిన చివరి రోజు నివేదిక పంపుతున్నాను. నివేదిక చదివితే అంతా అర్ధం అవుతుంది. అయినా నేను కూడా ఆయన చెప్పిన విషయం సంక్షిప్తంగా రాస్తున్నాను. వచ్చే శనివారం ఉదయం ఉదయం గురువుగారు ధన్వంతరి హోమం చేసి మనందరి గోత్ర నామాలతో ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆయన పంపిన నివేదికలోని
"ఓం వాసుదేవాయ విద్మహే వైద్యరాజాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్"
అనే మంత్రం మనందరం శనివారం ఉదయం ఉదయం 7 గంటలకు కనీసం 11 సార్లు జపం చేస్తే సరిపోతుంది. కింద రాసిన బీజాక్షరాలతో కూడిన మంత్రం గురూపదేశం లేకుండా ఎవరూ చదవకూడదు. అలా చదివితే బెడిసి కొడుతుంది. జాగ్రత్త. ఈ నియమం తప్పనిసరిగా పాటించాలి. చక్కగా ఇన్ని రోజులు పారాయణ చేసిన తర్వాత ఈ రామనామ పారాయణలో పాల్గొన్న వారందరి గోత్రనామాలు నివేదిస్తూ మనందరి పేర్ల మీద జరుగుతున్న ఈ హోమం ఇంటిలో ఎవరికీ కరోనా దరి చేరకుండా కాపాడుతుంది. శుభాకాంక్షలు.

Sunday, March 29, 2020
నేటి టాపర్ కూచిభొట్ల సురేఖ
15,660 నామాల జపం
ద్వితీయ స్థానంలో మేచినే శశికళ
రెండో రోజు నివేదిక
శ్రీరామ కోటి సహిత శత షోడశ నామ పారాయణం రెండో రోజు నివేదిక ఇది. ఈ రోజు భక్తులు అత్యుత్సాహంతొ 3,30,650 నామాలు పారాయణ చేసినట్టు గురువుగారు ప్రకటించారు. ఇందులో సీరియల్ నంబర్ 4. శ్రీమతి కూచిభొట్ల సురేఖ 15,660 నామాలు పారాయణ చేసి ప్రథమ స్థానంలో నిలవగా సీరియల్ నంబర్ 38.శ్రీమతి మేచినేని శశికళ 14,040 నామాలు పారాయణ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇద్దరికీ గురూజీ ఆశీస్సులు అందచేశారు.

Friday, March 27, 2020
గురూజీ మహత్సంకల్పం
కరోనా భూతాన్ని దేశం నుంచి తరిమి కొట్టడం కోసం సుందరకాండ కుటుంబం శక్తివంచన లేకుండా తమ వంతు కృషి చేయడానికి గురూజీ ఒక మహత్కార్యం చేపట్టారు. అందుకు సంబంధించిన సర్కులర్ ఇందులో పొందుపరచడం జరుగుతోంది. మా సుందరకాండతో దీర్ఘకాలిక అనుబంధం ఉన్న వారితో పాటు ఈ గ్రూప్ లో సభ్యులుగా చేరిన వారికి కూడా ఈ మహదవకాశం కల్పించాలన్న లక్ష్యంతో ఆ సర్కులర్ పోస్ట్ చేస్తున్నాను. దయ చేసి ప్రతీ ఒక్కరూ దాన్ని పూర్తిగా చదివి ఆసక్తి ఉంటే నా నంబర్ 903799169కి గోత్రం, ఇంటిపేరు, యజమాని పేరు, ఫోన్ నంబర్ పంపండి. వారందరి జాబితా కూడా గురూజీకి పంపుతాను. ఆ ప్రకారం మనందరి పేరు మీద గురువుగారు ఇంటిలో సంకల్పం చేస్తారు. ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని మనందరం శ్రీరామనామ జప పారాయణం చేద్దాము. ప్రతీ ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాను.
- దామరాజు వెంకటేశ్వర్లు
- దామరాజు వెంకటేశ్వర్లు
Sunday, March 22, 2020
దాచేపల్లి వారి నివాసంలో 49వ సుందరకాండ
దాచేపల్లి వెంకటరెడ్డి, హారిక దంపతుల నివాసంలో మార్చి 14 నుంచి 22 వరకు గురూజీ నిర్వహణలోని తృతీయాష్టోత్తర శత పరంపరలోని 49వ సుందరకాండ జరిగింది. ఆ కార్యక్రమం దృశ్యాల వీడియో ఇది. ఈ సారి కార్యక్రమంలో ఇంతవరకు మూడు సుందరకాండ పరంపరల్లోని 265 సుందరకాండల కార్యక్రమాల్లో జరగని ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. మన దేశంలో కూడా ఆ మహమ్మారి ప్రవేశించి రెండో దశకు చేరింది. అత్యంత ప్రమాదకరమైన మూడో దశ ప్రవేశించకుండా ఉండాలంటే మనందరం ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూడో దశకు విస్తరించకుండా ఉండేందుకు ప్రధాన నరేంద్రమోదీ ఆదివారం (తేదీ 22) ప్రజా కర్ఫ్యూ పాటించాలని పిలుపు ఇచ్చారు. దానికి సామాజిక బాధ్యతగా స్పందించిన గురూజీ సుందరకాండ కంకణధారులు తప్ప సహస్రనామార్చనకు ఎవరూ రావద్దని ఆదేశించారు. సాధారణంగా ఏ సుందరకాండలో అయినా ఎంత మంది పాల్గొంటే అంత మంచిదని పదేపదే పిలుపు ఇచ్చి ప్రోత్సహించే గురూజీ కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఇంతవరకు ఏ సుందరకాండలోనూ జరగలేదు. ఇంక ముందు ఇలాంటి సదర్భం రాకూడదనే ఆ స్వామివారిని కోరుకుందాం. అలాగే ఎప్పుడూ అవసరమైనంత సంఖ్యలో రామబంట్లుగా సేవ కోసం శిష్యులని ఆహ్వానించే గురూజీ ఈ సారి ఒక్క సుబ్రహ్మణ్యంగారు మినహా ఎవరూ రావద్దని ఆదేశించారు. అది కూడా తెల్లవారు ఝామున 4 గంటలకి ప్రారంభించి 6 గంటలకల్లా మొత్తం కార్యక్రమం ముగించేశారు. 7 గంటలకల్లా అందరూ ఇళ్లకి చేరి ప్రధాని పిలుపు మేరకు ప్రజా కర్ఫ్యూలో భాగస్వాములయ్యేందుకు ఇలా చేశారు. హాట్సాఫ్ గురూజీ.
Thursday, March 12, 2020
Subscribe to:
Posts (Atom)