Thursday, November 21, 2019

కార్తీక పురాణం 25వ రోజు పారాయణం (బ‌హుళ ద‌శ‌మి రోజున‌)

ఏకోన‌వింశ‌త్యాధ్యాయం
నార‌దా, నీవు అత్య‌ద్భుతంగా చెప్పిన తుల‌సీ మాహాత్మ్యాన్ని విని ధ‌న్యుడిన‌య్యాన‌ను. అదే విధంగా కార్తీక వ్ర‌తాచ‌ర‌ణా ఫ‌లితాల‌ను కూడా ఎంతో చ‌క్క‌గా చెప్పావు. గ‌తంలో ఈ వ్ర‌తం ఎవ‌రు ఎలా ఆచ‌రించారో కూడా స‌వివ‌రంగా తెలియ‌చేయి అని పృథువు అడిగాడు. దానికి స‌మాధానంగా నార‌దుడు ఈ దిగువ క‌థ వివ‌రించాడు.
ధ‌ర్మ‌ద‌త్తోపాఖ్యానం
దీర్ఘ‌కాలం క్రితం స‌హ్య ప‌ర్వ‌త స‌మీపంలో క‌ర‌వీర‌మ‌నే ఊరుండేది. ఆ ఊరిలో ధ‌ర్మ‌వేత్త‌, నిరంత‌ర హ‌రిపూజాస‌క్తుడు, నిత్య ద్వాద‌శాక్ష‌రీ జ‌ప‌వ్ర‌తుడు, అతిథి సేవా ప‌రాయ‌ణుడు అయిన ధ‌ర్మ‌ద‌త్తుడ‌నే బ్రాహ్మ‌ణుడుండే వాడు.
ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగారం చేయ‌ద‌ల‌చి తెల్ల‌వారుఝామునే లేని పూజ‌కు అవ‌స‌రం అయిన వ‌స్తువులు స‌మ‌కూర్చుకుని విష్ణు ఆల‌యానికి బ‌య‌లుదేరాడు. ఆ దారిలో వంక‌ర‌లు తిరిగిన హోర దంష్ట్రలు, పొడ‌వైన నాలుక‌, ఎర్ర‌ని క‌ళ్లు, ద‌ళ‌స‌రి పెదాలు, మాంస‌ర‌హిత‌మైన శ‌రీరం క‌ల‌ది, పంది వ‌లె ఘూర్ణిస్తున్న ఒక దిగంబ‌ర రాక్ష‌సి తార‌స‌ప‌డింది. దాన్ని చూసి భీతి చెందిన బ్రాహ్మ‌ణుడు హ‌రినామ‌స్మ‌ర‌ణ చేస్తూ చేతిలోని తుల‌సి తీర్థంతో ఆమెను తాడించాడు.. ఆ నీళ్లు సోక‌గానే దాని పాపాల‌న్నీ ప‌టాపంచ‌లైపోయాయి. త‌ద్వారా జ్ఞానం ఏర్ప‌డింది. క‌ల‌హ పేరు గ‌ల ఆ రాక్ష‌సి త‌న పూర్వ‌జ‌న్మ క‌ర్మ‌విపాకాన్ని ఆ బ్రాహ్మ‌ణునికి విన్న‌వించింది. "పుణ్య‌మూర్తివైన ఓ బ్రాహ్మ‌ణుడా, పూర్వం నేను సౌరాష్ట్ర దేశంలో భిక్షుడ‌నే బ్రాహ్మ‌ణుని భార్య‌ను. అప్పుడు మిక్కిలి క‌ఠినురాలినై క‌ల‌హ అనే పేరుతో వ్య‌వ‌హారంలో ఉండే దానిని. నేను ఏ నాడూ భ‌ర్త ఆజ్ఞ‌ల‌ను గౌర‌వించి ఎరుగ‌ను. ఆయ‌న హిత‌వు ఆల‌కించే దాన్ని కాదు. నేన‌లా క‌ల‌హ‌కారిణినై అహంక‌రించి ఉండ‌డం వ‌ల‌న కొన్నాళ్ల‌కు నాథుని మ‌న‌సు విరిగి మారుమ‌నువాడాల‌నే కోరిక‌తో ఉండే వాడు. ఆయ‌న‌ను నేను సుఖ‌పెట్ట‌క‌పోయినా మారు మ‌నువు చేసుకోవాల‌నే ఆయ‌న కోరిక‌ను గుర్తించి భ‌రించ‌లేక విషం తాగి చ‌నిపోయాను. 
య‌మ‌దూత‌లు న‌న్ను తీసుకెళ్లి య‌ముడి ముందు నిల‌బెట్టారు. య‌ముడు చిత్ర‌గుప్తుని చూసి చిత్ర‌గుప్తా దీని క‌ర్మ‌కాండ‌లు తెలియ‌చేయి. శుభ‌మైనా, అశుభ‌మైనా స‌రే క‌ర్మ‌ఫ‌లాన్ని అనుభ‌వించాల్సిందేన‌న్నాడు. చిత్ర‌గుప్తుడు ఆయ‌న‌ను ఉద్దేశించి య‌మ‌ధ‌ర్మ‌రాజా, ఇది ఒక మంచి ప‌ని కూడా చేయ‌లేదు. ష‌డ్ర‌సోపేతంగా తాను భోజ‌నం చేసిన త‌ర్వాత కూడా భ‌ర్త‌కు అన్నం పెట్టేది కాదు. అందువ‌ల‌న మేక జ‌న్మ ఎత్తి బాధిష్ట య‌గుగాక‌. నిత్యం భ‌ర్త‌తో క‌ల‌హించి అత‌ని మ‌న‌సుకు బాధ క‌లిగించినందుకు పంది యోనిని పురుగై పుట్టు గాక‌. వంటిన వంట‌ను తానొక్క‌తే తిన్న పాపానికి పిల్లి యోనిని పుట్టి త‌న పిల్ల‌ల‌ను తానే తిను గాక‌. భ‌ర్తృద్వేషి అయి ఆత్మ‌హ‌త్య చేసుకున్నందు వ‌ల‌న అత్యంత నిందిత‌మైన ప్రేత శ‌రీరాన్ని పొందు గాక‌. ఇది ప్రేత రూపం పొంది కొన్నాళ్లు నిర్మ‌ల స్థానంలో ఉండి అనంత‌రం యోనిత్ర‌యాన జ‌న్మించి అప్ప‌టికైనా స‌త్కార్య‌ములు ఆచ‌రించు గాక" అని తీర్మానించాడు.
ఓ ధ‌ర్మ‌ద‌త్తా, అది మొద‌లుగా నేను 500 సంవ‌త్స‌రాల పాటు ఈ ప్రేత శ‌రీరం ధ‌రించి ఆక‌లిద‌ప్పుల‌తో అల్లాడుతూ నా పాపాలు త‌లుచుకుని దుఃఖిస్తున్నాను.అనంత‌రం కృష్ణాస‌ర‌స్వ‌తి సంగ‌మ స్థాన‌మైన ద‌క్షిణ దేశానికి రాగా అక్క‌డి శివ‌గ‌ణాలు న‌న్ను త‌రిమికొట్టాయి. ఆ ర‌కంగా ఇక్క‌డ‌కు చేరుకున్నాను. ఈ ప్రాంతం ద్వారా పోతూ న‌న్ను చూసి భ‌యంతో కంపించిపోయిన  నువ్వు ప‌ర‌మ‌పావ‌న‌మైన తుల‌సి తీర్థంతో న‌న్ను కొట్ట‌డం వ‌ల‌న ఈ పూర్వ‌జ‌న్మ స్మృతి క‌లిగింది. పుణ్య‌తేజ‌స్వి అయిన నీ ప్ర‌త్య‌క్ష ద‌ర్శ‌న భాగ్యం క‌లిగింది. కాబ‌ట్టి క‌ళంక ర‌హితుడ‌వైన నీవు నాకు  మోక్ష‌మార్గం బోధించు. త‌దుప‌రి ఎత్త‌వ‌ల‌సిన యోనుల‌లోని జ‌న్మ‌త్ర‌యం నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గం తెలియ‌చేయి అని ప్రాధేయ‌ప‌డింది.
క‌ల‌హ చెప్పిందంతా విని క‌ల‌త ప‌డిన మ‌న‌సు గ‌ల వాడైన ఆ విప్రుడు సుదీర్ఘ స‌మ‌యం ఆలోచించి దుఃఖ‌భార హృద‌యంతో ఇలా చెప్ప‌సాగాడు.
ఏకోన‌వింశ‌త్యాధ్యాయ స‌మాప్తః
---------------------
వింశ‌త్యాధ్యాయం
"ఓ క‌ల‌హా, తీర్థాలు సంచ‌రించి దానాలు, వ్ర‌తాలు చేయ‌డం వ‌ల‌న పాపాలు న‌శించిపోతాయి. కాని నీ ప్రేత శ‌రీరం వ‌ల‌న వాటిని ఆచ‌రించేందుకు నీకు అధికారం లేదు. అదీ గాక మూడు యోనుల్లో మూడు జ‌న్మ‌ల‌లో అనుభ‌వించాల్సిన క‌ర్మ‌ప‌రిపాకం స్వ‌ల్ప పుణ్యాల‌తో తీర‌దు. అందు వ‌ల‌న నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి ఆచ‌రిస్తున్న కార్తీక వ్ర‌త పుణ్యంలో స‌గ‌భాగాన్ని నీకు ధార‌పోస్తాను. త‌ద్వారా నీవు త‌రించి ముక్తి పొందు" అని ధ‌ర్మ‌ద‌త్తుడు చెప్పాడు.
ఆ త‌ర్వాత ఆ విప్రుడు ద్వాద‌శాక్ష‌రీ మంత్ర‌యుక్తంగా తుల‌సీ నీటితో ఆమెను అభిషేకించి కార్తీక వ్ర‌త పుణ్యాన్ని ధార‌పోశాడు. ఉత్త‌ర క్ష‌ణంలోనే క‌ల‌హ ప్రేత శ‌రీరాన్ని విడిచి దివ్య‌రూపిణి అయి అగ్ని శిఖ వ‌లె ల‌క్ష్మీక‌ళ‌తో ప్ర‌కాశించింది. అమితానందంతో ఆమె ధ‌ర్మ‌ద‌త్తునికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేసుకుంటుండ‌గానే విష్ణు పారిష‌దులు ఆకాశం నుంచి విమానంతో స‌హా వ‌చ్చారు. వారిలోని పుణ్య‌శీల‌, సుశీల అనే ద్వార‌పాల‌కులు క‌ల‌హ‌ను విమానంలోకి తీసుకోగా అప్స‌రోగ‌ణాలు ఆమెను సేవించ‌సాగాయి. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగ‌ణాల‌కు ధ‌ర్మ‌ద‌త్తుడు సాష్టాంగ‌ప‌డ్డాడు. సుశీల‌, పుణ్య‌శీల ఇద్ద‌రూ అత‌న్ని లేవ‌దీసి సంత‌సం క‌లిగించే మాట‌లు ఈ విధంగా చెప్పారు.
"ఓ విష్ణుభ‌క్తా, దీనుల యందు ద‌యాబుద్ధి గ‌ల వాడ‌వు, ధ‌ర్మ‌విదుడ‌వు, విష్ణుభ‌క్తుడ‌వు అయిన నీవు అత్యంత యోగ్యుడ‌వు. లోకోత్త‌ర‌మైన కార్తీక వ్ర‌త‌పుణ్యాన్ని ఒక దీనురాలికి త్యాగం చేయ‌డం వ‌ల‌న నీ నూరు జ‌న్మ‌ల పాపాలు స‌ర్వ‌నాశ‌న‌మైపోయాయి. ఈమె పూర్వ సంచిత‌మంతా నీవు చేయించిన తుల‌సి స్నాన ఫ‌లం వ‌ల‌న తొల‌గిపోయింది. విష్ణు జాగ‌ర‌ణ ఫ‌లంగా విమానం వ‌చ్చింది. నీవు అమెకు అర్పించిన దీప‌దాన పుణ్యం వ‌ల‌న తేజోరూపాన్ని, తుల‌సీ పూజాదుల వ‌ల‌న విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొంద‌బోతోంది. ఓ ప‌విత్ర చ‌రిత్రుడా, మాన‌వుల‌కు మాధ‌వ సేవ వ‌ల‌న క‌లుగ‌ని మ‌నోవాంఛిత‌మంటూ ఏదీ లేదు. విష్ణుత‌త్ప‌రుడ‌వైన నీవు ఇద్ద‌రు భార్య‌ల‌తోనూ క‌లిసి అనేక వేల సంవ‌త్స‌రాలు విష్ణు సాన్నిధ్యంలో వినోదిస్తావు".
ధ‌ర్మ‌ద‌త్తునికి విష్ణుదూత‌ల వ‌రం
ఓ ధ‌ర్మ‌ద‌త్తుడా, వైకుంఠంలో నీ పుణ్య‌ఫ‌లానుభ‌వం అనంత‌రం తిరిగి భూలోకంలోని సూర్య‌వంశంలో ద‌శ‌ర‌థుడ‌నే మ‌హారాజుగా పుడ‌తావు. నీ భార్య‌లిద్ద‌రూ ఆ జ‌న్మ‌లో కూడా భార్య‌లుగా వ‌స్తారు. ఇప్పుడు నీవు పుణ్యాభిషిక్త‌ను చేసిన ఈ క‌ల‌హ ఆ జ‌న్మ‌లో నీకు మూడో భార్య‌గా వ‌స్తుంది. దివ్య‌కార్యం కోసం ఈ భూమిపై జ‌న్మించ‌నున్న విష్ణువు ఆ పుట్టుక‌లో నీ కుమారుడ‌వుతాడు. ఓ ధాత్రీ సువ‌రేణ్యా, విష్ణువుకి అత్యంత ప్రీతిక‌ర‌మైన కార్తీక వ్ర‌తంతో స‌మాన‌మైన య‌జ్ఞ‌యాగాదులు గాని, దాన తీర్థాలు గాని లేవు. అంత‌టి మ‌హోత్కృష్ట‌మైన‌ది, నీవు అచ‌రించిన‌ది అయిన కార్తీక వ్ర‌తంలోని స‌గ భాగాన్ని మాత్ర‌మే పొందిన ఈ క‌ల‌హ విష్ణుసాలోక్యం పొందుతోంది. ఆమెను ఉద్ధ‌రించాల‌నే నీ సంక‌ల్పం నెర‌వేరింది. గ‌నుక నీవు దిగులు విడ‌నాడ‌వ‌య్యా అని విష్ణుదూత‌లు చెప్పారు.
వింశాధ్యాయ స‌మాప్తః   
శ్రీ‌ప‌ద్మ‌ పురాణాంత‌ర్గ‌త‌మైన కార్తీక మాహాత్మ్యం 19, 20 అధ్యాయాలు స‌మాప్తం
25వ రోజు పారాయ‌ణం ముగిసింది. 

కార్తీక పురాణం 26వ రోజు పారాయణం (బ‌హుళ ఏకాద‌శి రోజున‌)


విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్మృత చేష్ఠుడు, విస్మ రూపుడు అయిన ర్మత్తుడు వారితో రోసారి దండత్ గా ప్రణామం చేసి విష్ణు స్వరూపులారా, నానీకమంతా అనేకానేక క్రతువ్రదానాల చేత నాభుని సేవించుకుంటూ ఉన్నారు. వాటన్నింటిలోనూ ఒక్కదానిని ఆచరించడం విష్ణువుకి అమితమైన ప్రీతి లుగుతుదో, దేని విష్ణు సాక్షాత్కారం భిస్తుందో సెలవీయండి” అని వేడుకున్నాడు. అతన్ని విష్ణుగణాలు ఇలా మాధానసాగాయి
పాపహితుడైన బ్రాహ్మణుడా, నీవడిగిన ప్రశ్నకు మాధానంగా ఒక చెబుతాం విను. పూర్వం కాశీపురాన్ని చోళుడు అనే రాజు రిపాలించే వాడు. అతని పేరు మీదనే ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ర్మపాలకు పెట్టింది పేరైన రాజు విష్ణు ప్రీతి కోసం అనేకానేక జ్ఞాలు నిర్వర్తించాడు. అతని జ్ఞాల కోసం నిర్మించిన బంగారపు యూప స్తంభాలతో తామ్రర్ణి ది రెండు తీరాలు కూడా కుబేరోద్యాననాలైన చైత్రథాల లె ప్రకాశించేవి. అటువంతి రాజు ఒకానొకనాడు అనంతనే పేర యోగనిద్రాముద్రితుడై ఉండే విష్ణు ఆలయానికి వెళ్లి ణిమౌక్తిక సువర్ణ పుష్పాలతో శ్రీరిని అర్చించి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి అక్కడే శ్రీరి న్నిధిలోనే కూచున్నాడు. అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడు విష్ణుమూర్తి అర్చ కోసం ఆలయానికి చ్చాడు. విష్ణుసూక్తాన్ని ఠిస్తూ అతడు విష్ణుసంజ్ఞను అభిషేకించి తులసి ళాలు, గుత్తులతో విష్ణుపూజ నిర్వహించాడు. అది చూసి రాజుకి కోపం చ్చింది. కోపంలో తాను ర్మవేత్త అయి కూడా అవలి వ్యక్తి బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి విష్ణుదాసుడా! మాణిక్యాలతోను, బంగారు పూలతోను చేసిన నా పూజ ప్రకాశమానుడైన ప్రభువుని నీ తులసి ఆకుల పూజతో ఎందుకు ప్పేశావురా, నేనెంతో క్తితో చేసిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు క్తి అంటే ఏమిటో తెలుసా” అని చీదరించుకున్నాడు. మాటకు బ్రాహ్మణునికి కూడా కోపం చ్చింది. అవలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి రాజా నీకు దైవక్తి లేదు రికదా రాజ్యైశ్వర్యమత్తుడవై ఉన్నావు. విష్ణు ప్రీత్యర్ధం నీవు ఆచరించిన జ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు” అని ఎదురుసమాధానం ఇచ్చాడు. అతని మాటకు అవహేళగా వ్వుతూనీ మాట నీవే విష్ణక్తి శూన్యుడని తెలుస్తోంది. హీనుడవు, రిద్రుడవు అయిన నీకు క్తి ఎలా లుగుతుంది? అసలు ఒక్కసారైన విష్ణుప్రీతిగా నీవొక జ్ఞాన్ని చేశావా, నీసం ఒక దేవాలయం ట్టించావా??  ఏమీ చేయలేని నీకు క్తుడనే అహంకారం మాత్రం అధికంగా ఉంది” అని దూషిస్తూ స్యులారా, ద్ర్బాహ్మణులారా శ్రద్ధగా వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో, బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి. అంతటితో మా ఇద్దరిలో ఎవరి క్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞ చేసి చోళుడు స్వగృహానికి వెళ్లాడు. ముద్గలుడు అనే మునిపుంగవుని ఆచార్యునిగా ఎంచుకుని  విష్ణుయాగానికి మాయత్తం అయ్యాడు. హుకాల పూర్వం యా క్షేత్రంలో ఋషి ముదాయాలు చేసినది, అనేకానేక క్షిణలు, అన్నదానాలతో మానం కానిది, సామాన్యులు ఆచరించసాధ్యం కానిది, ర్వమృద్ధి లిగించేది అయిన జ్ఞాన్ని చేయసాగాడు.
పేద‌వాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణుదీక్షాబ‌ద్ధుడై హ‌రిప్రీతికై ఆచ‌రించాల్సిన మాఘ‌, కార్తీక వ్ర‌తాచ‌ర‌ణ‌లు, తుల‌సీవ‌న సంర‌క్ష‌ణ‌లు, ఏకాద‌శి నాడు ద్వాద‌శాక్ష‌రీయుత విష్ణుజ‌పం, షోడ‌శోప‌చార విధిని నిత్య‌పూజ‌లు నృత్య‌గీత‌వాద్యాది మంగ‌ళ‌ధ్వ‌నుల‌తో త‌న శ‌క్తి మేర‌కు భ‌క్తియుక్తుల‌తో ఆచ‌రించ‌సాగాడు. నిత్యం స‌ర్వ‌వేళ‌ల్లో, భోజ‌నాది స‌మ‌యాల్లో, సంచారంలో, చివ‌రికి నిద్ర‌లో కూడా హ‌రినామ స్మ‌ర‌ణ చేస్తూ ప్ర‌త్యేకించి మాఘ‌, కార్తీక మాసాల్లో విశేష నియ‌మ పాల‌న ఆచ‌రిస్తూ ఉన్నాడు. ఆ విధంగా చోళ‌, విష్ణుదాసులిద్ద‌రూ కూడా త‌మ స‌ర్వేంద్రియ వ్యాపారాల‌నూ వ్ర‌త‌నిష్ఠ‌లోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం వ్ర‌తాలు ఆచ‌రిస్తూనే ఉన్నారు.
ఏక‌వింశోధ్యాయ స‌మాప్తః
---------------- 
ద్వావిశోధ్యాయం
కాలం గ‌డుస్తూ ఉండ‌గా ఒక నాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజ‌నాన్ని ఎవ‌రో కాజేశారు. ఆ దొంగిలించిన వారెవ‌రా అనే విష‌యంలో విష్ణుదాసుడు పెద్ద‌గా విచార‌ణ చేయ‌లేదు. మ‌రోసారి వంట ప్ర‌య‌త్నం చేద్దామంటే సాయంకాలం పూజ‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డం వ‌ల‌న ఆ రోజు భోజ‌నం లేకుండా పూర్తిగా విష్ణుపూజ‌లోనే గ‌డిపేశాడు. మ‌ర్నాడు కూడా వంట  చేసుకుని శ్రీ‌హ‌రికి నివేదించే లోప‌లే ఆ వంట‌కాల‌ను ఎవ‌రో అప‌హ‌రించుకుపోయారు. విష్ణుపూజ‌కు స‌మ‌యం మించిపోకూడ‌ద‌నే ఆలోచ‌న‌లో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మ‌ణుడు భోజ‌నం లేకుండా హ‌రిసేవ కొన‌సాగించాడు. ఇలా వారం రోజుల పాటు జ‌రిగింది. ప్ర‌తీ రోజూ అత‌ని భోజ‌నాన్ని ఎవ‌రో చాక‌చ‌క్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు. అత‌ను ప‌స్తులుంటూ కూడా హ‌రిసేవ చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల పాటు అభోజ‌నంగా ఉండ‌డంతో విష్ణుదాసునికి ఆ దొంగ‌ను ప‌ట్టుకోవాల‌నిపించింది. అందువ‌ల్ల ఒక‌నాడు చాలా పెంద‌లాడే వంట‌కాల‌ను య‌థాస్థానంలో ఉంచి తాను ఒక చాటున దాక్కుని దొంగ‌కోసం ఎదురు చూడ‌సాగాడు. కాసేప‌టికి ఒక ఛండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వ‌చ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది. ర‌క్త‌మాంసాలే మాత్రం లేకుండా కేవ‌లం ఎముక‌ల మీద చ‌ర్మం క‌ప్పిన‌ట్టుగా ఉన్నాడు. అన్నార్తుడైన ఆ ఛండాలుడు వంట‌కాల‌ను దొంగిలించుకుపోసాగాడు. అత‌ని దైన్య‌స్థితిని చూసి అప్ప‌టికే క‌రుణాభ‌రిత హృద‌యంతో ఉన్న బ్రాహ్మ‌ణుడు "ఓ మ‌హాత్మా, కాసేపు ఆగ‌వ‌య్యా. ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తిన‌డం క‌ష్టం. ఈ నేతిని కూడా తీసుకెళ్లు" అంటూ నేతి జాడీతో స‌హా అత‌ని వెంట‌ప‌డ్డాడు. ఈ విప్రుడు త‌న‌ని బంధించి రాజ‌భ‌టుల‌కు అప్ప‌గిస్తాడ‌నే భ‌యంతో వాడు ప‌రుగుతీయ‌నారంభించాడు. ఈ పారుడు కూడా ఆ చోరుని వెనుకే ప‌రుగెడుతూ "అయ్యా నెయ్యి తీసుకెళ్లి క‌లిపి తిన‌వ‌య్యా స్వామీ" అని అరుస్తూనే ఉన్నాడు. అస‌లు అల‌స‌ట‌గా ఉన్న ఆ ఛండాలుడు నేల మీద ప‌డి మూర్ఛ‌పోయాడు. అత‌డిని వెన్నంటి వ‌చ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్ఛ‌పోయావా మ‌హాత్మా అంటూ త‌న వై వ‌స్ర్తం చెంగుల‌తో ఆ ఛండాలునికి విస‌ర‌సాగాడు. ఆ సేవ వ‌ల్ల త్వ‌ర‌లోనే కోలుకున్న ఆ ఛండాలుడు చిరున‌వ్వు న‌వ్వుతూ లేచాడు. ఇప్పుడిత‌ను విష్ణుదాసుని క‌ళ్ల‌కి శంఖ చ‌క్ర గ‌దాధ‌రి, పీతాంబ‌రుడు, చ‌తుర్భుజుడు, శ్రీ‌వ‌త్స‌లాంచితుడు, కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీ‌మ‌న్నారాయ‌ణుని వ‌లె గోచ‌రించ‌డంతో అత‌ను సాత్వికాభావ వృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు.ఈ భ‌క్త భ‌గ‌వానుల సంగ‌మ ద‌ర్శ‌నార్ధం ఇంద్రాదులు విమానారూఢులై ఆ ప్రాంతానికి వ‌చ్చారు. విష్ణువు మీద‌, విష్ణుదాసుని మీద పూల వ‌ర్షం కురిపించారు. అప్స‌ర‌స‌లు ఆడారు. గంధ‌ర్వులు పాడారు. దేవ‌గ‌ణాలు వ‌చ్చిన వంద‌లాది విమానాల‌తో ఆకాశం నిండిపోయింది. ఆదినారాయ‌ణుడు విష్ణుదాసుని బ‌లంగా కౌగ‌లించుకున్నాడు. త‌న సారూప్యాన్ని ప్ర‌సాదించి త‌న‌తో పాటే విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బ‌య‌లుదేరాడు.
య‌జ్ఞ‌వాటిక‌లో ఉన్న చోళుడు గ‌గ‌న‌గాములై ఉన్న బ్రాహ్మ‌ణ‌, బ్ర‌హ్మ‌జ‌న‌కులిద్ద‌రినీ చూసి ఆశ్చ‌ర్ర‌య‌పోయాడు. త‌క్ష‌ణ‌మే ఆచార్యుని పిలిచి ఓ ముద్గ‌ర మునీ నాతో వివాద‌మాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్లిపోతున్నాడు. అమిత ఐశ్వ‌ర్య‌వంతుడ‌నైన నేను అసాధ్యాలైన య‌జ్ఞ‌దానాల‌ను చేస్తూ కూడా విష్ణుసాక్షాత్కారం పొంద‌లేక‌పోయానంటే ఇక వైకుంఠం అసాధ్య‌మే క‌దా! నేను ఎన్ని య‌జ్ఞాలు చేసినా బ్రాహ్మ‌ణులు కోరినంత‌ ద‌క్షిణ‌ల‌ను స‌మ‌ర్పించినా కూడా ఆ శ్రీ‌హ‌రికి నా మీద కొంచెమైనా కృప క‌లిగిన‌ట్టు లేదు.దీనిని బ‌ట్టి కేవ‌ల భ‌క్తి త‌ప్ప విష్ణు అనుగ్ర‌హానికి మ‌రో మార్గం లేదు. ఈ య‌జ్ఞ‌యాగాది క‌ర్మ‌కాండ‌ల‌న్నీ అన‌వ‌స‌రంగా భావిస్తున్నాను అని చెప్పాడు. బాల్యం నుంచి య‌జ్ఞ‌దీక్ష‌లోనే ఉండ‌డం వ‌ల‌న నిస్సంతుడైన ఆ రాజు త‌న మేన‌ల్లునికి స్వ‌యంగా ప‌ట్టాభిషేకం చేశాడు.
శ్లో - త‌స్మాద‌ద్యాపి త‌ద్దేశే స‌దారాజ్యాంశ భాగినః
స్వ స్ర్తీయా ఏవ జాయంతే త‌త్కృతా విధి వ‌ర్తినః
ఆ కార‌ణం చేత‌నే ఇప్ప‌టికి కూడా చోళ దేశాల్లో రాజ్యాధికారాన్ని పొంద‌డంలో రాజుల మేన‌ల్లుళ్లే క‌ర్త‌ల‌వుతున్నారు.
అనంత‌రం చోళుడు య‌జ్ఞ హోమ‌గుండం ద‌గ్గ‌ర‌కు చేరి ఓ శ్రీ‌హ‌రీ త్రిక‌ర‌ణ శుద్ధిగా నీ మీద భ‌క్తిని నాలో సుస్థిరం చేయి తండ్రీ అని ప్రార్థించి స‌మ‌స్త స‌ద‌స్యులూ చూస్తుండ‌గానే అగ్ని ప్ర‌వేశం చేశాడు.
శ్లో - ముద్గ‌ల‌స్తు అతః క్రోధాచ్ఛిఖ‌ముత్పాట‌య‌న్ స్వ‌కాం
అత‌స్త్వ‌ద్యాపి త‌ద్గోత్రే ముద్గ‌లా విశిఖా2భ‌వ‌న్
అది చూసి క్రుద్ధుడైన ముద్గ‌లుడు త‌న శిఖ‌ను పెరికివేసుకున్నాడు. అది మొద‌లు ఆ గోత్రం ఈ నాటికీ విశిఖ‌గానే వ‌ర్థిల్లుతోంది.
హెమ‌గుండంలో ప్ర‌వేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భ‌వించిన శ్రీ‌హ‌రి ఆదుకున్నాడు. చోళుని ఆలింగ‌నం చేసుకుని అత‌నికి సారూప్యాన్న‌నుగ్ర‌హించి అక్క‌డి వారంద‌రూ ఆశ్చ‌ర్యంగా చూస్తుండ‌గానే త‌న‌తో వైకుంఠానికి తీసుకుని వెళ్లిపోయాడు.
ఓ ధ‌ర్మ‌ద‌త్తా, అల‌నాడే ఈ విధంగా ఆ శ్రీ‌హ‌రి అటు విష్ణుదాసుని, ఇటు చోళుని కూడా అనుగ్ర‌హించి సాక్షాత్క‌రించి త‌న వైకుంఠంలో ద్వార‌పాల‌కులుగా చేసుకున్నాడు. ఓ విప్రుడా విష్ణు అనుగ్ర‌హానికి, విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక మార్గం భ‌క్తి మాత్ర‌మే. ఆ మార్గాలు రెండూ ఒక‌టి ఆత్మ‌జ్ఞానం, రెండోది ఆత్మార్ప‌ణం. అని ధ‌ర్మ‌ద‌త్తునికి బోధించి విష్ణుపారిష‌దులు మౌనం వ‌హించారు. 
శ్రీ‌ప‌ద్మ‌ పురాణాంత‌ర్గ‌త‌మైన కార్తీక మాహాత్మ్యం 21,22 అధ్యాయాలు స‌మాప్తం
26వ రోజు పారాయ‌ణం ముగిసింది. 

కార్తీక పురాణం 24వ రోజు పారాయణం (బ‌హుళ న‌వ‌మి రోజున‌)


Wednesday, November 20, 2019

కార్తీక పురాణం- 23వ రోజు పారాయ‌ణం  (బ‌హుళ అష్ట‌మి రోజున‌)

వీర‌భ‌ద్రుని మూర్ఛ‌తో వెర్రెత్తిపోయిన శివ‌సేన పొలోమంటూ ప‌రుగు తీసి పుర‌హ‌రుని శ‌ర‌ణు వేడింది. అభ‌యుడైన శివుడు అస‌లేమీ జ‌ర‌గ‌న‌ట్టుగానే చిరున‌వ్వు చిందిస్తూ త‌న నంది వాహ‌నాన్ని అధిష్ఠించి ర‌ణ‌భూమికి బ‌య‌లుదేరాడు. అంత‌వ‌ర‌కు భ‌య‌కంపితులైన స‌మ‌స్త గ‌ణాల వారూ కూడా శివ‌సంద‌ర్శ‌న‌తో ధైర్య‌వంతులై తిరిగి ర‌ణ‌భూమిలో ప్ర‌వేశించారు. నంది వాహ‌నారూఢుడై వ‌స్తున్న శివుని చూడ‌గానే కార్తీక వ్ర‌త‌స్థుని చూపి పారిపోయే పాపాల వ‌లె రాక్ష‌సులంతా పారిపోసాగారు. జ‌లంధ‌రుడు చండీశ్వ‌రునితో త‌ల‌ప‌డ్డాడు. శుంభ‌నిశుంభ, కాల‌నేమి, అశ్వ‌ముఖ‌, బ‌లాహ‌క‌, ఖ‌డ్గ‌రోమ‌, ప్ర‌చండ‌, ఘ‌స్మ‌రాది రాక్ష‌స నాయ‌కులంద‌రూ ఒక్కుమ్మ‌డిగా ఈశ్వ‌రునితో త‌ల‌ప‌డ్డారు. స‌ర్వేశ్వ‌రుడైన శివునికి వీరేపాటి?  ఆయ‌నొక గండ్ర‌గొడ్డ‌లితో ఖ‌డ్గ‌రోముని శిర‌స్సు న‌రికేశాడు. బ‌లాహ‌కుడి త‌ల‌ను రెండు చెక్క‌లు చేశాడు. పాశ‌ప్ర‌యోగంతో ఘ‌స్మ‌రుని నేల కూల్చాడు. ఈ లోప‌ల శివ‌వాహ‌న‌మైన వృష‌భం శృంగ ఘాతాల‌కి అనేక మంది రాక్ష‌సులు య‌మ‌లోకానికి చేరారు. శివ‌ప్ర‌తాపంతో చిల్లులు ప‌డిపోయిన త‌న సేనా చ‌క్రాన్ని చూసుకుంటూ జ‌లంధ‌రుడు స‌రాస‌రి రుద్రుడినే త‌న‌తో యుద్ధానికి పిలిచాడు. ఆహ్వాన‌సూచ‌కంగా ప‌ది బ‌ల‌మైన బాణాల‌తో ప‌శుప‌తిని గాయ‌ప‌రిచాడు. అయినా శివుని ముఖంలో చిరున‌వ్వు మాయ‌లేదు. ఆ మంద‌హాసంతోనే జ‌లంధ‌రుడినీ, అశ్వాల‌ను, ర‌థాన్ని, జెండాను, ధ‌నుస్సునీ న‌రికేశాడు. ర‌థ‌హీనుడైన రాక్ష‌సుడు ఒక గ‌ద తీసుకుని గంగాధ‌రుని మీద‌కు రాబోయాడు. ఒకే ఒక్క బాణంతో వాడిని రెండు మైళ్లు వెన‌క్కి ప‌డేలా కొట్టాడు. అంత‌టితో ఈశ్వ‌రుడు త‌న క‌న్నా బ‌ల‌వంతుడ‌ని గుర్తించిన జ‌లంధ‌రుడు స‌ర్వ‌స‌మ్మోహ‌న‌క‌ర‌మైన గంధ‌ర్వ మాయ‌ను ప్ర‌యోగించాడు. నాద‌మూర్తి అయిన న‌ట‌రాజు మోహితుడ‌య్యాడు. గంధ‌ర్వ‌గానాలు, అప్స‌ర‌స‌ల నాట్యాలు, దేవ‌గ‌ణ వాద్య ఘోష‌ల‌తో ఆయ‌న స‌మ్మోహితుడైపోయాడు. ఆ మోహంతో ఆయ‌న ధ‌రించిన స‌మ‌స్త ఆయుధాలు చేజారిపోయాయి. ఎప్పుడైతే ఆయ‌న‌లా మోహితుడైపోయాడో త‌క్ష‌ణ‌మే జ‌లంధ‌రుడు శుంభ‌నిశుంభులిద్ద‌రినీ యుద్ధంలో నిల‌బెట్టి తాను పార్వ‌తీ ప్ర‌లోభంతో శివ‌మందిరానికి బ‌య‌లుదేరాడు. వెళ్లేముందు శివ‌స్వ‌రూపాన్ని ఏకాగ్రంగా అవ‌లోకించాడు. మాయ త‌ప్ప బ‌లం ప‌నికిరాద‌ని గ్ర‌హించిన జ‌లంధ‌రుడు పంచ‌ముఖాల‌తోనూ, ప‌ది చేతుల‌తోనూ, జ‌ట‌ల‌తోనూ అచ్చం శివుడు ధ‌రించిన ఆయుధాలను పోలిన ఆయుధాల‌తో ఒకానొక మాయా వృష‌భం మీద శివ‌మందిర‌మైన పార్వ‌తీదేవి అంతఃపురానికి బ‌య‌లుదేరాడు.
అంత‌వ‌ర‌కు ప‌ర‌దృష్టి గోచ‌రం గాని పార్వ‌తి అలా వ‌స్తూ ఉన్న మాయా జ‌లంధ‌రుని కంట ప‌డింది. అందానికి మారుపేరైన ఆ పార్వ‌తిని చూస్తూనే జ‌లంధ‌రునికి వీర్య‌స్ఖ‌ల‌నం అయింది. ఎప్పుడైతే వాడు వీర్య‌స్ఖ‌ల‌నం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయావిద్య న‌శించిపోయింది. వాడు రాక్ష‌సుడ‌నే విష‌యం పార్వ‌తికి అర్ధ‌మైపోయింది. అంత‌టితో ఆమె అంత‌ర్హిత అయి మాన‌స స‌రోవ‌ర తీరాన్నిచేరి విష్ణువును ధ్యానించింది. త‌క్ష‌ణ‌మే ప్ర‌త్య‌క్ష‌మైన విష్ణుమూర్తి ఆమెను ఓదార్చి "త‌ల్లీ, పార్వ‌తీ వాడు చూపించిన తోవ‌లోనే నేను కూడా ప్ర‌యాణించాల్సి ఉంది. దిగులు ప‌డ‌కు" అని చెప్పాడు. "నీ పాతివ్ర‌త్య మ‌హిమ వ‌ల‌న ప‌శుప‌తి ఎలా జ‌యింప‌రాని వాడుగా ఉన్నాడో అలాగే ఆ జ‌లంధ‌రుని భార్య పాతివ్ర‌త్య మ‌హిమ వ‌ల‌న వాడు కూడా జ‌యింప‌రానివాడుగా త‌యార‌య్యాడు. వాడు నీ ప‌ట్ల రాక్ష‌స మాయ‌ను ప్ర‌ద‌ర్శించిన‌ట్టే వాడి ఇల్లాలి ముందు నేను నా విష్ణుమాయ‌ను ప్ర‌యోగిస్తాను" అని ధైర్యం చెప్పి రాక్ష‌స లోకానికి బ‌య‌లుదేరాడు.
పంచ‌ద‌శోధ్యాయ స‌మాప్తః
-------------------------- 
ఆ విధంగా విష్ణువు బ‌య‌లుదేరిన క్ష‌ణం నుంచి జ‌లంధ‌రుని భార్య బృంద‌కు దుస్వ‌ప్నాలు క‌లుగ‌సాగాయి. జ‌లంధ‌రుడు దున్న‌పోతు మీద ఎక్కి తిరుగుతున్న‌ట్టు, దిగంబ‌రుడైన‌ట్టు, ఒళ్లంతా నూనె పూసుకుని తిరుగుతున్న‌ట్టు, న‌ల్ల రంగు పూల‌తో అలంకృతుడైన‌ట్టు, పూర్తిగా ముండ‌నం చేయించుకున్న‌ట్టు, ద‌క్షిణ దిక్కుగా ప్ర‌యాణిస్తున్న‌ట్టు, త‌న‌తో స‌హా ప‌ట్ట‌ణం అంతా స‌ముద్రంలో మునిగిపోతున్న‌ట్టు క‌ల‌లు వ‌చ్చాయి. అంత‌లోనే మేల్కొన్న బృంద ఉద‌య సూర్యుని ద‌ర్శించి తాను చూసిన‌ది క‌లే అయినా అశుభ‌మ‌ని చింతించ‌సాగింది. అది మొద‌లు ఆమెకు మ‌నశ్శాంతి లేకుండా పోయింది. అరిష్టాన్ని త‌ల‌బోస్తూ అస్థిర‌మ‌తియై తిర‌గ‌సాగింది. ఆ విధంగా ఒకానొక వేళ వ‌న‌విహారం చేస్తూ ఉండ‌గా సింహం వంటి ముఖాలు క‌లిగిన ఇద్ద‌రు రాక్ష‌సులు క‌నిపించారు. వారిని చూసి భీతిల్లిన బృంద వెనుదిరిగి పారిపోతూ ఆ వ‌నంలోనే శిష్య‌స‌మేతంగా ఉన్న ఒకానొక ముని కంఠాన్ని చుట్టుకుని "ఓ మునివ‌ర్యా ర‌క్షించండి. నాకు మీరే శ‌ర‌ణు" అని కేక‌లు వేయ‌సాగింది. అప్పుడా ముని భ‌య‌గ్ర‌స్త అయిన ఆమెను, ఆమె వెన్నంటి వ‌స్తున్న ర‌క్క‌సుల్ని చూసి ఒక్క హుంకారం చేత ఆ రాక్ష‌సులు పారిపోయేలా చేశాడు. అంత‌టితో ధైర్యం వ‌చ్చిన బృంద ఆ మునికి ప్ర‌ణ‌మిల్లి "ఓ ఋషీంద్రా, ఈ గండం నుంచి న‌న్ను కాపాడిన ద‌యాళుడివి. నా సంశ‌యాలు కొన్ని మీ ముందుంచుతున్నాను. నాన భ‌ర్త జ‌లంధ‌రుడు ఈశ్వ‌రునితో యుద్ధానికి వెళ్లాడు. అక్క‌డ ఆయ‌న ప‌రిస్థితి ఎలా ఉందో ద‌య‌చేసి నాకు తెలియ‌చేయండి" అని వేడుకుంది. 
క‌రుణాక‌ర‌మైన దృష్టులు ప్ర‌స‌రింప‌చేస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంట‌నే ఇద్ద‌రు వాన‌రులు వ‌చ్చారు. ముని వారికి క‌నుబొమ‌ల‌తోనే క‌ర్త‌వ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులూ మ‌ర‌ల ఆకాశానికి ఎగిరి అతి స్వ‌ల్ప‌కాలంలోనే న‌రికివేత‌కు గురైన జ‌లంధ‌రుని చేతులు, మొండెం, త‌ల తెచ్చి వారి ముందుంచారు. త‌న భ‌ర్త ఖండితావ‌య‌వాల‌ను చూసి బృంద ఘొల్లుమ‌ని ఏడ్చింది. అక్క‌డే ఉన్న ఋషి పాదాల‌పై ప‌డి త‌న భ‌ర్త‌ను బ‌తికించాల్సిందిగా ప్రార్థించింది. అందుకా ముని న‌వ్వుతూ "శివోప‌హ‌తులైన వారిని బ‌తికించ‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు. అయినా నాకు నీ ప‌ట్ల ఏర్ప‌డిన అవ్యాజ‌మైన క‌రుణ వ‌ల‌న త‌ప్ప‌క బ‌తికిస్తాను" అంటూ అంత‌ర్హితుడ‌య్యాడు. ఖిన్నురాలైన బృంద‌ను కౌగ‌లించుకుని ఆమె ముఖాన్ని ప‌దేప‌దే ముద్దాడాడు. పున‌రుజ్జీవితుడైన భ‌ర్త ప‌ట్ల అనురాగంతో బృంద పుల‌కించిపోయింది. వారిద్ద‌రూ ఆ వ‌నంలోనే వివిధ ర‌కాలుగా సుర‌త క్రీడ‌ల్లో మునిగిపోయారు. మ‌ర‌ణించిన భ‌ర్త తిరిగి వ‌చ్చాడనే ఆనందంలో బృంద వెంట‌నే గుర్తు ప‌ట్ట‌లేక‌పోయినా ఒకానొక సుర‌త సుఖానంత‌రం ఆమె అత‌నిని విష్ణుమూర్తిగా గుర్తించింది. "ఓ విష్ణుమూర్తీ ప‌ర స్ర్తీ గామివై నీ ప్ర‌వ‌ర్త‌న నిందింప‌బ‌డును గాక‌. నీ మాయ‌తో ఇతః పూర్వం క‌ల్పించిన వాన‌రులిద్ద‌రూ రాక్ష‌సులై జ‌న్మించి నీ భార్య‌నే హ‌రించెద‌రు గాక‌. నీవు భార్యావియోగ దుఃఖితుడ‌వై నీ శిష్యుడైన ఆదిశేషునితో స‌హా అడ‌వుల్లో తిరుగుతూ వాన‌ర స‌హాయ‌మే గ‌తి అయిన వాడివ‌గుదువు గాక" అని శ‌పించి త‌నకు చేరువ‌వుతున్న శ్రీ‌హ‌రి నుంచి త‌ప్పించుకుని అగ్ని వెలిగించుకుని అందులో ప‌డి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికీ బృంద‌నే స్మ‌రించ‌సాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె చితాభ‌స్మాన్ని త‌నువంతా పూసుకుని విల‌పించ‌సాగాడు. సిద్ధులు, ఋషులు ఎంద‌రు ఎంతగా చెప్పినా విష్ణుమూర్తి అశాంతితో అల్లాడిపోసాగాడు. 
శ్రీ‌ప‌ద్మ‌ పురాణాంత‌ర్గ‌త‌మైన కార్తీక మాహాత్మ్యం 15, 16 అధ్యాయాలు స‌మాప్తం
23వ రోజు పారాయ‌ణం ముగిసింది.

Monday, November 18, 2019

44వ సుందరకాండ దృశ్యాలు

కొత్త‌పేట స‌త్యాన‌గ‌ర్ కాల‌నీలోని పుట్టి శివ‌రావు, ఉమారాణి దంప‌తుల నివాసంలో తృతీయాష్టోత్త‌ర శ‌త ప‌రంప‌ర‌లోని 44వ సుంద‌ర‌కాండ ఆదివారంనాడు స‌హ‌స్ర‌నామార్చ‌న‌తో ముగిసింది. ఇది కార్తీక మాసం కావ‌డం, అందులోనూ గ‌త మంగ‌ళ‌వారం కార్తీక పౌర్ణ‌మి శుభ‌తిథి కావ‌డంతో శిష్య బృందం అంద‌రూ ఆ రోజు ఎంతో ఉత్సాహంగా గురువుగారికి కార్తీక దీప‌దానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. ఆ ర‌కంగా శివ‌రావు, ఉమారాణి దంప‌తులు వారు త‌రించ‌డంతో పాటు అంద‌రికీ కార్తీక దీప‌దానాలు, కార్తీక దీప ప్ర‌జ్వ‌ల‌న భాగ్యం క‌లిగించారు. వారికి మ‌న సుంద‌ర‌కాండ ఆంజ‌నేయ‌స్వామి ఆయురారోగ్య ఐశ్య‌ర్యాలు క‌లిగించాల‌ని ప్రార్థిద్దాం. ఈ సారి వారి ఇంటిలో సుంద‌ర‌కాండ హోమ‌రూపంగా 12వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు రోజూ ఉద‌యం వేళ‌లో జ‌రిగింది.













పంచామృతాభిషేకం
తుల‌సి, బిల్వ ద‌ళ మాల‌లో స్వామివారు
అర్కపుష్ప మాల‌లో స్వామివారు
త‌మ‌ల‌పాకు మాల‌లో స్వామివారు
నిమ్మ‌కాయ‌ల మాల‌లో శ‌క్తిస్వ‌రూపునిగా స్వామివారు
పాణ్యం వేణుగోపాల్ ర‌ఘువీర‌గ‌ద్యం
స‌హ‌స్ర‌నామార్చ‌న‌
అష్టోత్త‌ర‌నామార్చ‌న‌
ధ్యానంలో భ‌క్త‌గ‌ణం