Wednesday, November 5, 2014

గురు సంకల్పం

మన గురువు గారి వంటి  వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు...ఆయన జీవితం మొత్తం లోక కల్యాణానికే అంకితం...అందుకు ఈ  వీడియోలోని అయన మాటలే నిదర్శనం... 

తండ్రి మాటకి తల వంచి రాములవారు వనవాసం చేస్తే నేటి కుమారులు తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలకి పంపుతున్నారని గురువుగారు తరచూ చెబుతూ ఉంటారు...ఇలాంటి కొడుకులకి భిన్నంగా కన్న తల్లిదండ్రులని కంటికి రెప్పలా కాపాడుకుంటానని కొడుకు చెబుతున్నా శిష్యులకి దూరం కాకూడదన్న తపనతో గురువుగారే మన్సురాబాద్ సమీపంలోని సౌత్ ఎండ్ కాలనీలో ఉంటున్నారు... తండ్రి మనసు గ్రహించిన వేణు ఆ సమీపంలోని హనుమాన్ నగర్ లో ఒక స్థలం ఉంటే అందులో అమ్మ నాన్నల కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నారట... దానికి మారుతి సేవా సదన్ గా నామకరణం చేసి వచ్చే శ్రీ రామనవమి నుంచి అక్కడ గురూజి నివాసం ఉంటూ బాధితుల సాంత్వన కోసం సుందరకాండ హోమాలు చేయాలనుకుంటున్నారు... ఆ వివరాలు గురూజి మాటల్లోనే వినండి... 




కదళీ వనంలో కార్తిక మాసంలో సుందరకాండ హోమం రెండవ రోజు



Tuesday, November 4, 2014

ఇది కూడా స్వామి సాక్షాత్కరమే

కదళీ వనంలో కార్తిక మాసంలో సుందరకాండ తోలి రోజు
హోమం కోసం అగ్ని ప్రజ్వలనం చేయగానే తీసిన ఫోటోలలో ఒక దానిలో ఇలా కనిపించింది...హనుమ నిలబడి ఉన్నట్టుగా అగ్ని కనిపిస్తోంది...దీన్ని అందరూ అంగీకరించినట్లయితే ఇది కూడా హనుమ సాక్షాత్కారమే అనుకోవాలి...

కదళీ వనంలో కార్తిక మాసంలో సుందరకాండ హోమం తోలి రోజు


Monday, November 3, 2014

కదళీ వనంలో కార్తిక మాసంలో ఆంజనేయ ఆరాధన

96వ సుందరకాండ క్రతువు రూపంలో నిజాంపేట రోడ్డులోని సద్గురు నిలయంలో రేపటి నుండి అద్భుతంగా జరగబోతోంది...ఈ రోజు సోమవారం ఏకాదశి పర్వ దినాన అంకురారోపణ, హనుమత్ దీక్షా కంకణ ధారణలు ఎంతో వైభవంగా జరిగాయి. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి...  కార్తిక మాసంలో ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతి పాత్రమైన కదళీ వనంలో హోమ రూపంలో రెండు కుండాలతో క్రతువు జరగడం, పౌర్ణమి పర్వదినాన అంటే వచ్చే గురువారం నాడు తులసి వివాహం,  సహస్ర దీపాలంకరణ, ఆదివారం నాడు సహస్ర నామార్చన, తదుపరి అరటి తోటలోనే కార్తీక వనభోజనాలు...ఇవన్నీ ఒక ఎత్తైతే అక్కడ కపిల గో దర్శనం అన్నింటి కన్నా శ్రేష్టం ..పౌర్ణమి రోజున కపిల గోవును తోటలోనే ఉంచుతారు...ఆ రోజు అందరూ ఆ గోవుకి ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు... ఎంత మంది వీలయితే అంత మంది పాల్గొని పునీతులు కావలసిందిగా గురువుగారి సూచన... 

ఈ దిగువన తొలి రోజు కార్యక్రమాల దృశ్యాలు వీక్షించండి


వీడియోల కోసం ఈ లింక్ చూడండి 



 

Thursday, October 30, 2014

బిల్వ మహిమ - భస్మధారణ ఫలం

శివ స్వరూపంగా బిల్వవృక్షం భావించబడుతున్నది. మొత్తం చతుర్దశ (14) భువనాల్లోనూ పుణ్యక్షేత్రాలకు బిల్వ వృక్షం సూచిక అంటారు. దీని మూలం (వేర్లు) గంధపుష్పార్చితం చేసేవారికి వంశాభివృద్ధి, ఈ వృక్షం చుట్టూ దీపారాధన శివజ్ఞానదాయిని, ఇంత విశేష మహిమగల ఈ మారేడు చెట్టు నీడన, ఒక్కరికి అన్నం పెట్టినా కోటిమందికి అన్నదానం చేసిన ఫలితం. దీని క్రింద ఒక శివభక్తునికి క్షీరాన్నం ఘృతసహితంగా సమర్పిస్తే, అట్టివాడికి జన్మాంతరాల యందు కూడా అన్నదారిద్ర్యం ఉండదు.
సాలగ్రామ శిలా మహిమ:
గుప్పిట్లో ఇమిడే ప్రమాణం గల సాలగ్రామ శిలలను, గృహ పూజలలో వాడవచ్చు!
ఈ సాలగ్రామ శిలలు గండకీ నదిలో మహావిష్ణు ప్రతిరూపాలుగా లభ్యమవుతాయి. సహజ శంఖ చక్ర చిహ్నాలు కలిగిఉంటాయి.
ఈ సాలగ్రామ శిలాదానం ఇహపర సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. పితృదేవతలకు మోక్షప్రాప్తిని కలిగిస్తుంది.
సోమవారం శివ ప్రీతికరం
లోకరీతి ప్రకారం, సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించబడుతున్నది.
శంకరుడు అగ్నిని తన స్వరూపంగా కలిగిన లక్షణయుతుడు. (త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ...అని రుద్ర సూక్తం) ఈ వేడిమిని చల్లబరచ గలిగేది సోముడు. (చంద్రుడు).
జ్యోతిషరీత్యా 'కృత్తికాగ్నిర్దేవతా' అని శ్రుతి. అగ్ని నక్షత్రం కృత్తిక. కృత్తికా నక్షత్రం చంద్ర కళలన్నీ ఉండే పూర్ణిమనాడు ఉండటం ఏ మాసంలో సంభవిస్తుందో అదే కార్తీకం. కనుకనే కార్తీక మాసం శివునికి ప్రీతికరమైనది.
అంతరార్ధం ప్రకారం (స + ఉమ = సోమ) ఉమాసహితంగా ఉండే రోజు కనుక సోమవారం శివ ప్రీతికరం!
భస్మధారణ - ఫలం
భస్మము ద్వివిధాలుగా ఉంటుంది.
1. స్వల్పభస్మం 2. మహాభస్మం . వీటివల్లనే శ్రౌత, స్మార్త - లౌకికాలనే మూడు విభూతులు ఉత్పన్నమయ్యాయి.
విభూతిని శివనామస్మరణంతోనూ; మంత్రపూర్వకంగానూ ధరించవచ్చు!
త్రిపుండ్రాలుగా ధరించబడే ఈ విభూతిలో ముఖ్య ద్రవ్యం - కాల్చబడిన గోమయం. వితంతుస్త్రీలు పంచాక్షరీ జపంతో భస్మధారణ చేయాలి.
సత్యశాంభవ దీక్షాయుతులు మాత్రం ఈశాన మంత్రయుక్తంగా ఎల్లవేళలా భస్మధారణతో ఉండాలి.
భస్మధారణ లేకుండా చేసే ఏ పూజలైనా, నిష్ఫలాలని చెప్తుంటారు. 32 స్థానాలు భస్మధారణానుకూలం. సాధారణంగా 16చోట్ల భస్మం ధరించేవారున్నారు. గృహస్థులు మాత్రం తల, బాహుద్వయం, హృదయం, నాభి అనే ఐదు తావుల భస్మధారణ చేస్తేచాలు!
నీచులనుండి దానం పరిగ్రహించడం కూడా పాపమే!.. ఇట్టి పాపాన్ని పోగొట్టగలది భస్మధారణ.
ఇంకా...స్త్రీ హత్య, గోవధ, పరస్త్రీగమనం, అకారణహింస, పంట దొంగలించుట, గృహదహనాది సమస్త ఘోరపాపాలకు భస్మధారణ తక్షణ నివృత్తి సాధకమని శివ తత్త్వజ్ఞులు చెప్తారు.
నియమంగా భస్మధారణ చేయడం, శివోపాసన చేయడం దేవతలకు సంప్రీతికరం కనుక అట్టివాడు దైవకృపకు తప్పక పాత్రుడు కాగలడు.
ఇక, ఇప్పుడు ఏయే రోజులలో ఏయే దేవతలను పూజ ద్వారా సంతృప్తి చేయవచ్చునో చెప్పి, ఈ అనంత మహాపురాణానికి ఉపసంహారం చెప్పుకుందాం!
వివిధ దేవతారాధన :
1. ప్రతినెలా బహుళపక్ష చవితి : విఘ్నేశుడు , పాపనివారణ
2. ప్రతిపక్షంలోనూ ద్వాదశి : విష్ణువు , అఖండ సంపద
3. జ్యేష్ఠ - మార్గశీర్ష మాసాలు : శివారాధన, భోగ మోక్ష ప్రదం
4. కార్తీక మాసం ఆదివారాలు : సూర్యుడు , సర్వరోగ నివారణ
5. అశ్వయుజ శుక్ల పక్షం : దేవి , ఐశ్వర్య భోగ సిద్ధి