Friday, May 11, 2018
Thursday, May 10, 2018
Tuesday, May 8, 2018
Monday, May 7, 2018
మన బ్లాగ్ 40 వేల రికార్డు
మన
బ్లాగ్ 40000 హిట్ ల మైలురాయిని 07 మే, 2018 వ తేదీన దాటింది. ఈ
బ్లాగ్ 2009 మార్చిలోనే ప్రయోగాత్మకంగా ప్రారంభించినా... 2010
సెప్టెంబర్ 2వ తేదీన ప్రగతినగర్ శ్రీ పట్టాభిరామాలయంలో గురూజీ
సుందరకాండ ప్రవచనాలు చేసిన సందర్భంగా అధికారికంగా ఆవిష్కరించడం
జరిగింది. అప్పటి నుంచి మన బ్లాగ్ లో గురూజీ కార్యక్రమాలన్నీ క్రమం
తప్పకుండా ప్రచురిస్తూ వస్తున్నాం. దీనికి ప్రపంచవ్యాప్తంగా
వీక్షకులు లభించడం నిజంగా మన అదృష్టం. అదంతా ఆంజనేయస్వామివారి
ఆశీస్సులు, గురూజీ అకుంఠిత దీక్ష మహిమ. బ్లాగ్ ను అధికారికంగా
ప్రారంభించిన నాటి నుంచి మనం సాధిస్తున్న మైలురాళ్లను ఎప్పటికప్పుడు
తెలియచేస్తూనే వస్తున్నాం. ఈ రోజు స్వామివారి ఆశీస్సులతో మనం 35 వేల
మైలురాయిని కూడా దాటాం. మన బ్లాగ్ కు భారతదేశం నుంచే అధిక హిట్లు
(20000) వచ్చినప్పటికీ అమెరికా (12700) రెండో స్థానంలో ఉంది. అమెరికాలో
అంటే మన తెలుగువారు అధిక సంఖ్యలోనే ఉన్నారు గనుక అక్కడ హిట్ లు
అధికంగా వచ్చాయంటే అర్ధం చేసుకోవచ్చు. కాని రష్యా, జర్మనీ,
ఉక్రెయిన్, ఒమన్, దక్షిణ కొరియా, లాట్వియా, మలేసియా, యుఏఇ వంటి దేశాల
ప్రజలు కూడా చూశారంటే అది ఆంజనేయస్వామి మహిమ తప్ప మరేదీ కాదు, అలాగే
కొన్ని కొత్త దేశాల వారు కూడా ఎప్పటికప్పుడు వీక్షకుల్లో
చేరుతున్నారు.
వివిధ రకాల బ్లాగ్ ల ట్రాఫిక్ ను ట్రాక్ చేస్తూ ఉంటే
ఫీడ్ పోస్ట్ అనే సంస్థ నాకు బ్లాగ్ సందర్శకులు కొందరి పేర్లతో ఒక
సందేశం పంపింది. అందులో సుమారు పాతిక మంది విదేశీయుల పేర్లున్నాయి...వారికి
మన భాష, సంస్కృతులతో ఏ మాత్రం సంబంధం లేదు...అయినా వారు ఈ బ్లాగ్
చూశారు. ఏ దేశంలో ఎన్ని హిట్ లు వచ్చాయో టేబుల్ లో చూడవచ్చు.
--------------------------------------------
WE ARE @ 40000
On 7th MAY, 2018 we have achieved another milestone ie., 40000 GLOBAL HITS.
Our blog http://sundarakathamrutam.blog
Everybody
can easily understand that the above mentioned people are of Foreign
Origin and don't know Telugu. Eventhough they visited our blog. Is it
not amazing...That's why we achieved this great milestone. I thank one
and all who are encouraging me to post such a valuable information in
our blog...Seeking all your support in future also...
------------------------------ -------------------
------------------------------
TOP 5 COUNTRYWIDE HIT COUNT AS FOLLOWS...
INDIA 20500
USA 12700
RUSSIA 1750
FRANCE 1000
GERMANY 970------------------------------ ----
OUR MILESTONES ARE AS FOLLOWS
GERMANY 970------------------------------
OUR MILESTONES ARE AS FOLLOWS
1. May 07, 2018 GLOBAL HITS CROSSED 40000
2. July 30, 2017 GLOBAL HITS CROSSED 35000
2. July 30, 2017 GLOBAL HITS CROSSED 35000
3. August, 29, 2016 GLOBAL HITS CROSSED 30000
4. APRIL 23, 2015 INDIAN HITS CROSSED 10000
5. May 15, 2014 GLOBAL HITS cross 10000 mark
6. December 1, 2013 INDIAN HITS CROSSED 5000
7. November 16, 2013 GLOBAL HITS CROSSED 8000
8. JULY 31, 2013 GLOBAL HITS CROSSED 7000
9. MAY 2013 RECORD HITS IN A MONTH - 953
10. JULY 12, 2016 RECORD HITS IN ONE DAY - 143
11. MAY 19, 2013 GLOBAL HITS CROSSED 5000
------------------------------Sunday, May 6, 2018
పుష్కర నిరీక్షణ, నందనంపాటి వారింట్లో సుందరకాండ
పుష్కర నిరీక్షణ
ఇది నిజంగా మా సుందరకాండ మహాయజ్ఞంలోనే అత్యంత అరుదైన ఘట్టం. స్వామివారు మా ఇంటికి రావాలని ప్రగాఢంగా కోరుకుని ఆయన కోసం కన్నులు కాయలు కాసేలా నిరీక్షించిన వారి కోసం స్వామివారే తరలివచ్చిన సందర్భం. శ్రీ నందనంపాటి వీరాంజనేయులు సోదరులది గుంటూరు. వారు ఐదుగురు సోదరులు. గుంటూరులో వారు కాటన్, ఐరన్, స్టీల్ వ్యాపారాలు చేసే వారు. 2002 సంవత్సరంలో ఆ సోదరులు హైదరాబాద్ మకాం మార్చారు. ప్రస్తుతం వారందరూ ఆటోమొబైల్ బోల్టులు, నట్లు విక్రయించే వ్యాపారం నిర్వహిస్తుండగా తర్వాతి తరం సోదరులందరూ కలిసి ఎస్వికె సాఫ్ట్ వేర్ పేరిట ఒక కంపెనీ పెట్టుకుని దాన్ని నడుపుతున్నారు. అందరూ కాప్రా సమీపంలోని వంపుగుడా రోడ్డులో జీ స్కూల్ ఎదురుగా ఒక పెద్ద ప్రాంగణంలో ఐదు చక్కని భవనాలు నిర్మించుకుని కాపురం ఉంటున్నారు. వారికి ఎంతో కాలంగా తమ ఇంట్లో సుందరకాండ చేయించుకోవాలని ప్రగాఢమైన ఆకాంక్ష. కాని చక్కగా సుందరకాండ నిర్వహించే సద్గురువులు వారికి తారసపడలేదు. ఇలా ఉండగా ఒక రోజున ఆంధ్రజ్యోతిలో గురూజీ శ్రీమాన్ శృంగారం సింగరాచార్యుల వారి గురించి ఒక చక్కని వ్యాసం ప్రచురితం అయింది. 2007 ఫిబ్రవరి 9వ తేదీన ఆంధ్రజ్యోతి నివేదన పేజీలో అది ప్రచురించాం. ఆయనని ఇంటర్వ్యూ చేసి ఆ వ్యాసం రాసింది నేను, దానికి తుది మెరుగులు దిద్ది ప్రచురించినది ఆ పేజీని పర్యవేక్షించే మిత్రులు శ్రీ టి.కుమార్. ఆ వ్యాసాన్ని నందనంపాటి వారు చూశారు. వెంటనే వారు గురూజీ అడ్రస్ తెలుసుకోవాలని ప్రయత్నించారు గాని వారికి దొరకలేదు. ఎప్పటికైనా గురూజీతో సుందరకాండ చేయించుకోవాలన్న ప్రగాఢ ఆకాంక్షతో ఎదురుచూస్తూ ఆ వ్యాసాన్ని లామినేట్ చేయించుకుని ఇంటిలో ఉంచుకున్నారు. ఆ కోర్కెతోనే వారికి సుమారుగా పుష్కర కాలం గడిచిపోయింది. కాలం అలా గడిచిపోతూ ఉండగా కొద్ది నెలల క్రితం ఒక రోజున వారికి గురువుగారి అబ్బాయి తారసపడ్డారు. మాటల సందర్భంగా మా నాన్నగారు సుందరకాండ చేస్తారని చెప్పడం, వారు పేరు అడగడం, నాన్నగారి పేరు శృంగారం సింగరాచార్య అని చెప్పగానే వారు ఆనందపడిపోవడం, గురూజీ దర్శనభాగ్యం కావాలని కోరడం జరిగింది. దగ్గరలోనే నివాసం ఉంటున్న కుమారుని ఇంట్లోనే ఆ సమయంలో గురువుగారు ఉన్నారు. ఆ సంగతి తెలిసి గురూజీ దగ్గరకి వెళ్లి వారి దర్శన భాగ్యం కలిగినందుకు సంతోషం వ్యక్తంచేస్తూ తమ కథ అంతా వివరించి మీరు వేంచేసి మా ఇంట్లో సుందరకాండ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వారి నిరీక్షణ కథ అంతా విన్న గురూజీ ఆనందాశ్చర్య చకితులై వారి ఇల్లు సందర్శించారు. వారందరూ వైష్ణవభక్తులు. వారి ఇళ్లన్నీ నిత్యం ధూపధీపాలతో పవిత్రత ఉట్టిపడుతూ ఉన్నాయి. ప్రధానంగా గురూజీని ఆకర్షించింది వారి ప్రాంగణంలోని కపిలగోవు. గతంలో కదళీవనంలో సుందరకాండ నిర్వహించిన సందర్భంతో శ్రీ బాపయ్య చౌదరి, శాంతిశ్రీ దంపతులు కపిలగోవు దర్శనభాగ్యం మా సుందరకాండ భక్తకోటికి కల్పించారు. తిరిగి మన వారందరికీ ఇన్నాళ్లకి కపిలగోవు దర్శన భాగ్యం కూడా కలగబోతున్నదని భావించి గురూజీ వారికి సుందరకాండ నిర్వహణ తేదీలు అక్కడికక్కడే ఇచ్చేశారు. రాబోయే హనుమజ్జయంతికి మీ ఇంట్లో సుందరకాండ నిర్వహిద్దామని చెప్పారు. అలా సుమారు పుష్కర కాల నిరీక్షణ ఫలించి ఇప్పుడు నందనంపాటి సోదరుల ఇళ్లలో తృతీయాష్టోత్తర శత పరంపరలోని ఈ 22వ సుందరకాండ జరుగుతోంది. స్వామివారు ఉన్నారు, ఆయన కోసం ఎంతగా నిరీక్షిస్తే అంత ఫలితం అందచేస్తారనేందుకు ఇంత కన్నాతార్కాణం ఏమి కావాలి...జై శ్రీరామ్, జై హనుమాన్.
Tuesday, May 1, 2018
Subscribe to:
Posts (Atom)


















