Saturday, February 29, 2020
Wednesday, February 26, 2020
Monday, February 24, 2020
48వ సుందరకాండ ఆహ్వానం
వచ్చే శనివారం (ఫిబ్రవరి 29) నుంచి మియాపూర్ వాస్తవ్యులు గింజుపల్లి ఐన్ స్టీన్, ఉమామహేశ్వరి దంపతుల ఇంటిలో గురూజీ నిర్వహణలోని తృతీయాష్టోత్తర శత పరంపరలోని 48వ సుందరకాండ ప్రారంభం కానుంది. 29వ తేదీ శనివారంనాడు ఉదయం సుందరకాండ కంకణ ధారణ ఉంటుంది. ఆసక్తి గల వారందరూ వచ్చి వారం రోజుల కాలానికి సుందరకాండ దీక్షా కంకణం ధరించవచ్చు. ఈ దీక్షా కంకణం తీసుకున్న వారు ఆ 9 రోజులూ ఒక పూట భోజనం చేస్తూ భూశయనం చేయాలి. పూర్తి బ్రహ్మచర్యం వహించాలి. ఇలా చేసినట్టయితే వారికి ఆంజనేయస్వామి ఆశీస్సులు లభించి వారి కష్టాలు దూరం అవుతాయి. ఇల్లు సమృద్ధిగా విలసిల్లుతుంది. ఆదివారం (మార్చి 1) ఆ పై శనివారం (మార్చి 7) వరకు నుంచి ప్రతీ రోజూ సాయంత్రం 4.30 గంటలకు ఆంజనేయ అష్టోత్తర శత నామార్చన నిర్వహించి అనంతరం సుందరకాండ సర్గల పారాయణ, తదనంతరం ఆయా సర్గల ప్రాశస్త్యం, వాటిలోని ఆంతర్యంపై ధారావాహికగా ప్రవచనం ఉంటాయి. పాల్గొని విని ఆనందించండి.
Saturday, February 15, 2020
47వ అనుబంధ సుందరకాండ ప్రారంభ దృశ్యం
గుంటకండ్ల రమేశ్ రెడ్డి, మణిమాల దంపతుల గృహంలో 47వ అనుబంధ సుందరకాండ ఆదివారం కంకణ ధారణతో ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తొలి రోజు వీడియో చిత్రీకరణ చూసి ఆనందించండి. రేపటి నుంచి ప్రతీ రోజూ సాయంత్రం ఐదు గంటలకు ఆంజనేయ అష్టోత్తర శతనామార్చనతో కార్యక్రమం ప్రారంభమై సుందరకాండ సర్గ పారాయణ, ప్రవచనాలతో రోజు వారీ కార్యక్రమాలు ముగుస్తాయి. వచ్చే ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమయ్యే విష్ణు సహస్రనామ పారాయణం, రామనామ పారాయణం, హనుమత్ స్తుతి అనంతరం ఆంజనేయ సహస్రనామార్చనతో వారం రోజుల కార్యక్రమాలు వైభవంగా ముగుస్తాయి. అందరూ ఆహ్వానితులే.
Tuesday, February 11, 2020
Monday, February 10, 2020
Subscribe to:
Posts (Atom)