Thursday, May 30, 2019

రోజూ సుందరకాండ శ్లోకం డే 1

త‌తో రావ‌ణ నీతాయాః శ‌తృక‌ర్శ‌నః 
ఇయేష ప‌ద‌మ‌న్వేష్టుం చార‌ణా చ‌రితే ప‌థి

దుష్క‌రం నిష్ర్ప‌తిద్వంద్వం చికీర్ష‌న్ క‌ర్మ వాన‌రః 
స‌ముద్ర‌గ్ర శిరోగ్రీవో గ‌వాంప‌తిరివాబ‌భౌ
జాంబవంతుడు, ఇతర వానర వీరులందరి ప్రేరేపణతో సీతామాతను అన్వేషించేందుకు సమాయత్తుడైన అరివీర భయంకరుడైన  హనుమంతుడు ప్రయాణానికి చారణాది దివ్య జాతుల వారు సంచరించే ఆకాశ మార్గాన్ని ఎంచుకున్నాడు. దుష్కరమైన కార్య సాధన కోసం బయలుదేరిన ఆంజనేయుడు తన మెడను, శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రుని వలె ప్రకాశించుచుండెను... 

No comments:

Post a Comment