అథః వైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబలః
ధీరస్సలిలకల్పేషు విచార యథాసుఖం
ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్
మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ
అచటి పచ్చిక బయళ్ళు వైడూర్య వర్ణ శోభితంగా చల్లని గాలులు ప్రసరిస్తూ మనసుకు ఆహ్లాదం అందిస్తున్నాయి. ధీరుడు, మహాబలుడు అయిన హనుమంతుడు వాటిపై సంచరిస్తూ ముందుకు సాగుతున్నాడు.