Friday, July 31, 2015

గురూజీకి పాదాభివందనం



గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్ పర బ్రహ్మః తస్మై శ్రీ గురవే నమః 

మనకి దొరికిన ఆణిముత్యం మన గురువుగారు...గురువు అంటే మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి వెలుగు దిశగా మార్గదర్శకం చేసే వాడు...ఇందుకు నిలువెత్తు రూపం మన గురువుగారు...పట్టు వస్త్రాలు అలంకరించిన సింహాసనాలు అధిష్టించి పాదాభివందనాలు అందుకుంటూ...ఆసీహ్ పూర్వకంగా చేతులు ఊపుతూ పటాటోపం ప్రదర్శించే గురువులున్న ఈ రోజుల్లో తన ముందు కూచుని ప్రవచనాలు వినే చిన్నారులని  చూపించి "నేను వాళ్ళ కన్నా చిన్న వాడిని, మీ అందరి కన్నా చిన్న వాడిని... పూర్వ జన్మ సుకృతం వల్ల నేను ఈ స్థానంలో కూచున్నాను...అంతకి మించి నా గొప్పతనం ఏమీ లేదు" అని చాటి చెప్పే నిగర్వి...తన తపశ్శక్తి, కఠోర దీక్షల ప్రభావంతో  "నా శిష్యులు ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళని ఉద్ధరించు" అని సాక్షాత్తు "గురువులకే గురువైన ఆంజనేయ స్వామి"ని శాసించగల శక్తి ఉన్నా మనతోనే తిరుగుతూ, మన సుఖ దుఖాల్లో పాలు పంచుకుంటూ...మనకి సాంత్వన కలిగించే మహా మనీషి...మన గురూజీ శ్రీమాన్ శృంగారం సిన్గాచార్యుల వారికి గురు పూర్ణిమ సందర్భంగా సుందరకాండ కుటుంబం  తరఫున శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను...అయన కలకాలం సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లుతూ మరింత కాలం మనతోనే ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంకో మాట శ్రీ  రామ సన్నిధిలో తనకి శాశ్వత స్థానం ఇవ్వాలన్నగురువు గారి వినతిని కూడా గురు పూర్ణిమ సందర్భంగా భగవంతునికి నివేదిద్దాం. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు... 

No comments:

Post a Comment