Wednesday, May 6, 2015

మహా మహిమాన్వితమైన శ్రీ మారుతీ స్తోత్రం

మానసిక ప్రశాంతత కావలసిన వారు తలచిన పనులు నేరవేరాలనుకునే వారు దీనిని తలస్నానం ఆచరించి శుచిగా ఎటువంటి వాద వివాదాలను దరి చేర్చుకోకుండా మద్య మాంసాలకు దూరం ఉండి బ్రహ్మ చర్య నిష్ట తో చదువుకోగలరు. మనం ఎంత నిబద్దత తో నిష్ఠ తో ఉండగలిగితే పూజ అంత గా ఫలిస్తుంది


ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే

నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే

మోహ శోక వినాశాయ సీతాశోక వినాశినే

భగ్న శోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాజ్మినే

గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాతాచ 

వనౌకసాం వరిష్టాయ వశినే వన వాసినే

తత్త్వ జ్ఞాన సుదాసిందు నిమగ్నాయ మహీయసే

ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ

జన్మ మృత్యు భయఘ్నాయ సర్వ క్లేశ హరాయచ

నే దిస్థాయ భూత ప్రేత పిశాచ భయహారిణే

యా తానా నాశానాయాస్తు నమో మర్కట రూపిణే

యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే

మహా బలాయ వీరాయ చిరంజీవి న వుద్ధ్రుతే

హా రినే వజ్ర దేహాయ చోల్లంఘిత మహాబ్దయే

బలినా మగ్రగణ్యాయ నమో నమః పాహి మారుతే

లాభ దోషిత్వ మేవాశు హనుమాన్ రాక్షసాంతక

యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ

స్వాశ్రితా నా భయదం య ఏవమ్ స్తౌతి మారుతిం

హానిహి కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ .
.
(మొదటి అక్షరాలన్నీ కలిపితే” ఓం నమో భగవతే ఆంజనేయాయ 

మహా బలాయ స్వాహా ”అని రావటం ఇందులో ప్రత్యేకత)

No comments:

Post a Comment