మనలో చాలా మంది జీవితంలో స్వయం కృతం వల్లనో, ఇతరుల కుట్రల
వల్లనో ఇల్లు వాకిలి, ఉద్యోగం వంటివి పోగొట్టుకుని బాధలు
పడుతున్నాం... ధర్మబద్ధమైనవి పోగొట్టుకుని తిరిగి వాటిని పొందాలని
తపన పడే వారి కోసం ఒక వ్రతం గురించి జీ తెలుగులో చెప్పారు... ఆ
వ్రత విధానం మన సుందరకాండ భక్త బృందం కోసం...
ధర్మబద్ధంగా పోగొట్టుకున్న ఆస్తి, ఇల్లు, ఉద్యోగం వంటివి తిరిగి పొందడానికి... దూరమైన సంతానం, విడిపోయిన కుటుంబంతో పునః సంధానం కోసం...
వ్రత విధానం
మార్గశిర
బహుళ ఏకాదశి నుండి అంటే రేపు శనివారం నుండి వచ్చే మార్గశిర బహుళ ఏకాదశి
వరకు 25 ఏకాదశులు ఈ వ్రతం చేయాలి..దశమి రోజునే ఈ వ్రతం చేస్తామన్న సంకల్పం
చేసుకోవాలి...ఆ రాత్రి కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి... ఏకాదశి రోజు
ఉదయం లేస్తూనే తలారా స్నానం చేసి లక్ష్మీ నారాయణులకి తులసి దళాలతో పూజ చేయాలి
(విష్ణు సహస్ర నామ పారాయణం వంటివి)... రోజంతా ఉపవాసం చేస్తూ నారాయణ జపం
చేసుకుంటూ ఉండాలి...రాత్రికి సత్యనారాయణ స్వామి పూజ చేసుకుని నివేదన చేసి
ఫలాలు, పాలు మాత్రం తీసుకోవాలి...రాత్రికి జాగారం చేయాలి... నారాయణ జపం
కూడా చేయాలి...మర్నాడు ఉదయం ఆఫీస్ లకి వెళ్ళవలసిన వారు ఉండగలిగినంత సేపు
జాగారం చేసి పడుకోవచ్చు...మర్నాడు ద్వాదశి ఘడియలు ముగిసిపోకుండానే తిరిగి
లక్ష్మీ నారాయణులకి తిరిగి పూజ చేసుకుని, క్షీరాన్నం నివేదన చేసి
బ్రాహ్మణునికి స్వయం పాకం ఇవ్వాలి... లేదా ఏదైనా అనాథ శరణాలయంలో అన్న దానం
చేయించవచ్చు...ద్వాదశి ఘడియలు
మర్నాడు లేకపోతే ఆ ఘడియలు ఉన్నప్పుడే వ్రతం ముగించుకోవలసి ఉంటుంది...ముఖ్యంగా దశమి,
ఏకాదశి, ద్వాదశి మూడు రోజులూ చాప మీద పడుకోవాలి ,,, మత్స్య మాంసాలు
తీసుకోకూడదు...బ్రహ్మచర్యం పాటించాలి...ఇలా 25 వారాలు వ్రతం తర్వాత ఉద్యాపన
చేసి వ్రతం ముగించవచ్చు...
No comments:
Post a Comment