Saturday, October 7, 2017
Thursday, October 5, 2017
Tuesday, October 3, 2017
Monday, October 2, 2017
Friday, September 29, 2017
Tuesday, September 26, 2017
Sunday, September 17, 2017
హనుమలో శివుడుని దర్శించిన సీతమ్మతల్లి 🍁🍁
హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో .... ఈ రోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను .... నేనే స్వయంగా వంటచేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అంది సీతమ్మ .... పిలు పిలు .... నీకే అర్థం అవుతుంది అన్నాడు రాముడు నవ్వుతూ .... అన్నట్టుగానే సీతమ్మ స్వయంగా వంటచేసి .... హనుమని భోజనానికి పిలిచింది .... తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ .... కడుపునిండా తిను నాయనా .... మొహమాటపడకు అని చెప్పింది .
.... సరేనమ్మా అని చెప్పి హనుమ తలవంచుకుని భోజనం చేయసాగాడు .... సీతమ్మ కొసరి కొసరి వడ్డిస్తోంది .... హనుమ వద్దు అనకుండా .... వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు .... కాసేపట్లో సీతమ్మ స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది .... సీతమ్మ కంగారు పడి అంతఃపుర వాసుల కోసం వండిన వంట తెప్పించింది .... అదీ అయిపోయింది .... తలవంచుకునే ఆహరం కోసం నిరీక్షిస్తున్నాడు .... హనుమ ఆవురావురమంటూ .... సీతమ్మకి కంగారు పుట్టి .... రోజూ ఏం తింటున్నావు నాయనా .... అని అడిగింది....
రామ నామం తల్లీ .... వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు హనుమ .... సీతమ్మ త్రుళ్లిపడింది .... నిరంతరం రామనామం భుజించేవాడు .... భజించేవాడు .... శివుడోక్కడే గదా .... సీతమ్మతల్లి తేరిపార జూసింది .... అపుడు కనిపించాడు సీతమ్మకి .... హనుమలో శంకరుడు .... శంకరుడే హనుమ .... నిత్యం రామనామం ఆహరంగా స్వీకరించేవాడికి .... తాను మరే ఆహరం పెట్టగలదు ....
సీతమ్మ ఓక అన్నపు ముద్దను పట్టుకుని .... రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది .... ఆ ముద్దని భక్తితో కళ్లకు అద్దుకోని స్వీకరించి .... అన్మదాత సుఖీభవా అన్నాడు హనుమ త్రుప్తిగా .... హనుమలోని పరమేశ్వరుడుకి భక్తితో నమస్కరించింది సీతమ్మతల్లి.
Friday, August 25, 2017
Subscribe to:
Posts (Atom)






