Tuesday, October 24, 2017

అయ్య‌ప్ప‌, ఆంజ‌నేయ స్వామి వార‌ల దీక్ష‌లో దామ‌రాజు


స్వామియే శ‌ర‌ణం అయ్య‌ప్ప‌
నేను సోమ‌వారం అయ్య‌ప్ప‌దీక్ష స్వీక‌రించాను. అయ్య‌ప్ప‌దీక్ష‌తో స‌మాంత‌రంగా ఈ సారి 5 ఆవృత్తాలుగా రోజుకి 9 స‌ర్గ‌ల వంతున సుంద‌ర‌కాండ పారాయ‌ణ చేసుకోవాల‌ని భావించి ఈ రోజు ఉద‌యం క‌ల‌శ‌స్థాప‌న చేశాను. డిసెంబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు నిరంత‌రాయంగా మండ‌ల కాలం పాటు రోజుకి 9 స‌ర్గ‌ల వంతున సుంద‌ర‌కాండ పారాయ‌ణ చేసి 3వ తేదీ స‌హ‌స్ర‌నామార్చ‌న‌తో ముగించాల‌న్న‌ది నా సంక‌ల్పం. డిసెంబ‌ర్ 4వ తేదీ తెల్ల‌వారుఝామున ఇరుముడి క‌ట్టుకుని శ‌బ‌రియాత్ర‌కి బ‌య‌లుదేర‌తాను. స్వామియే శ‌ర‌ణం అయ్య‌ప్ప‌...