Monday, November 28, 2016
Sunday, November 27, 2016
Wednesday, November 23, 2016
Sunday, November 20, 2016
మూడో సారి స్వాగతం
గురూజీ శ్రీమాన్ శృంగారం సింగరాచార్యులవారు మూడోసారి
ప్రగతినగర్ లోని శ్రీ పట్టాభిరామాంజనేయస్వామివారి దేవస్థానంలో
సుందరకాండ వైభవంపై సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు
ప్రవచనాలు చేస్తున్నారు. శ్రీ పట్టాభిరామాంజనేయస్వామివారి ఆలయంలో
గురూజీ ప్రవచనాలు చేయడం ఇది మూడో సారి. 2012 నవంబరులో తొలిసారిగా
ఆయన ప్రవచనాలు చేశారు. ఇదే సమయంలో గురూజీ మన ఆహా ఏమిరుచి
సుందరకథామృతం బ్లాగ్ ను కూడా ఆవిష్కరించారు. ఆ తర్వాత 2013 నవంబర్
లో కార్తీక పౌర్ణమి పర్వదినాన సహస్రదీపోత్సవంతో కూడిన ప్రవచనాలు
నిర్వహించారు. మూడు సంవత్సరాల విరామం తర్వాత ఆయన మరోసారి
ప్రగతినగర్ ప్రజలకు తన ప్రవచన మాధుర్యాన్ని వినిపించడానికి
వస్తున్నారు. ఈ సారి గుడి యాజమాన్యం 26 నుంచి 28 వరకు సుందరకాండ్
హోమాలు నిర్వహిస్తోంది. దాని కన్నా ముందే అసలు సుందరకాండ అంటే ఏమిటి,
మనిషి జీవితంలో సుందరకాండ ప్రాధాన్యం ఏమిటి, సుందరకాండ చేస్తే ఏమిటి
లాభం వంటి అంశాలన్నీ సోదాహరణంగా తెలియచేసేందుకు గురూజీని ఆహ్వానించారు.
అందరూ వచ్చి ఈ ప్రవచన ధారల్లో మునిగి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలని
మనవి.
గురూజీ కార్యక్రమాల ప్రచారం కోసం మూడు సందర్భాల్లోనూ తయారుచేయించిన ఫ్లెక్సిలు...
గురూజీ కార్యక్రమాల ప్రచారం కోసం మూడు సందర్భాల్లోనూ తయారుచేయించిన ఫ్లెక్సిలు...
Wednesday, November 16, 2016
Subscribe to:
Posts (Atom)