Saturday, December 31, 2016
Sunday, December 25, 2016
Friday, December 23, 2016
సఫలైక ఏకాదశి వ్రతం
మనలో చాలా మంది జీవితంలో స్వయంకృతం వల్లనో, మనని చూసి ఓర్వలేని వారి కుట్రల వల్లనో...ఇల్లు, వాకిలి, ఉద్యోగం వంటివి నష్టపోయి తీవ్రమైన బాధలు పడుతున్నాం. ధర్మబద్ధంగా మనం పోగొట్టుకున్నవి ఏవైనా తిరిగి పొందేందుకు, దూరమైపోయిన కుటుంబాల పునః సంథానం కోసం తేలిగ్గా చేసుకోగల అద్భుతమైన వ్రతం ఒకటుంది. అదే సఫలైక ఏకాదశి వ్రతం...
వ్రత విధానం
మార్గశిర బహుళ ఏకాదశి నుంచి అంటే డిసెంబర్ 24 (నేడే) నుంచి వచ్చే ఏడాది మార్గశిర బహుళ ఏకాదశి వరకు మొత్తం 25 ఏకాదశులు ఈ వ్రతం చేయాల్సి ఉంటుంది. ఈ వ్రతం చేసుకోవాలన్న ఆసక్తి ఉన్న వారు దశమి రోజునే తమ కోర్కె భగవంతునికి చెప్పుకుని (తాము ఏది పొందేందుకు వ్రతం చేస్తున్నది) సంకల్పం చేసుకోవాలి. మాకు ఫలానాది ధర్మబద్ధంగా రావాలి. ఆ కోర్కె తీరేందుకు ఏడాది పాటు సఫలైన ఏకాదశి వ్రతం చేయాలనుకుంటున్నామని సంకల్పం చప్పుకోవాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి లక్ష్మీనారాయణులకి తులసి దళాలతో అష్టోత్తర శతనామ పూజ చేయాలి. రోజంతా ఉపవాసం ఉంటూ విష్ణుసహస్రనామ పారాయణం, లక్ష్మీనారాయణ జపం కూడా చేసుకుంటూ కాలం గడపాలి. ఎవరినీ పల్లెత్తు మాట అనకూడదు. స్వచ్ఛంగా ఉంటూ స్వచ్ఛమైన మనసుతో భగవన్నామ స్మరణ చేసుకుంటూ రోజంతా గడపాలి. కటిక ఉపవాసం ఉండలేని వారు కందమూలాలు (నేల నుంచి తీసిన దుంపలు ఉడికించి రుచికరమైన పదార్థాలేవీ అంటే ఉప్పు, కారం వంటివి వేసుకోకుండా), ఏవేనా పళ్ళు తీసుకోవచ్చు. అవకాశాన్ని బట్టి రాత్రి జాగారం చేసినా మంచిది. మర్నాడు ద్వాదశి ఘడియలుండగానే లక్ష్మీనారాయణులకి తిరిగి పూజ చేసుకుని క్షీరాన్నం నివేదన చేసి ఒక బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వాలి. ఏదైనా అనాథ శరణాలయంలో అన్నదానం కూడా చేయవచ్చు. అలా చేసి ఇంటికి చేరి ఉపవాసం ముగించాల్సి ఉంటుంది. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉదయాన్నే ముగుస్తుంటే ఆ ఘడియలుండగానే కాస్తంత ప్రసాదం నోట్లో వేసుకుని బ్రాహ్మణునికి స్వయంపాకం వంటి విధివిధానాలు ముగించవచ్చు. దశమి, ఏకాదశి, ద్వాదశి మూడు రోజులూ కింద చాప వేసుకుని నిద్రించాలి. బ్రహ్మచర్యం చేయాలి. ఇలా 25 వారాలు (అధిక మాసాలు వస్తే 27 వారాలు అవుతుంది) వ్రతం చేసి ఉద్యాపన చేసుకుని ముగించాలి.

Sunday, December 11, 2016
సైదాబాద్ శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో ప్రవచనం
గురూజీ ఈ నెల ఆరో తేదీ మంగళవారం నుంచి 10 వ తేదీ శనివారం వరకు సైదాబాద్ లోని శ్రీ రామచంద్రస్వామి వారి దేవాలయంలో మార్గశీర్షం-సుందరకాండ వైభవం అనే అంశంపై ప్రవచనాలు నిర్వహించారు. శనివారం ప్రవచనాల ముగింపు సందర్భంగా ఆలయ యాజమాన్యం గురూజీ దంపతులను సత్కరించారు. ఆ దృశ్యాలతో పాటు అంతకు ముందు ఐదు రోజుల పాటు జరిగిన ప్రవచనాల చిత్రాలు కూడా కొన్ని...
Friday, December 9, 2016
హనుమకు ఆకుపూజ ఎందుకు...?
ఆంజనేయ స్వామి వారికి మనం తమలపాకులతో పూజ చేస్తూ ఉంటాం... కానీ ఎలా
ఎందుకు చేయాలన్నది మనలో చాలా మందికి తెలియదు... ఇందుకు ఒక చక్కని కారణం
ఉంది... అదేమిటో తెలుసుకుందాం...
తమలపాకు బ్రహ్మ సృష్టి లోనిది కాదు. తమలపాకును నాగవల్లి అని పిలుస్తారు. ఇంద్రుని ఐరావతాన్ని కట్టి ఉంచే రాటనే నాగవల్లిగా పిలుస్తారు...అలా
ఇంద్రలోకంలో నాగవల్లికి ఆశ్రయించి అల్లుకున్న తీగ నుండి ఉద్భవించినదే
తమలపాకు... అంతటి విశిష్టమైన తీగ నుండి ఉద్భవించిన ఆకుతో పూజ అందుకునే
అర్హత కూడా అంత విశిష్టమైన వారికే ఉంటుంది..అలాంటి విశిష్టతలు ఎవరికి
ఉన్నాయి అని అన్వేషిస్తే కనిపించింది హనుమ ఒక్కడే... Monday, November 28, 2016
Sunday, November 27, 2016
Subscribe to:
Posts (Atom)