Saturday, November 16, 2019

కార్తీక పురాణం- 19వ రోజు పారాయ‌ణం (బ‌హుళ చ‌వితి రోజున‌)

స‌ప్త‌మాధ్యాయం
ఓ పృథు భూపాలా కార్తీక వ్ర‌త‌స్థుడైన పురుషుడు పాటించ‌వ‌ల‌సిన నియ‌మాల‌ను చెబుతాను విను అంటూ నార‌దుడు తిరిగి ప్రారంభించాడు.
కార్తీక వ్ర‌త‌స్థుడు మాంసం, తేనె, రేగుప‌ళ్లు భుజించ‌కూడ‌దు. ప‌రాన్న భుక్తి, ప‌ర‌ద్రోహం, దేశాట‌న‌లు త్య‌జించాలి. తీర్థ‌యాత్ర‌లు మాత్రం చేయ‌వ‌చ్చును. దేవ బ్రాహ్మ‌, గురు రాజుల‌న, స్ర్తీల‌ను, గో వ్ర‌త‌స్థుల‌ను దూషించ‌కూడ‌దు. అవిసె నూనె, నువ్వుల నూనె, విక్ర‌యాన్న‌ము, నింద్య వ్యంజ‌న‌యుక్త భోజ‌నం, దూషితాహారం విస‌ర్జించాలి. ప్రాణి సంబంధిత మాంస చూర్ణాలు, ఆమ్ల సంబంధాలైన నిమ్మ‌కాయ‌లు, కొఱ్ర‌ల వంటి హీన‌ధాన్యాలు, చ‌ద్ది అన్నాన్ని స్వీక‌రించ‌కూడ‌దు. మేక‌, గెదె, ఆవు పాలు త‌ప్ప మ‌రే ఇత‌ర ప్రాణుల అమిష సంబంధ క్షీరాలు స్వీక‌రించ‌కూడ‌దు. బ్రాహ్మ‌ణులు విక్ర‌యించే ర‌సాలు, భూజాత ల‌వ‌ణాలు విస‌ర్జించాలి. రాగి పాత్ర‌లో్ల ఉంచిన పంచ‌గ‌వ్యం, చిన్న చిన్న గుంట‌ల్లో ఉండేకుళ్లు, దైవానికి నివేదించ‌ని అన్నం ఆ మూడు మాంస‌తుల్యంగా భావించాలి. వాటిని విస‌ర్జించాలి. బ్ర‌హ్మ‌చ‌ర్యం, భూశ‌య‌నం పాటించాలి. ఆకుల‌లోనే భోజ‌నం చేయాలి. నాల్గ‌వ ఝామున భుజించ‌డం శ్రేష్ఠం. కార్తీక వ్ర‌త‌స్థుడుఒక్క న‌ర‌క చ‌తుర్ద‌శినాడు త‌ప్ప త‌క్కిన దీక్షాదినాల్లో తైలాభ్యంగ‌నం చేయ‌కూడ‌దు. విష్ణువ్ర‌తం చేసే వారు వంకాయ‌, గుమ్మ‌డికాయ‌, వాక్కాయ‌, పుచ్చ‌కాయ‌లు, ముల్లంగి, మారేడు, ఉసిరిక‌, ఆన‌ప‌, చేదుపొట్ల‌, ఉల్లి, కొబ్బ‌రికాయ‌ విస‌ర్జించాలి. మ్లేచ్ఛులు, వ్ర‌త‌భ్ర‌ష్టులు, వేద‌త్య‌క్తుల‌తో సంభాషించ‌కూడ‌దు. అలాంటి వారి ఎంగిలి త‌గిలిన‌, కాకులు తాకిన ఆహారం, అశౌచ సంబంధిత ఆహారం, ఒక‌సారి వంటి మ‌ర‌ల ఉడికించిన, మాడు ప‌ట్టిన అన్నాన్ని తిన‌కూడ‌దు. త‌న శ‌క్తి కొద్ది విష్ణు ప్రీతికోసం కృచ్ఛాదుల‌ను ప‌రిత్య‌జించాలి. ఇంకా కొన్నిటిని బ్ర‌హ్మార్ప‌ణం భుజించాలి. కార్త‌క మాసంలో ఆచ‌రించిన‌ట్టుగానే మాఘ‌మాసంలో కూడా చేయాలి.
కార్తీక వ్ర‌తాన్ని య‌థావిధిగా ఆచ‌రించే భ‌క్తుల‌ను చూసి య‌మ‌దూత‌లు సింహాన్ని చూసిన ఏనుగు వ‌లె పారిపోతారు. వంద య‌జ్ఞాలు చేసిన వాడు కూడా స్వ‌ర్గాన్నే పొందుతున్నాడు, కాని కార్తీక వ్ర‌త‌స్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతాడు. కాబ‌ట్టి య‌జ్ఞ‌యాగాదుల క‌న్నా కార్తీక వ్ర‌తం గొప్ప‌ది. ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్య‌క్షేత్రాల‌న్నీ కార్తీక వ్ర‌త‌స్థుని శ‌రీరంలోనే ఉంటాయి. రాజును సేవ‌కులు కొలిచిన‌ట్టుగా ఈ వ్ర‌త‌స్థుడిని విష్ణ్వాజ్ఞావ‌శ‌వ‌ర్తులైన ఇంద్రాదులు సేవిస్తారు. విష్ణువ్ర‌తాచ‌ర‌ణ‌ప‌రులు ఎక్క‌డ పూజ‌లందుకుంటారో అక్క‌డి నుంచి గ్ర‌హ‌, భూత‌, పిశాచ గ‌ణాలు ప‌లాయ‌న మంత్రం ప‌ఠిస్తాయి. య‌థావిధిగా కార్తీక వ్ర‌తం చేసే వారి పుణ్యాన్ని చెప్ప‌డం చ‌తుర్ముఖుడైన బ్ర‌హ్మ‌కు కూడా సాధ్యం కాదు. ఈ కార్తీక వ్ర‌తాన్ని విడువ‌కుండా ఆచ‌రించే వాడు తీర్థ‌యాత్ర‌లు చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు.
స‌ప్త‌మోధ్యాయ స‌మాప్తః
-------------
అష్ట‌మాధ్యాయం
ప్ర‌జారంజ‌న‌శీలా, పృథునృపాలా ఈ కార్తీక వ్ర‌తోద్యాప‌నా విధిని సంగ్ర‌హంగా చెబుతాను.
ఉద్యాప‌నా విధి
విష్ణు ప్రీతి కోసం, వ్ర‌త సాఫ‌ల్య‌త కోసం కార్తీక శుద్ధ చ‌తుర్ద‌శి నాడు వ్ర‌త‌స్థుడు ఉద్యాప‌నం చేయాలి. తుల‌సిని స్థాపించి దాని చుట్టూ తోర‌ణాలు గ‌ల‌ది, నాలుగు ద్వారాలు గ‌ల‌ది, పుష్ప వింజామ‌ర‌ల‌చే అలంకృత‌మైన‌ది అయిన శుభ‌ప్ర‌ద‌మైన మండ‌పం ఏర్పాటు చేయాలి. నాలుగు ద్వారాల వ‌ద్ద సుశీల‌, పుణ్య‌శీల‌, జ‌య, విజ‌యుల‌ను ద్వార‌పాల‌కులుగా మ‌ట్టితో ప్ర‌తిష్ఠించి వారిని ప్ర‌త్యేకంగా పూజించాలి. తుల‌సి మొద‌ట్లో నాలుగు రంగులు గ‌ల ముగ్గుల‌తో స‌ర్వ‌తోభ‌ద్రం అనే అలంకారం చేయాలి. దానిపై పంచ‌ర‌త్న స‌మ‌న్వితం, నారికేళ సంయుక్తం అయిన క‌ల‌శం ప్ర‌తిష్ఠించి శంఖ‌, చ‌క్ర‌, గ‌దా, ప‌ద్మ‌ధారి, పీతాంబ‌రుడు, ల‌క్ష్మీస‌మేతుడు అయిన నారాయ‌ణుని పూజించాలి. ఇంద్రాది దేవ‌త‌ల‌ను ఆయా మండ‌లాల్లో అర్చించాలి. శ్రీ మ‌హావిష్ణువు ద్వాద‌శి రోజున నిద్ర లేచి త్ర‌యోద‌శి నాడు దేవ‌త‌ల‌కు ద‌ర్శ‌న‌మిచ్చి, చ‌తుర్ద‌శి నాడు పూజ‌నీయుడై ఉంటాడు గ‌నుక మాన‌వుడు ఆ రోజున నిర్మ‌ల‌చిత్తుడై ఉప‌వాసం ఉండి విష్ణుపూజ విధివిధానంగా ఆచ‌రించాలి.  

గురువు ఆజ్ఞానుసారం శ్రీ‌హ‌రిని సువ‌ర్ణ రూపంలో ఆవాహ‌న చేసి షోడ‌శోప‌చారాల‌తో పూజించి పంచ‌భ‌క్ష్యాలు నివేదించాలి. గీత‌, వాద్య‌, మంగ‌ళ ధ్వ‌నుల‌తో ఆ రాత్రి నుంచి సేవించుకు మ‌ర్నాడు ప్రాతః కాల‌కృత్యాలు తీర్చుకుని నిత్య క్రియ‌లు ఆచ‌రించాలి. ఆ త‌ర్వాత నిష్క‌ల్మ‌షాంత‌రంగుడై హోమం చేసి బ్రాహ్మ‌ణ స‌మారాధ‌న చేసి య‌థాశ‌క్తి ద‌క్షిణ‌లు స‌మ‌ర్పించాలి. ఈ విధంగా వైకుంఠ చ‌తుర్ద‌శినాడు ఉప‌వ‌శించిన వాడూ, విష్ణుపూజ చేసే వాడు త‌ప్ప‌క వైకుంఠాన్నే పొందుతాడు.

ఓ బ్రాహ్మ‌ణులారా, మీరు సంతోషించ‌టం చేత నేను విష్ణ్వ‌నుగ్ర‌హం పొందెద‌ను గాక‌. ఈ వ్ర‌తాచ‌ర‌ణ వ‌ల‌న గ‌త ఏడు జ‌న్మ‌ల‌లోని నా పాపాలు న‌శించును గాక‌. నా కోరిక‌లు తీరును గాక‌. గోత్ర వృద్ధి స్థిర‌మ‌గుగాక అన బ్రాహ్మ‌ణుల‌ను క్ష‌మాప‌ణ వేడాలి. 

వారి చేత త‌థాస్తు అని దీవ‌న‌లందుకుని దేవ‌తోద్వాస‌న‌లు చెప్పి బంగారు కొమ్ముల‌తో అలంక‌రించిన గోవును గురువుకు దానం ఇవ్వాలి. ఆ త‌ర్వాత స‌జ్జ‌నుల‌తో కూడిన వాడై భోజ‌నాదులు పూర్తి చేసుకోవాలి.
  
శ్రీ‌ప‌ద్మ‌ పురాణాంత‌ర్గ‌త‌మైన కార్తీక మాహాత్మ్యం  7, 8 అధ్యాయాలు స‌మాప్తం
19వ రోజు పారాయ‌ణం ముగిసింది.   

No comments:

Post a Comment