విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్మృత చేష్ఠుడు, విస్మయ
రూపుడు అయిన ధర్మదత్తుడు వారితో మరోసారి దండవత్ గా ప్రణామం చేసి “ఓ విష్ణు స్వరూపులారా, ఈ జనానీకమంతా అనేకానేక క్రతువ్రతదానాల చేత ఆ కమలనాభుని సేవించుకుంటూ ఉన్నారు. వాటన్నింటిలోనూ ఏ ఒక్కదానిని ఆచరించడం వలన విష్ణువుకి అమితమైన ప్రీతి కలుగుతుదో, దేని వలన
విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో సెలవీయండి” అని వేడుకున్నాడు. అతన్ని విష్ణుగణాలు ఇలా సమాధానపరచసాగాయి.
పాపరహితుడైన ఓ బ్రాహ్మణుడా, నీవడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక కథ చెబుతాం విను. పూర్వం కాశీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించే వాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతి కోసం అనేకానేక యజ్ఞాలు నిర్వర్తించాడు. అతని యజ్ఞాల కోసం నిర్మించిన బంగారపు యూప స్తంభాలతో తామ్రపర్ణి నది రెండు తీరాలు కూడా కుబేరోద్యానవనాలైన చైత్రరథాల వలె ప్రకాశించేవి. అటువంతి రాజు ఒకానొకనాడు అనంతశయనమనే పేర యోగనిద్రాముద్రితుడై ఉండే విష్ణు ఆలయానికి వెళ్లి మణిమౌక్తిక సువర్ణ పుష్పాలతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి అక్కడే శ్రీహరి సన్నిధిలోనే కూచున్నాడు. అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడు విష్ణుమూర్తి అర్చన కోసం ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణుసూక్తాన్ని
పఠిస్తూ అతడు విష్ణుసంజ్ఞను అభిషేకించి తులసి దళాలు, గుత్తులతో విష్ణుపూజ నిర్వహించాడు. అది చూసి రాజుకి కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి “ఓ విష్ణుదాసుడా! మాణిక్యాలతోను, బంగారు పూలతోను చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువుని నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పేశావురా, నేనెంతో భక్తితో చేసిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా” అని చీదరించుకున్నాడు. ఆ మాటలకు ఆ బ్రాహ్మణునికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి “ఓ రాజా నీకు దైవభక్తి లేదు సరికదా రాజ్యైశ్వర్యమత్తుడవై ఉన్నావు. విష్ణు ప్రీత్యర్ధం నీవు ఆచరించిన యజ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు” అని ఎదురుసమాధానం ఇచ్చాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ “నీ మాటల వలన నీవే విష్ణభక్తి శూన్యుడవని తెలుస్తోంది. ధనహీనుడవు, దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు ఒక్కసారైన విష్ణుప్రీతిగా నీవొక యజ్ఞాన్ని చేశావా, కనీసం ఒక దేవాలయం కట్టించావా?? ఏమీ చేయలేని నీకు భక్తుడనే అహంకారం మాత్రం అధికంగా ఉంది” అని దూషిస్తూ ఓ సదస్యులారా, సద్ర్బాహ్మణులారా శ్రద్ధగా వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో, ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి. అంతటితో మా ఇద్దరిలో ఎవరి భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞ చేసి చోళుడు స్వగృహానికి వెళ్లాడు. ముద్గలుడు అనే మునిపుంగవుని ఆచార్యునిగా ఎంచుకుని విష్ణుయాగానికి సమాయత్తం అయ్యాడు. బహుకాల పూర్వం గయా క్షేత్రంలో ఋషి సముదాయాలు చేసినది, అనేకానేక దక్షిణలు, అన్నదానాలతో సమానం కానిది, సామాన్యులు ఆచరించసాధ్యం కానిది, సర్వసమృద్ధి కలిగించేది అయిన యజ్ఞాన్ని చేయసాగాడు.
పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణుదీక్షాబద్ధుడై హరిప్రీతికై ఆచరించాల్సిన మాఘ, కార్తీక వ్రతాచరణలు, తులసీవన సంరక్షణలు, ఏకాదశి నాడు ద్వాదశాక్షరీయుత విష్ణుజపం, షోడశోపచార విధిని నిత్యపూజలు నృత్యగీతవాద్యాది మంగళధ్వనులతో తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యం సర్వవేళల్లో, భోజనాది సమయాల్లో, సంచారంలో, చివరికి నిద్రలో కూడా హరినామ స్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘ, కార్తీక మాసాల్లో విశేష నియమ పాలన ఆచరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా చోళ, విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలనూ వ్రతనిష్ఠలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం వ్రతాలు ఆచరిస్తూనే ఉన్నారు.
ఏకవింశోధ్యాయ సమాప్తః
----------------
ఏకవింశోధ్యాయ సమాప్తః
----------------
ద్వావిశోధ్యాయం
కాలం గడుస్తూ ఉండగా ఒక నాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేశారు. ఆ దొంగిలించిన వారెవరా అనే విషయంలో విష్ణుదాసుడు పెద్దగా విచారణ చేయలేదు. మరోసారి వంట ప్రయత్నం చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం దగ్గర పడడం వలన ఆ రోజు భోజనం లేకుండా పూర్తిగా విష్ణుపూజలోనే గడిపేశాడు. మర్నాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలే ఆ వంటకాలను ఎవరో అపహరించుకుపోయారు. విష్ణుపూజకు సమయం మించిపోకూడదనే ఆలోచనలో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు భోజనం లేకుండా హరిసేవ కొనసాగించాడు. ఇలా వారం రోజుల పాటు జరిగింది. ప్రతీ రోజూ అతని భోజనాన్ని ఎవరో చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు. అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల పాటు అభోజనంగా ఉండడంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే వంటకాలను యథాస్థానంలో ఉంచి తాను ఒక చాటున దాక్కుని దొంగకోసం ఎదురు చూడసాగాడు. కాసేపటికి ఒక ఛండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది. రక్తమాంసాలే మాత్రం లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్టుగా ఉన్నాడు. అన్నార్తుడైన ఆ ఛండాలుడు వంటకాలను దొంగిలించుకుపోసాగాడు. అతని దైన్యస్థితిని చూసి అప్పటికే కరుణాభరిత హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు "ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా. ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తినడం కష్టం. ఈ నేతిని కూడా తీసుకెళ్లు" అంటూ నేతి జాడీతో సహా అతని వెంటపడ్డాడు. ఈ విప్రుడు తనని బంధించి రాజభటులకు అప్పగిస్తాడనే భయంతో వాడు పరుగుతీయనారంభించాడు. ఈ పారుడు కూడా ఆ చోరుని వెనుకే పరుగెడుతూ "అయ్యా నెయ్యి తీసుకెళ్లి కలిపి తినవయ్యా స్వామీ" అని అరుస్తూనే ఉన్నాడు. అసలు అలసటగా ఉన్న ఆ ఛండాలుడు నేల మీద పడి మూర్ఛపోయాడు. అతడిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్ఛపోయావా మహాత్మా అంటూ తన వై వస్ర్తం చెంగులతో ఆ ఛండాలునికి విసరసాగాడు. ఆ సేవ వల్ల త్వరలోనే కోలుకున్న ఆ ఛండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు. ఇప్పుడితను విష్ణుదాసుని కళ్లకి శంఖ చక్ర గదాధరి, పీతాంబరుడు, చతుర్భుజుడు, శ్రీవత్సలాంచితుడు, కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతను సాత్వికాభావ వృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు.ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్ధం ఇంద్రాదులు విమానారూఢులై ఆ ప్రాంతానికి వచ్చారు. విష్ణువు మీద, విష్ణుదాసుని మీద పూల వర్షం కురిపించారు. అప్సరసలు ఆడారు. గంధర్వులు పాడారు. దేవగణాలు వచ్చిన వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయింది. ఆదినారాయణుడు విష్ణుదాసుని బలంగా కౌగలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు.

యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములై ఉన్న బ్రాహ్మణ, బ్రహ్మజనకులిద్దరినీ చూసి ఆశ్చర్రయపోయాడు. తక్షణమే ఆచార్యుని పిలిచి ఓ ముద్గర మునీ నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్లిపోతున్నాడు. అమిత ఐశ్వర్యవంతుడనైన నేను అసాధ్యాలైన యజ్ఞదానాలను చేస్తూ కూడా విష్ణుసాక్షాత్కారం పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసాధ్యమే కదా! నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద కొంచెమైనా కృప కలిగినట్టు లేదు.దీనిని బట్టి కేవల భక్తి తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు. బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండడం వలన నిస్సంతుడైన ఆ రాజు తన మేనల్లునికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు.
శ్లో - తస్మాదద్యాపి తద్దేశే సదారాజ్యాంశ భాగినః
స్వ స్ర్తీయా ఏవ జాయంతే తత్కృతా విధి వర్తినః
ఆ కారణం చేతనే ఇప్పటికి కూడా చోళ దేశాల్లో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్లే కర్తలవుతున్నారు.
అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు చేరి ఓ శ్రీహరీ త్రికరణ శుద్ధిగా నీ మీద భక్తిని నాలో సుస్థిరం చేయి తండ్రీ అని ప్రార్థించి సమస్త సదస్యులూ చూస్తుండగానే అగ్ని ప్రవేశం చేశాడు.
శ్లో - ముద్గలస్తు అతః క్రోధాచ్ఛిఖముత్పాటయన్ స్వకాం
అతస్త్వద్యాపి తద్గోత్రే ముద్గలా విశిఖా2భవన్
అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికివేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రం ఈ నాటికీ విశిఖగానే వర్థిల్లుతోంది.
హెమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ననుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్లిపోయాడు.
ఓ ధర్మదత్తా, అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని, ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కరించి తన వైకుంఠంలో ద్వారపాలకులుగా చేసుకున్నాడు. ఓ విప్రుడా విష్ణు అనుగ్రహానికి, విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక మార్గం భక్తి మాత్రమే. ఆ మార్గాలు రెండూ ఒకటి ఆత్మజ్ఞానం, రెండోది ఆత్మార్పణం. అని ధర్మదత్తునికి బోధించి విష్ణుపారిషదులు మౌనం వహించారు.

శ్రీపద్మ పురాణాంతర్గతమైన కార్తీక మాహాత్మ్యం 21,22 అధ్యాయాలు సమాప్తం
26వ రోజు పారాయణం ముగిసింది.
No comments:
Post a Comment