అయోధ్యలో శ్రీరామాలయానికి శంకుస్థాపన జరగడం మనందరి అదృష్టమని, అందులోనూ మనం జీవించి ఉన్న కాలంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతమని గురూజీ శ్రీమాన్ శృంగారం సింగరాచార్యుల వారు భావించారు. అందుకే రామాలయం శంకుస్థాపన జరిగిన వారంలో ఆగస్టు 5-8 తేదీల మధ్యన మన సుందరకాండ భక్తబృందం అందరూ ఇళ్లలో కూచుని శ్రీరామజయరామ జయజయ రామ అంటూ శక్తి మేరకు జపం చేయాలని సూచించారు. ఆ మేరకు మొత్తం 152 మంది భక్తబృందం ఈ జపంలో పాల్గొని 4 రోజుల్లోనూ మొత్తం 5,86,457 నామాలు జపం చేశారు. 9వ తేదీ ఆదివారంనాడు గురూజీ వారి నివాసంలోనే సుందరకాండ భక్తులందరి సంక్షేమం కోసం ప్రత్యేకించి ప్రస్తుత కరోనా కల్లోల సమయంలో అందరి ఆయురారోగ్యాల కోసం హోమం నిర్వహించి భక్తబృందం అందరికీ ఆశీస్సులు అందచేశారు. గురూజీ ఆదేశం మేరకు 152 మంది భక్తులు చేసిన జపం వివరాలు ఈ దిగువ పట్టికల్లో ఉన్నాయి.
No comments:
Post a Comment