సుందరకాండ భక్తకోటికి
శుభాశీస్సులు. కరోనా మహమ్మారి మన పుణ్యభూమిని ఆశ్రయించి అర్ధ సంవత్సరం గడిచింది. మన భక్తుల్లో 5 శాతం మంది దీని బారిన పడినా మనం కావిస్తున్న పూజల ఫలితంగా మృత్యువు మన దరిదాపులకు రావడానికి భయపడుతూ ఉన్నది. శ్రీ రామచంద్రస్వామివారి కల్యాణం, వినాయక చవితి లాంటి ఎన్నో ముఖ్యమైన పండుగలకు దూరమయ్యాం. అసలు ఈ శార్వరి నామ సంవత్సరమైనా లేదా ఆంగ్ల సంవత్సరం 2020 అయినా ప్రపంచ ప్రజలకు ఎంతో కీడు చేసింది. కరోనాతో మన వారు నాకు ఫోన్ చేయడం, వెంటనే నేను స్వామివారిని కోరడం, వారు ఈ రోగం నుంచి బయటపడడం జరిగింది. ఈ రోజు అనగా 8-9-2020 ఉదయం నుంచి మన వాళ్లు ఎందరి నుండో ఎన్నో సమస్యలతో కూడిన ఫోన్లు అందుకున్నాను. సాయంత్రం స్వామివారి పీఠం వద్ద కూర్చుని కర్తవ్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు చేతిలో నుంచి శ్రీ ఆంజనేయ సహస్రనామార్చన పుస్తకం జారి పడింది. కొన్ని కాగితాలు అందులో నుంచి విడిపోయాయి. వాటిని ఏరుకునే క్రమంలో స్వామివారి 900వ నామం ఉన్న కాగితంపై చూపు పడింది. అదే

ఓం మ హా సుం ద రా య న మః
1 2 3 4 5 6 7 8 9
సుందరకాండ మొత్తం ఈ నామం పైనే ఆధారపడి ఉంది. ఎలాగంటే...
"బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతా, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణా భవేత్"
శ్రీ ఆంజనేయస్వామి వారి స్మరణ వలన మనకు పైన శ్లోకంలో వివరించిన లాభాలు సమకూరుతాయి. మరి ఇలాంటి లాభాలు సమకూర్చే ఆంజనేయస్వామివారు సులభంగా ఎక్కడ లభ్యమవుతారు? మొత్తం రామాయణంలోని ఆరు కాండములలో సుందరకాండమునందు మాత్రమే విరాట్ స్వరూపుడై మనకు లభిస్తారు. అందుచేతనే సుందరకాండం ఆయన నామంతోనే విలసిల్లుతోంది. ఆంజనేయస్వామివారు శివాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు సుందరేశుడు, మహాసుందరుడు అనే నామాలు కూడా ఉన్నాయి.
అందుకే శ్రీ ఆంజనేయస్వామి వారి సహస్ర నామాల్లో 900వ నామం మహాసుందరాయ నమః అని పొందుపరచబడింది. కాబట్టి మహాసుందరాయ నమః అనే ఒక్క నామానికి ఒక్కొక్క సుందరకాండ పారాయణం చేసిన ఫలితం లభిస్తుంది.
తొమ్మిదవ నంబరుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యతను సమయాభావం వలన ఇక్కడ వివరించడంలేదు. "త్రిజటా స్వప్ప వృత్తాంతం"లో దీని సమగ్ర వివరణ ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ 900 నామం చాలా మహిమాన్వితమైనది.
డిసెంబరు 2020 వరకు ఈ కరోనా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ఈ 2020 సంవత్సరం ప్రకలకు అచ్చిరాని సంవత్సరం. అందుచేత మనం ఈ మహిమ గల శ్రీ స్వామివారి నామాన్ని జపరూపకంగా నిర్వహిస్తూ ఈ సంవత్సరంలోని శేష మాసాలు మనకు ఎలాంటి ఆపదలు సంభవించకుండా చూచుకుందాము
ఈ జపానికి దశకోటి నామోచ్ఛరణ (10,00,000) కావించాలని, దీనికి 30 రోజుల గడువు ఉండాలని నిర్ణయించాము. ఈ కార్యక్రమానికి ముందుగా భక్తులను నమోదు చేసుకునే కార్యక్రమంతో ప్రారంభించి ముగింపు తర్వాత శ్రీ ఆంజనేయస్వామి వారి అష్టోత్తరశత మరియు సహస్ర నామార్చన కావించాలని నిర్ణయించాం.

అలాగే
భక్తులు చేసిన జప సంఖ్యను వారి గోత్ర నామాలతో సహా లిస్టులను సిద్ధం కావించి ఆ లిస్టును కొండగట్టు ఆంజనేయస్వామివారి పాదసన్నిధికి చేర్చాలని గొప్ప నిర్ణయం తలపెట్టాము (నిబంధనల వలన కొండగట్టుకు వెళ్లడానికి భక్తులు అనుమతించబడరు).
భక్తుల గోత్ర నామాల నమోదు కార్యక్రమం
ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి 14-9-2020 సాయంత్రం 4 గంటల వరకు భక్తుల పేర్ల నమోదు ప్రక్రియ జరుగుతుంది. 17-9-2020 వరకు (మహాలయ అమావాస్య) ఎంత మంది భక్తులు ఈ జపంలో పాల్గొనబోతున్నారో వారి గోత్రనామాలతో సహా ఫైనల్ లిస్టు ఈ దాసునికి చేరుతుంది.

జప ప్రారంభ కార్యక్రమం
అధిక ఆశ్వయుజ మాసం మొదటి రోజు వదిలి 19-9-2020 శనివారం నుంచి జపాలు ప్రారంభించబడి 16-10-2020 శుక్రవారంతో ముగుస్తుంది. నిజ ఆశ్వయుజ మాసం రెండవ రోజు శనివారం రోజున శ్రీ స్వామివారికి సహస్రనామార్చన జరుపబడుతుంది.
పర్యవేక్షకులు
యథాప్రకారం భక్లుల లిస్టులు సిద్ధం కావించి అందించడానికి శ్రీ ఆత్మూరి మాణిక్యరావుగారిని కోరుతున్నాము.
అలాగే సమయ నిబంధనలు పాటించి తగిన చర్యలను తీసుకోవడానికి శ్రీ దామరాజు వేంకటేశ్వర్లు గారిని కోరుతున్నాము. గడువు ముగిసన తర్వాత వచ్చే పేర్లను శ్రీ మాణిక్యరావుగారు పరిగణనలోకి తీసుకోవలసిన పని లేదు. అలాగే సమయపాలన చేయని వారిని ఒక తప్పు కాచి రెండవ సారి తప్పు చేస్తే వారి పేర్లను శాశ్వతంగా తొలగించవచ్చును.
జపంలో పాల్గొనే భక్తులకు మార్గదర్శకాలు
ఎన్ని మార్లు చెప్పినా పాల్గొనువారు ప్రకటన పూర్తిగా చదవకుండా మార్గదర్శకాలను సరిగ్గా పాటించకుండా మాకు తలనొప్పి కలగచేస్తున్నారు. ఈ మారు మాత్రం నిబంధనలు అతిక్రమించిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ జప అవకాశం కలుగచేయలేము.
నిబంధనలు జాగ్రత్తగా చదివి అమలు చేయండి.
1. పాల్గొను వారు తమ వివరాలు ఇలా ఇవ్వాలి. 1) గోత్రం 2) ఇంటిపేరు 3) పాల్గొను వారి పేరు
2. చాలా మంది పేర్లు, గోత్రాలు ఇంగ్లీషు అక్షరాల్లో ఇవ్వడం వలన తెలుగులోకి వచ్చే సరికి తప్పులు వస్తున్నాయి. అందుచేత పాల్గొనే వారు తమ వివరాలు తెలుగులోనే రాయాలి. ఒకవేళ తెలుగులో రాయలేని వారు కాగితం మీద తెలుగులో రాసి ఫొటో తీసి పంపవచ్చును. నిబంధనలు పాటించని వారి పేర్లు మాణిక్యరావుగారు తిరస్కరించవచ్చును.
3.మన ముందు శ్రీ స్వామివారు 10 కోట్ల నామోచ్చారణ అనే పెద్ద భారం పెట్టినందున ప్రతి వారు తమ జపాలను పెంచే ప్రయత్నం చేయండి. కొందరు తమ పేర్లు లిస్టులో రావడానికి ఒక జపమాలను తిప్పి అయిందనిపిస్తారు. అలా కాకుండా త్రికరణశుద్ధిగా రోజూ ఈ జపం నిర్వహించండి.
4. జపం ఉదయం పూటనే చేయాలి. భోజనమునకు ముందు జపం పూర్తి కావాలి
5. మీ జన సంఖ్యను ఏ రోజుది ఆ రోజే మధ్యాహ్నం 2 గంటలు దాటకుండా పోస్టు చేయాలి.
6. మీ పోస్టింగులు సుందరకాండ గ్రూప్ లో మాత్రమే ఉండాలి. ఇతరత్రా ఎలా పంపినా వాటిని తిరస్కరిస్తాము.
7. సందేహాలు తీర్చుకోవడానికి మా ఫోను ద్వారా అవకాశం కల్పించాము.
8. ఆరోగ్య కారణాల వలన చివరి రోజు సహస్ర నామార్చనకు గాని, కొండగట్టు యాత్రకు గాని ఎవరికి అనుమతి లేదు.
కొండగట్టు స్వామివారికి మా స్వీయ ఆర్జన ధనంతోనే పాల్గొను వారి లిస్టులు సమర్పిస్తారు.
ఈ అపూర్వ అవకాశం జారవిడుచుకోకండి. అందరూ మీ పేర్లను గడువు లోగా నమోదు చేసుకోండి.
శుభమస్తు
మీ శృంగారం సింగరాచార్యులు

No comments:
Post a Comment