Monday, December 2, 2013
Sunday, December 1, 2013
Saturday, November 30, 2013
ఈ వారం శ్లోకం 7
శ్లో - చతుర్ణామేవ హి గతిర్వానరాణాం మహాత్మనాం
వాలి పుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః
వివరణ
- ఆంజనేయ స్వామివారు సీతాన్వేషణకై పయనమై త్రికూట పర్వత శిఖరం మీద లంకా నగర
ప్రాకారాన్ని చేరుకుంటాడు. దుర్భేద్యమైన లంకను చూసి హనుమంతుడు, దీన్ని
దేవతలు కూడా జయించలేరు... ఈ నగరాన్ని చేరుకునే వారిలో పైన వివరించిన
నలుగురు మాత్రమే రాగలరు అనుకుంటారు...
వ్యాఖ్యానము
- జీవాత్మ అరిషడ్వర్గములచే బంధింపబడి ఉంటుంది. ఆ బంధము నుండి జీవుడిని
విముక్తి చేసి తిరిగి పరమాత్మను చేర్చు వాడు ఆచార్యుడే... గురువు ద్వారానే ఈ
కార్యము సాధ్యమవుతుంది. ఇక్కడ సీతమ్మ జీవాత్మ... రాముడు పరమాత్మ...
రావణుడు అరిషడ్వర్గములు...ఆచార్యుడు ఆంజనేయ స్వామి...రావణుని సర్వ నాశనం
చేసి సీతమ్మను రాముని చేర్చు వాడు ఆంజనేయుడు. అనగా అరిషడ్వర్గముల బంధము
నుండి జీవాత్మను తప్పించి భగవంతుని చేర్చు వాడు ఆచార్యుడు.
ఇక్కడ
మారుతి, నలుగురము మాత్రమే లంకకు రాగలమన్నాడు. వారు అంగదుడు, నీలుడు,
సుగ్రీవుడు మరియు తాను... ఇందులో అంగదుడు శక్తి... నీలుడు యుక్తి...
సుగ్రీవుడు భక్తి... అంగదుడు ఒకే లంఘనములో శత యోజనముల సముద్రమును దాటి
లంకలోనికి ప్రవేశించగలడు... తిరిగి రావడానికి శక్తి పున్జుకోవలసి ఉంటుంది.
అది వేరే విషయం. అందు వలన శక్తి ద్వారా అంగదుడు లంకను చేరగలడు. నీటిలో రాయి
పడవేస్తే తేలే శక్తి నీలుడుకి ఉంది. అందుచేత లంకకు వారధి నిర్మించి
రాగలడు. అనగా యుక్తితో లంకను చేరగలడు. ఇక సుగ్రీవుడు భక్తికి ప్రతీక...
వాలి నుండి తన భార్య రుమను, కిష్కింధ సామ్రాజ్యమును రాముడు ఇప్పించినందుకు
ఆయనకు విధేయుడయ్యాడు.. కాబట్టి రాముని విధేయుడుగా ఆతను కూడా లంక చేరగలడు.
అయితే ఈ మువ్వురిలో ఎవ్వరు కూడా రాక్షసులను తప్పించుకుంటూ సీతాన్వేషణ
గావించే శక్తి లేని వారు... వివిధ రూపాలు ధరించి షష్టిర్యోజన విస్తీర్ణమైన
లంకలో తిరగగలిగిన శక్తి ఒక్క మారుతికే ఉంది... కాబట్టి జీవాన్వేషణ,
అరిషడ్వర్గ బంధ విముక్తి ఒక్క ఆచార్యునికే ఉంటుందని స్వామి వారు ఈ శ్లోకము
ద్వారా మనకు తెలియజేస్తున్నారు...
సర్వే జనాః స్సుఖినో భవంతు
Monday, November 18, 2013
సహస్ర దీపోత్సవం
Saturday, November 16, 2013
వైభవంగా ముగిసిన 87 వ సుందరకాండ
ప్రగతినగర్ శ్రీ పట్టాభి రామాంజనేయ దేవస్థానంలో మన సుందరకాండ ద్వితీయాస్టోత్తర శతంలోని 87 వ సుందరకాండ ఆదివారం సహస్ర నామార్చనతో అత్యంత వైభవంగా ముగిసింది... దామరాజు వెంకటేశ్వర్లు, శ్రీదేవి అనే మా దంపతులకు కర్తలుగా కూర్చునే భాగ్యం లభించింది... ఊహించిన దాని కన్నా అద్భుతమైన స్పందన వచ్చింది... సుమారు 41 మంది కంకణధారణ చేసుకోగా 100 మంది వరకు సహస్ర నామర్చనలో పాల్గొని తరించారు...17 వ తేదిన సహస్ర దీపాలంకరణతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారం కారణంగా తొలి రెండు రోజులు గురూజీ ప్రవచనాలకు కొంత అంతరాయం కలిగినా మంగళవారం నుంచి ప్రవచనాలు సంతృప్తికరంగానే జరిగాయి. అయితే తొలి రెండు రోజులు పూర్తి స్థాయిలో ప్రవచనాలు జరగకపోవడం వల్ల సుందరకాండ తత్త్వం అంతటినీ భక్తులకు సవివరంగా తెలియచేయలేక పోయానన్న స్వల్ప అసంతృప్తి గురువుగారికి ఉండిపోయింది... ఇలా జరగడం సుందరకాండలు ప్రారంభించాక ఇదే తొలి సారి...87వ సుందరకాండ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరూ సుఖశాంతులతో వర్థిల్లాలని గురువుగారు ఆశీర్వదిస్తున్నారు...
మొదటి రోజు కలశస్థాపన దృశ్య మాలిక ఇది...
| వేదికపై కొలువైన స్వామి |
| వేదికపై కొలువైన స్వామికి గురూజీ వందనం |
| దామరాజు దంపతులచే కలశస్థాపన |
Subscribe to:
Posts (Atom)





















