ప్రగతినగర్ శ్రీ పట్టాభి రామాంజనేయ దేవస్థానంలో మన సుందరకాండ
ద్వితీయాస్టోత్తర శతంలోని 87 వ సుందరకాండ ఆదివారం సహస్ర నామార్చనతో అత్యంత
వైభవంగా ముగిసింది... దామరాజు వెంకటేశ్వర్లు, శ్రీదేవి అనే మా దంపతులకు
కర్తలుగా
కూర్చునే భాగ్యం లభించింది... ఊహించిన దాని కన్నా అద్భుతమైన స్పందన
వచ్చింది... సుమారు 41 మంది కంకణధారణ చేసుకోగా 100 మంది వరకు సహస్ర
నామర్చనలో పాల్గొని తరించారు...17 వ తేదిన సహస్ర దీపాలంకరణతో కార్యక్రమాలు
ప్రారంభం అయ్యాయి. కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారం కారణంగా తొలి రెండు
రోజులు గురూజీ ప్రవచనాలకు కొంత అంతరాయం కలిగినా మంగళవారం నుంచి ప్రవచనాలు
సంతృప్తికరంగానే జరిగాయి. అయితే తొలి రెండు రోజులు పూర్తి స్థాయిలో
ప్రవచనాలు జరగకపోవడం వల్ల సుందరకాండ తత్త్వం అంతటినీ భక్తులకు సవివరంగా
తెలియచేయలేక పోయానన్న స్వల్ప అసంతృప్తి గురువుగారికి ఉండిపోయింది... ఇలా
జరగడం సుందరకాండలు ప్రారంభించాక ఇదే తొలి సారి...87వ సుందరకాండ
కార్యక్రమాల్లో పాల్గొన్న అందరూ సుఖశాంతులతో వర్థిల్లాలని గురువుగారు
ఆశీర్వదిస్తున్నారు...
మొదటి రోజు కలశస్థాపన దృశ్య మాలిక ఇది...
|
వేదికపై కొలువైన స్వామి |
| |
|
వేదికపై కొలువైన స్వామికి గురూజీ వందనం |
|
దామరాజు దంపతులచే కలశస్థాపన |
very good. Lord hanuman bless your family.
ReplyDeleteSrungaram Singaracharyulu