మన సుందరకాండ కుటుంబం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా
శ్రీరామ శతకోటి, మారుతి కోటి రచించినన విషయం మనందరికీ విదితమే.
శ్రీరామకోటిని గతంలో వలెనే మనందరం భద్రాచలం వెళ్ళి శ్రీరాముల వారి
సన్నిధిలో సమర్పించాలనుకున్న విషయం కూడా అందరికీ తెలుసు. గురూజీ మన
భద్రాచలం యాత్రకు తేదీని ప్రకటించారు. జనవరి 23వ తేదీన శనివారం
సాయంత్రం మనందరం బస్సుల్లో బయలుదేరి 24వ తేదీ ఉదయానికి భద్రాచలం
చేరాలని నిర్ణయించారు. 24వ తేద ఉదయం భద్రాచలంలో అందరూ స్నానాదులు
ముగించుకుని గతంలో వలెనే శ్రీరామ శతకోటి పత్రాలను శిరస్సులపై
ధరించి స్వామివారికి సమర్పిస్తాం. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో
మనందరం గోదావరిలో గురూజీ నిర్వహణలో పుష్కర స్నానాలు చేసి సాయంత్రం
వరకు ఇతర ప్రదేశాలేవైనా సందర్శించి తిరిగి రాత్రి బయలుదేరి 25వ తేదీ
సోమవారం ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటాం. ఇది మన భద్రాచలం యాత్ర
ప్రోగ్రాం.
వివరాలు...
భద్రాచలం యాత్ర...
బయలుదేరడం : జనవరి 23 సాయంత్రం
దర్శనం, రామశతకోటి సమర్పణ : జనవరి 24
తిరుగు ప్రయాణం : జనవరి 25
ఈ
యాత్రకి రావడానికి ఆసక్తి గల వారందరూ శ్రీ కాంతారావు గారికి (ఫోన్
నంబర్ - 9440666791, 9494246791) డిసెంబర్ 23వ తేదీ లోగా పేర్లు నమోదు
చేసుకోవాల్సి ఉంటుంది. వృధ్ధులు, పూర్తిగా ఒకరి సహాయం పైనే ఆధారపడే
వారు యాత్రకు దూరంగా ఉండడం మంచిదన్నది గురువుగారి సలహా. పేర్లు
నమోదు చేయించుకున్న వారు జనవరి రెండో తేదీ నాటికి తమ యాత్రకయ్యే
ఖర్చులు కాంతారావుగారి అకౌంట్ నంబర్‌లో డిపాజిట్ (అకౌంట్ నంబర్ తదుపరి
ఇవ్వడం జరుగుతుంది) చేస్తే ఏర్పాట్లన్నీ సత్వరం పూర్తి
చేయగలుగుతాం. 25వ తేదీ తర్వాత ఎవరి పేర్లు స్వీకరించబడవని కూడా
స్పష్టంగా చెప్పడం జరుగుతోంది...దయ చేసి అందరూ షెడ్యూల్‌ను
పాటించాలని మనవి.
జై శ్రీరామ్...జై హనుమాన్
జై శ్రీరామ్...జై హనుమాన్
No comments:
Post a Comment