Friday, February 22, 2013
త్రుటిలో తప్పిన ప్రమాదం
తపసా సత్య వాక్యేన అనన్యత్వాచ్చ భర్తరి
ఆపి సా నిర్దహేదగ్నిం న తామగ్ని ప్రధక్ష్యతి
సుందరకాండ 55వ సర్గలో 29వ శ్లోకం ఇది. తన తపోబలం చేతను సత్య భాషణ చేతను శ్రీరాముని నిరంతరం ధ్యానించే సీతాదేవి అగ్నినే దహిస్తుంది తప్ప అగ్ని ఆమెను దహించలేదు అంటారు హనుమ.
మన గురువుగారికి కూడా అది వర్తిస్తుంది. నిరంతరం హనుమ ధ్యానంలోనే ఉంటూ మనందరినీ నిత్యం పలకరిస్తూ తన ఆశీస్సులు అందించే ఆయన్ను ఏ ప్రమాదాలు దరి చేరవు. నిన్న రాత్రి దిల్ సుఖ్ నగర్ లో జరిగిన పేలుడు ప్రమాదం నుంచి ఆయన త్రుటిలో బయట పడడమే ఇందుకు నిదర్శనం. క్షణాల ముందు అక్కడే ఉన్న ఆయనను ఒక ఫోన్ కాల్ తో సాక్షాత్తు హనుమే రక్షించారు. గురువుగారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండి మనందరికీ హనుమ ఆశీస్సులు అందచేస్తూనే ఉండాలని ప్రార్ధన.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment