దాచేపల్లి వెంకటరెడ్డి, హారిక దంపతుల నివాసంలో మార్చి 14 నుంచి 22 వరకు గురూజీ నిర్వహణలోని తృతీయాష్టోత్తర శత పరంపరలోని 49వ సుందరకాండ జరిగింది. ఆ కార్యక్రమం దృశ్యాల వీడియో ఇది. ఈ సారి కార్యక్రమంలో ఇంతవరకు మూడు సుందరకాండ పరంపరల్లోని 265 సుందరకాండల కార్యక్రమాల్లో జరగని ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. మన దేశంలో కూడా ఆ మహమ్మారి ప్రవేశించి రెండో దశకు చేరింది. అత్యంత ప్రమాదకరమైన మూడో దశ ప్రవేశించకుండా ఉండాలంటే మనందరం ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూడో దశకు విస్తరించకుండా ఉండేందుకు ప్రధాన నరేంద్రమోదీ ఆదివారం (తేదీ 22) ప్రజా కర్ఫ్యూ పాటించాలని పిలుపు ఇచ్చారు. దానికి సామాజిక బాధ్యతగా స్పందించిన గురూజీ సుందరకాండ కంకణధారులు తప్ప సహస్రనామార్చనకు ఎవరూ రావద్దని ఆదేశించారు. సాధారణంగా ఏ సుందరకాండలో అయినా ఎంత మంది పాల్గొంటే అంత మంచిదని పదేపదే పిలుపు ఇచ్చి ప్రోత్సహించే గురూజీ కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఇంతవరకు ఏ సుందరకాండలోనూ జరగలేదు. ఇంక ముందు ఇలాంటి సదర్భం రాకూడదనే ఆ స్వామివారిని కోరుకుందాం. అలాగే ఎప్పుడూ అవసరమైనంత సంఖ్యలో రామబంట్లుగా సేవ కోసం శిష్యులని ఆహ్వానించే గురూజీ ఈ సారి ఒక్క సుబ్రహ్మణ్యంగారు మినహా ఎవరూ రావద్దని ఆదేశించారు. అది కూడా తెల్లవారు ఝామున 4 గంటలకి ప్రారంభించి 6 గంటలకల్లా మొత్తం కార్యక్రమం ముగించేశారు. 7 గంటలకల్లా అందరూ ఇళ్లకి చేరి ప్రధాని పిలుపు మేరకు ప్రజా కర్ఫ్యూలో భాగస్వాములయ్యేందుకు ఇలా చేశారు. హాట్సాఫ్ గురూజీ.
No comments:
Post a Comment