కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువుగారు శ్రీమాన్ శృంగారం సింగరాచార్యులుగారు లోకకల్యాణాన్ని, తన శిష్యపరంపరలోని అందరి అభ్యున్నతిని కాంక్షిస్తూ ఏక దివస సుందరకాండ, కార్తీక దీపాలంకరణ అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుఝామునే లేచి స్నానాదులు ముగించుకుని 5 గంటల సమయంలో ప్రారంభించిన ఏకదివస సుందరకాండ మధ్యాహ్నం వరకు సాగింది. అనంతరం వారి ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో దీపాలను శ్రీరాం, స్వస్తిక్, ఓంకార రూపంలో అలంకరించారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత సూర్యాస్తమయం అయిన అనంతరం అక్కడకు వచ్చిన భక్తులందరి చేత సంకల్పం చేయించి దీపాలను వెలిగింపచేశారు. శ్రీరాం, స్వస్తిక్, ఓంకారాలు అద్భుతమైన కాంతులీనడంతో పాటు ఎదురుగా అమర్చిన శ్రీరామ పట్టాభిషేక చిత్రపటంలో ఎంతో చక్కగా ప్రతిబింబించాయి. ఆ వైభవాన్ని చూసేందుకు రెండు కన్నులు చాలలేదంటే అతిశయోక్తి కాదు. కొంత సేపు దీపాలు అలా ప్రజ్వలింపచేసిన తర్వాత ఉదయం తానే స్వయంగా తయారుచేసిన పులిహోరను అందరికీ ప్రసాదంగా ఇచ్చి అమ్మగారి సమేతంగా అశీస్సులు అందచేసి వీడ్కోలు పలికారు. ఆ దీపాలు వెలిగించి, ఆ వెలుగులు కళ్లారా చూసిన వారు ధన్యులు. ఆ వైభవాన్ని ఒక చిన్న వీడియోగా రూపొందించి అందచేస్తున్నాను.
- దామరాజు వెంకటేశ్వర్లు
No comments:
Post a Comment