శ్రీ గురుభ్యోనమః...గురూజీ ఆశీస్సులు, మన ఆరాధ్య దైవం ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో ఈ సారి 21వ అయ్యప్ప దీక్ష ప్రారంభించిన రోజు నుంచి మండల కాలం పాటు శ్రీమత్సుందరకాండ పారాయణ అత్యంత విజయవంతంగా పూర్తి చేశాను. ఈ రోజు 58వ సర్గ హోమంతో సుందరకాండ ముగించడం మరో విశేషం. ఈ సారి అయ్యప్ప దీక్ష నా జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైనది. ప్రతీ రోజూ ఉదయం నాలుగున్నరకే లేచి పూజకి అన్నీ సిద్ధం చేసుకోవడం దగ్గర నుంచి మొదలయ్య నిత్య పూజ శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరాలు, ఏకవార రుద్రాభిషేకం, శ్రీమహాశివుడు, దుర్గాదేవి అష్టోత్తరాలు, విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ ఆంజనేయస్వామి అష్టోత్తరం, అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరం, రోజుకి తొమ్మిది వంతున సుందరకాండ సర్గల పారాయణ సుమారు రెండున్నర గంటల పాటు పూజలు నభూతో నభవిష్యతిగా జరిగాయి. ఆదివారం తెల్లవారుఝామున (తెల్లవారితే సోమవారం) మూడు గంటల నుంచి మొదలుపెట్టి ఇరుముడులు కట్టుకుని సోమవారం రైలులో శబరియాత్ర బయలుదేరుతున్నాను. ఇదేదో ఘనవిజయం నేను సాధించానని కాకుండా గురూజీ ఆశీస్సులతో మాత్రమే ఇది పూర్తి చేయగలిగానని అందరికీ తెలియచేస్తున్నాను.
శ్రీ గురుభ్యోనమః
భాగ్యనగరవాసాయ విద్మహే
శాంతస్వరూపాయ ధీమహి
తన్నో సింగరాచార్య ప్రచోదయాత్
శ్రీ గురుభ్యోనమః
భాగ్యనగరవాసాయ విద్మహే
శాంతస్వరూపాయ ధీమహి
తన్నో సింగరాచార్య ప్రచోదయాత్
No comments:
Post a Comment