ఆంజనేయ స్వామి వారికి మనం తమలపాకులతో పూజ చేస్తూ ఉంటాం... కానీ ఎలా
ఎందుకు చేయాలన్నది మనలో చాలా మందికి తెలియదు... ఇందుకు ఒక చక్కని కారణం
ఉంది... అదేమిటో తెలుసుకుందాం...
తమలపాకు బ్రహ్మ సృష్టి లోనిది కాదు. తమలపాకును నాగవల్లి అని పిలుస్తారు. ఇంద్రుని ఐరావతాన్ని కట్టి ఉంచే రాటనే నాగవల్లిగా పిలుస్తారు...అలా
ఇంద్రలోకంలో నాగవల్లికి ఆశ్రయించి అల్లుకున్న తీగ నుండి ఉద్భవించినదే
తమలపాకు... అంతటి విశిష్టమైన తీగ నుండి ఉద్భవించిన ఆకుతో పూజ అందుకునే
అర్హత కూడా అంత విశిష్టమైన వారికే ఉంటుంది..అలాంటి విశిష్టతలు ఎవరికి
ఉన్నాయి అని అన్వేషిస్తే కనిపించింది హనుమ ఒక్కడే...
No comments:
Post a Comment