గురువుగారి సందేశానికి పలువురు పంపిన స్పందనలు చూశాను. చాలా సంతోషం. ఇప్పటికైనా మన వాట్సప్ గ్రూప్ లో క్రమశిక్షణ పాటిద్దాం. గురువుగారి కార్యక్రమాలు, వాటికి సంబంధించిన ఫొటోలకే ఇందులో ప్రాధాన్యత ఇద్దాం. అలాగే సుందరకాండకు, ఆంజనేయస్వామివారికి సంబంధించిన అంశాలేవైనా ఉంటే అవి కూడా ప్రచురించవచ్చును. గురూజీ చెప్పినట్టు మరో గ్రూప్ చేయడం వల్ల ప్రయోజనం ఏ మాత్రం ఉండదు. వాట్సప్ గ్రూప్ నిర్వాహకులకు అందులో వచ్చే పోస్ట్ లను నియంత్రించే విధానం ఏదీ ఆ సంస్థ పెట్టలేదు. నేను ఇప్పటికే ఎన్నో గ్రూప్ లలో సభ్యుడుగా ఉన్నాను. వాటితో పోల్చితే మన సుందరకాండ గ్రూప్ ఎంతో క్రమశిక్షణ పాటిస్తోంది. మరో విషయం...ఈ గ్రూప్ ఏర్పాటు చేసిన సమయంలో సభ్యులందరికీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అవసరం లేని పోస్టులు వచ్చినప్పుడల్లా అది మంచిది కాదన్న హెచ్చరికలు చేయడం కూడా జరిగిందన్న విషయం గురువుగారి దృష్టికి తెస్తున్నాను. ఆ విషయం ప్రకాష్ గారికి, ప్రభాకర్ గారికి కూడా తెలుసు. గ్రూప్ సభ్యులందరూ కట్టుదిట్టమైన క్రమశిక్షణ పాటించడం ఒక్కటే సమస్యకు పరిష్కారం. మరో గ్రూప్ ప్రారంభించడం వల్ల మరో తలనొప్పి తెచ్చుకున్నట్టవుతుంది తప్పితే అది ఏ విధంగాను ఉపయోగకరం కాదన్న విషయం గురూజీకి నివేదిస్తున్నాను. ఇలా చెప్పి గురుధిక్కారానికి పాల్పడ్డాననిపిస్తే క్షంతవ్యుడిని. మరో పరిష్కారం కూడా నా దృష్టిలో ఉంది. ఎవరు ఏ పోస్ట్ చేయాలనుకున్నా దాన్ని నా వ్యక్తిగత వాట్సప్‌కు పంపితే అది చూసి బాగుందనిపిస్తే వారి పేరుతో పోస్ట్ చేస్తాను. మన గ్రూప్‌లో ప్రచురణకు సరిపోదనిపిస్తే తిరస్కరిస్తాను. ఇది సమస్యకు పరిష్కారం అవుతుంది. ఈ సూచన పరిశీలించాలని గురువుగారిని కోరుతున్నాను.
No comments:
Post a Comment