భద్రాచలం యాత్రకు అంతా సిద్ధం అవుతోంది. బస్సుల ఏర్పాటు కూడా పూర్తయింది. రెండు బస్సుల్లోనూ యాత్రికులకు సీట్ల కేటాయింపు స్వయంగా గురువుగారే చేశారు. కాని వ్యవధి తక్కువగా ఉండడంతో పాటు త్వరితంగా అందరికీ సమాచారం అందచేసే ప్రయత్నంలో సీట్ల కేటాయింపు చార్టుల్లో ఎడమ, కుడి సీట్లను గుర్తించడంలో ఒకటి రెండు చిన్న పొరపాట్లు చోటు చేసుకున్నట్టు మా దృఫ్టికి వచ్చింది. కాని సీట్ల సంఖ్యకు అనుగుణంగానే కేటాయింపు జరిగింది. ఒకటి రెండు చిన్న పొరపాట్లుంటే బస్సులకు కన్వీనర్లుగా నియమితులైన ఆత్మూరి రాఘవరావు, కస్తూరి కాంతారావుగార్లు ఇద్దరూ అప్పటికప్పుడు ఎవరికీ ఎలాంటి అసౌకర్యం లేని రీతిలో సద్దుబాటు చేస్తారని గురువుగారు తెలియచేస్తున్నారు. అది కూడా వారిద్దరి సొంత నిర్ణయం ఏ మాత్రం కాదు.అంతా గురూజీ మార్గదర్శకం మేరకే జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు పట్టుదలలకు పోకుండా మనందరం యాత్రకు పోయి విజయవంతంగా తిరిగివద్దాం. ఇది కూడా గురువుగారి సందేశమే...
No comments:
Post a Comment