Thursday, November 26, 2015

పంచ‌కుండ సుంద‌ర‌కాండ మ‌హాక్ర‌తువు ఆహ్వాన‌ప‌త్రం

డిసెంబ‌ర్ ఆరో తేదీ నుంచి గురువుగారి నిర్వ‌హ‌ణ‌లో పంచ‌కుండ సుంద‌ర‌కాండ మ‌హాక్ర‌తువు అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతోంది. కార్య‌క్ర‌మం జ‌రుగ‌నున్న ప్ర‌దేశం నాగోల్ ప్రాంతంలోని స‌త్యాన‌గ‌ర్ కాల‌నీ హ‌రిహ‌ర‌క్షేత్రం...అందుకు సంబంధించిన ఆహ్వాన‌ప‌త్రం ఇది...అంద‌రూ ఆహ్వానితులే...


Tuesday, November 24, 2015

గురువుగారి నివాసానికి స్వామివారి రాక‌



నాలుగు నెల‌ల పాటు జంట‌న‌గ‌రాలు న‌లుమూల‌లా భ‌క్తుల గృహాల‌ను పావ‌నం చేసిన అనంత‌రం హ‌నుమ‌త్ ల‌క్ష్మ‌ణ సీతామాతా స‌హిత శ్రీ‌రాముల వారు గురువుగారి నివాసానికి వేంచేశారు. దామ‌రాజు హ‌నుమంతు వేంక‌ట స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి దంప‌తుల‌కు స్వామివారిని గురువుగారి నివాసానికి చేర్చే భాగ్యం క‌లిగింది. 

Tuesday, November 10, 2015

స్వ‌స్థ‌లానికి స్వామివారు

శ్రీ సీతా ల‌క్ష్మ‌ణ హ‌నుమ‌త్ స‌మేత శ్రీ‌రాముల వారు విజ‌యయాత్ర ముగించుకుని ఈ రోజు త‌న స్వ‌స్థ‌లం అయిన గురువుగారి నివాసానికి వేంచేశారు. జూలై 29న ప్రారంభ‌మైన స్వామివారి విజ‌య‌యాత్ర న‌వంబ‌ర్ 10న ముగిసింది. మొత్తం 104 రోజుల్లో 52 మంది సుంద‌రకాండ భ‌క్తుల ఇళ్ళ‌ను పావ‌నం చేశారు. గురువుగారి నిర్వ‌హ‌ణ‌లోని ద్వితీయాష్టోత్త‌ర సుంద‌రకాండ డిసెంబ‌ర్ ఏడో తేదీ నుంచి ప‌న్నెండ‌వ తేదీ వ‌ర‌కు దిల్‌సుఖ్‌న‌గ‌ర్ ప‌రిధిలోని కొత్త‌పేట స‌మీపంలో ఉన్న స‌త్యాన‌గ‌ర్ కాల‌నీ హ‌రిహ‌ర క్షేత్రంలో ఎంతో వైభ‌వంగా జ‌రిపేందుకు స‌న్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. అక్క‌డ సేవ‌లు అందుకున్న అనంత‌రం స్వామివారు రెండో ద‌శ విజ‌య‌యాత్ర డిసెంబ‌ర్ 16న ప్రారంభించి 2016 జ‌న‌వ‌రి 18 వ తేదీ వ‌ర‌కు మ‌రో 17 మంది సుంద‌ర‌కాండ భ‌క్తుల ఇళ్ళ‌ను పావ‌నం చేస్తారు. జ‌న‌వ‌రి 19న తిరిగి గురువుగారి నివాసానికి చేరుకుంటారు...

కార్తీక వ్ర‌త మండ‌పం ఏర్పాటు విధానం


కార్తీక స్నాన సంక‌ల్పాది విధివిధానాలు


కార్తీక వ్ర‌తం-విధివిధానాలు

ప‌విత్ర కార్తీక మాసం మ‌రో రెండు రోజుల్లో ప్రారంభం అవుతోంది. కార్తీక మాసం అంటేనే శివ‌కేశ‌వాభేదంతో అటు శివుడికి, ఇటు విష్ణువుకి పూజ‌లు నిర్వ‌హిస్తారు. కార్తీక‌మాస వ్ర‌తం పాటించే వారు రోజూ తెల్ల‌వారుఝామునే చ‌న్నీటి స్నానాలు, కార్తీక పురాణం పారాయ‌ణ‌లు, దానాలు, జ‌ప‌త‌పాలు చేసి జ‌న్మ ధ‌న్యం చేసుకోవాల‌నుకుంటారు. అస‌లు కార్తీక మాసంలో చేయాల్సి పూజ‌లు, విధివిధానాలేమిటి, ఏ రోజు ఏం పూజ చేయాలి, ఏయే ప‌దార్థాలు విస‌ర్జించాలి...వంటి వివ‌రాల‌తో పాటు కార్తీక పురాణం అంద‌రి కోసం...చ‌ద‌వండి, త‌రించండి...