కదళీ వనంలో
కార్తిక మాసంలో సుందరకాండ హోమ సహిత పారాయణం ఎంతో అద్భుతంగా
జరిగింది...అయిదు రోజుల పాటు జరిగిన హోమంలో స్వామి హనుమ స్వయంగా
సాక్షాత్కరించారు...తొలి రోజు హోమం ప్రారంభం కావడానికి ముందు అగ్ని
ప్రజ్వలనం చేసిన కొద్ది క్షణాల్లోనే జ్వాలల్లో ఒక వీరుని రూపంలో అయన సాక్షాత్కారం జరిగింది.
తిరిగి ముగింపు రోజున లంకా దహన ఘట్టం జరుగుతూ ఉండగా దిగువన లంక దహనం
అవుతుంటే గగన తలంలో ఎగురుతున్నట్టు స్వామి దర్శనం జరిగింది...నిజంగా స్వామి
హనుమ మన మధ్యనే ఉన్నారనడానికి ఇవి ప్రబల నిదర్శనాలు. చివరి రోజు హోమం
జరుగుతున్నంత సేపు వాయుదేవుడు విజ్రుంభించాడు... ఆకాశంలో మబ్బులు లేకుండానే
గాలి అంట తీవ్రంగా ఉండడం ఒక విచిత్రం...ఆ గాలికి హోమ గుండంలో జ్వాలలు
ఎగిసి నాలుగు వైపులకి విస్తరిస్తుంటే వాటిని అదుపు చేయడం చాలా కష్టం
అయింది... అయిదు రోజుల హోమం ముగింపుగా సహస్ర నామార్చన ముగియడంతోనే వాన కూడా
కురిసింది... ఆ ప్రాంతంలో తప్పితే హైదరాబాద్ లో మరెక్కడా చిన్న చినుకు
కూడా పడలేదని తర్వాత తెలిసింది... సుందరకాండ సంపూర్ణ ఫలితాన్ని
ఇచ్చిందనడానికి ఇది ప్రబల నిదర్సనం... ఇది తాను చేసిన 200 సుందరకాండల్లోనూ
అపురూపమైన ఘట్టమని, స్వామి హనుమ భక్తులని అలా ఆశీర్వదించారని గురువు గారు
అభిభాషించారు... ఈ 96 వ సుందరకాండ నిర్వాహకులు ఉప్పాల బాపయ్య చౌదరి,
శాంతిశ్రీ దంపతుల జన్మ ధన్యమయిందని ఆశీస్సులు అందించారు...
వర్షానికి తడవకుండా ముసుగేసుకున్న దంపతులు
|
హనుమ నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తున్న జ్వాల |
హనుమ లంకా దహనం చేస్తున్నట్టు ఏర్పడిన రూపం |
No comments:
Post a Comment