అదో ఉద్విగ్నభరితమైన క్షణం... అందరిలోనూ కృతజ్ఞతా భావం....
ఎవరు ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా నేనున్నానంటూ దశాబ్దికి పైగా అభయం ఇచ్చి
ఆదుకుంటున్న గురూజీకి ఉడతా భక్తిగా శిష్యులు సమర్పించుకున్నకృతజ్ఞతాపూర్వక
కానుక...అందరిలోనూ ఆనందపు వెల్లువ... ఏమిటిదంతా... నా సంకల్పం ఏమిటి, మీరు
చేసిందేమిటి అంటూ గురువుగారి మందలింపు... అయినా మా తృప్తి కోసం మేము
సమర్పించుకుంటున్న గురు దక్షిణ...అది కూడా మీ శ్రమ తగ్గించేందుకే... మీ
అమూల్యమైన ప్రవచనాలు వినే భాగ్యం మరింత కాలం అందుబాటులో ఉంచాలన్న మా
స్వార్థం కోసమే... కాదనవద్దంటూ వేడికోళ్ళు...నిజంగా కొన్నేళ్ళుగా స్వార్థం
అనేది లేకుండా ఇల్లు వాకిలి, జీవిత భాగస్వామిని రక్షణను ఆంజనేయ స్వామికే
వదిలేసి శిష్యులు, సమాజం శ్రేయస్సుకే జీవితాన్ని అంకితం చేసిన గురువుగారికి
కనీసం ఇప్పటికైనా శ్రమ తగ్గించాలన్న బలమైన కోరిక నుంచి పుట్టిందే ఈ
ఆలోచన...అంతటి మహోన్నతునికి ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలంటూ చర్చలు... మనం
కారు కొనిస్తామంటే గురువుగారు ఊరుకుంటారా అన్న భయాలు...ఏది ఏమైనా మనం ఆయన
కోసం చేస్తున్నఈ చిన్న పాటి ప్రయత్నాన్ని అంగీకరించాలని నచ్చ చెబుదామన్న
శ్రేయోభిలాషుల ప్రోత్సహపు పలుకులే బలంగా వేసిన ముందడుగు... వెరసి అందరి కల
నిజం అయిన ఆ క్షణాలు ఆనందభరితం... అందరి వేడికోలును అంగీకరించిన గురువుగారి
ఔదార్యం... అంత ఆనందకరమైన క్షణాల దృశ్య రూపమే ఇది.
No comments:
Post a Comment