ఈ ఏడాది గురు పూర్ణిమ అత్యంత విశిష్టమైనది. గురువుగారే సాక్షాత్తు శిష్యుల సందర్శనానికి తిరిగి వచ్చిన శుభ సమయం అది. భక్తుడు ఎంత తీవ్రంగా కోరుకుంటే అంతగా భగవంతుడు దిగి వస్తాడని చెబుతూ ఉంటారు. సాధారణంగా ప్రతీ ఏడాది గురు పూర్ణిమ రోజున శిష్యులందరం గురువుగారి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాం. కాని ఈ సారి 77వ సుందరకాండ మధ్యలో తొలి ఏకాదశి, చివరి రోజున గురు పూర్ణిమ పర్వదినాలు వచ్చాయి. 25 సంవత్సరాల సుందరకాండ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. దాంతో చివరి రోజున బొలిశెట్టి వారింట్లో సహస్ర నామార్చనలో పాల్గొన్న వారందరూ గురువుగారికి గురుపూజ చేసి ఆశీస్సులు తీసుకునే భాగ్యం లభించింది. ఈ 77వ సుందరకాండలో పాల్గొన్న వారందరి జన్మ ఆ విధంగా ధన్యమయింది. ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు వీక్షించండి.