Sunday, April 19, 2020
Saturday, April 18, 2020
ఈ రోజు ధన్వంతరి హోమం దృశ్యాలు
కరోనాసుర సంహారాన్ని కోరుతూ శ్రీరామనామ జపం చేయాలన్న మన గురూజీ సందేశం మేరకు అందరం రంగంలోకి దిగి మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు శ్రీరామనామ పారాయణం ఎంతో భక్తి శ్రద్ధలతో చేశాము. మొత్తం 300 మందికి పైగా శిష్యులు, వారి బంధుమిత్రులు శ్రీరామనామ పారాయణ దీక్ష స్వీకరించి శ్రీ రామనామం జపించారు. మొదట మార్చి 28 నుంచి ప్రారంభించి ఏప్రిల్ 8వ తేదీ లోగా కోటి వెయ్యి నూట ఎనిమిది (1,00,01,108) నామాలు పారాయణ చేయాలని గురూజీ నిర్దేశించారు. అప్పటికే ఆ సంఖ్య దాటిపోయింది. అయినా కూడా ఈ నెల 14 వరకు జపాన్ని గురూజీ పొడిగించారు. ఇంకా తుది లెక్క తెలియాల్సి ఉంది. నా ఉద్దేశంలో అందరం కలిసి చేసిన నామజపం 2 కోట్లు దాటిపోయి ఉంటుంది. ఈ రోజున గురువుగారు శ్రీరామనామ జపం చేసిన వారందరి పేర్ల మీద సంకల్పం చెప్పి లోకకల్యాణం, సర్వజన క్షేమం, కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి ఆకాంక్షిస్తూ ధన్వంతరి హోమం సమీపంలోనే ఉన్న ఒక బ్రాహ్మణోత్తముని సహాయంతో నిర్వహించి సుదరకాండ కుటుంబం అందరికీ తమ ఆశీస్సులు అందచేశారు. ఆ ఫొటోలు, వీడియోలు అందరి కోసం పోస్ట్ చేస్తున్నాను.
Tuesday, April 14, 2020
రామనామ జపం పూర్తయింది, శనివారం ధన్వంతరి హోమం
గురువుగారు పంపిన చివరి రోజు నివేదిక పంపుతున్నాను. నివేదిక చదివితే అంతా అర్ధం అవుతుంది. అయినా నేను కూడా ఆయన చెప్పిన విషయం సంక్షిప్తంగా రాస్తున్నాను. వచ్చే శనివారం ఉదయం ఉదయం గురువుగారు ధన్వంతరి హోమం చేసి మనందరి గోత్ర నామాలతో ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆయన పంపిన నివేదికలోని
"ఓం వాసుదేవాయ విద్మహే వైద్యరాజాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్"
అనే మంత్రం మనందరం శనివారం ఉదయం ఉదయం 7 గంటలకు కనీసం 11 సార్లు జపం చేస్తే సరిపోతుంది. కింద రాసిన బీజాక్షరాలతో కూడిన మంత్రం గురూపదేశం లేకుండా ఎవరూ చదవకూడదు. అలా చదివితే బెడిసి కొడుతుంది. జాగ్రత్త. ఈ నియమం తప్పనిసరిగా పాటించాలి. చక్కగా ఇన్ని రోజులు పారాయణ చేసిన తర్వాత ఈ రామనామ పారాయణలో పాల్గొన్న వారందరి గోత్రనామాలు నివేదిస్తూ మనందరి పేర్ల మీద జరుగుతున్న ఈ హోమం ఇంటిలో ఎవరికీ కరోనా దరి చేరకుండా కాపాడుతుంది. శుభాకాంక్షలు.

Subscribe to:
Posts (Atom)