Sunday, July 29, 2018
Sunday, July 15, 2018
20వేలు దాటిన రామనామ జపం
దుష్ట శిక్షణార్ధం, శిష్ట రక్షణార్ధం శ్రీమాన్ గురూజీ పిలుపు ఇచ్చిన మేరకు మన సుందరకాండ భక్తకోటి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో రామనామజపం చేశారు. అలాంటి కొందరు అందించిన సమాచారం ఆధారంగా లెక్క కడితే 13 మంది 20,478 సార్లు పారాయణ గావించారు. నిజానికి ఇది లక్ష వరకు చేరి ఉంటే చాలా బాగుండేది. మొత్తం మన భక్తబృందం అందరూ కొంత సమయం కేటాయించి చేసి ఉంటే అది సాధ్యమయ్యేది. మరి ఇంతమంది మన సుందరకాండ భక్తగణంలో ఏ చిన్న పోస్టుకైనా నమస్కార బాణాలు వదులుతూ, తమ చిత్తానికి తోచిన ప్రతీ అంశాన్ని వాట్సప్ లో పోస్టు చేసే వారందరూ ఏమైపోయారో అర్ధం కాదు. అయినా రామనామ పారాయణం 20 వేలు దాటడంపై గురూజీ హర్షం ప్రకటించారు. ఇప్పటికైనా కళ్లు తెరుద్దాం, ఈ సారి గురూజీ నుంచి ఏదైనా ఇటువంటి మహత్కార్యం గురించిన సందేశం అందితే కనీసం లక్ష దాటేలా చేద్దామని నా ఆశ.
- దామరాజు వెంకటేశ్వర్లు
Sunday, July 8, 2018
Thursday, July 5, 2018
ఈ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండిద్దాం
ఇది ఈ ఒక్కడి సమస్య కాదు. యావత్ భారతీయుల మనోభావాలను దెబ్బ తీస్తూ ఆరాధ్య దైవాలైన శ్రీ రామచంద్రుని సీతమ్మని ఘోరముగా తూలనాడిన మూర్ఖపు చర్య.
రాముడిని దగుల్బాజీ అని తూలనాడడము సీతమ్మ తల్లిని ఆమె రావణుడివద్ద ఉంటేనే బాగుండేది అని ఆ మహాతల్లిని ఒక వేశ్యగా చిత్రీకరించడము వాడి వికృతపు మాటలు వింటూ మనము మిన్నకుండడముకంటె చావే మేలు.
కాబట్టి ఆ దరిద్రుని పలుకులను యావత్ మన సుందరకాండ కుటుంబ సభ్యుల తరఫున నెను తీవ్రముగా ఖండిస్తున్నాను. ఈ ప్రకటన చేస్తున్నందుకు నన్ను జైలులో పెట్టిన లేక చిత్రహింసలు పెట్టినా సంతోషముగా అనుభవించడానికి సిద్ధముగా ఉన్నాను.
నాకు ఆ దరిద్రుడిపైన కలిగిన కోపముతో ఒక రావణాసురుని ఫోటోనుకూడా తయారుచేసి దీనితోబాటు ఉంచుతున్నాను.
ఉట్టికెగురలేదు స్వర్గానికి ఎగురుతానన్న చందంగా వాడు టి.వి. డిబేటులో జవాబు ఇవ్వలేక మధ్యలోనే పారిపోయినవాడు శ్రీరాముని నిందించునంతటి మొనగాడా ?
మీ శృంగారం శింగరాచార్యులు.
Subscribe to:
Posts (Atom)