ఆంజనేయ స్వామి ఒక్కరే అయినా అయన స్వరుపాలెన్నో. దాసాంజనేయ స్వామి, ధ్యాన ఆంజనేయ స్వామి, సంజీవ ఆంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామి...ఇలా పలు రూపాల్లో అయన కొలువై ఉన్నారు...మన దేశంలో ఆంజనేయ స్వామి విగ్రహం లేని గ్రామం ఉండదు..ప్రతి గ్రామానికి రక్షణ ఆయనే...అందుకే దేశ విదేశాల్లో కొలువైన ఆంజనేయ స్వామి మూర్తుల చిత్రాలను సుందరకాండ భక్తుల కోసం ఒక చోట పెట్టాలన్నది గురువుగారి సంకల్పం.. ఇందులో భాగంగా గురువుగారు ౧౦౮ సుందరకాండ పారాయణలకు ౨౦౦౧ లో సంకల్పం చేసుకున్న హైదరాబాద్ లోని (అంబర్ పేట) ప్రేమనగర్ లో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామితో ప్రారంభించి అందుబాటులో ఉన్న ఆంజనేయ స్వామి మూర్తులను ఇక్కడ వాడ వాడల కొలువైన అంజన్న అనే పేజీలో పోస్ట్ చేస్తున్నాం..దర్శించి తరించండి..నచ్హిన మూర్తిని డౌన్ లోడ్ కూడా చేసుకుని పుజించుకోవచ్చును.