ఆంజనేయ స్వామి ఒక్కరే అయినా అయన స్వరుపాలెన్నో. దాసాంజనేయ స్వామి, ధ్యాన ఆంజనేయ స్వామి, సంజీవ ఆంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామి...ఇలా పలు రూపాల్లో అయన కొలువై ఉన్నారు...మన దేశంలో ఆంజనేయ స్వామి విగ్రహం లేని గ్రామం ఉండదు..ప్రతి గ్రామానికి రక్షణ ఆయనే...అందుకే దేశ విదేశాల్లో కొలువైన ఆంజనేయ స్వామి మూర్తుల చిత్రాలను సుందరకాండ భక్తుల కోసం ఒక చోట పెట్టాలన్నది గురువుగారి సంకల్పం.. ఇందులో భాగంగా గురువుగారు ౧౦౮ సుందరకాండ పారాయణలకు ౨౦౦౧ లో సంకల్పం చేసుకున్న హైదరాబాద్ లోని (అంబర్ పేట) ప్రేమనగర్ లో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామితో ప్రారంభించి అందుబాటులో ఉన్న ఆంజనేయ స్వామి మూర్తులను ఇక్కడ వాడ వాడల కొలువైన అంజన్న అనే పేజీలో పోస్ట్ చేస్తున్నాం..దర్శించి తరించండి..నచ్హిన మూర్తిని డౌన్ లోడ్ కూడా చేసుకుని పుజించుకోవచ్చును.
Friday, December 9, 2011
Thursday, December 8, 2011
Saturday, October 22, 2011
అరటి తోటలో సుందరకాండ
మన గురువుగారు అరటి తోటలో సుందరకాండ నిర్వహించాలని నిర్ణయించిన విషయం అందరికి తెలిసిందే.. దాని కోసం మన సుందరకాండ కుటుంబం అంతా ఎంతో ఆత్రంగా ఎదురు చూశాం..ఆ కల ఇన్నాళ్ళకు నెరవేరింది..నిజాం పేటలో శ్రీ బాపయ్య చౌదరి శాంతిశ్రీ దంపతులు మన సుందరకాండ కోసమే కదళి వనం పెంచారు..అక్కడ ౨౦౧౧ నవంబర్ ౮వ తేది నుంచి సుందరకాండ వైభవంగా జరిగిన్ ది...ఆ మహోత్సవం చిత్రాలు...
సుందరకాండ కోసం పెంచిన అరటి తోట |
స్వామి కొలువైన వేదిక |
గురుజి |
క్రతువు జరిగిన స్తలం
క్రతువు ప్రారంభ దృశ్యం
Monday, September 19, 2011
KASI YATRA PHOTOS
మన సుందరకాండ భక్త బృందం గురువుగారి నాయకత్వంలో కాశి యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి రావడం జరిగింది. ఈ యాత్ర చాలా అద్భుతంగా జరిగింది. వారణాసి పుణ్య క్షేత్రంలో విశ్వనాథునితో పాటు అన్నపూర్ణ, విశాలాక్షి ఆలయాలు దర్సించుకున్నాం. కేదార్ ఘాట్ లో పితృ తర్పణలు చేసాం. అదే ప్రదేశంలో శివ, గంగ, గౌరీ పూజలు చేసుకోవడంతో పాటు ప్రసిద్ధి చెందినా దేవాలయాలు దర్సించుకోవడంతో పాటు ప్రముఖ బౌద్ధ క్షేత్రం అయిన సారనాద్ కూడా చూసాం. యాత్ర ముగింపులో అలహాబాద్ వచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి శయన హనుమాన్ ఆలయాన్ని, శక్తి పీఠాన్ని దర్శించుకుని శుక్రవారం రాత్రికి హైదరాబాద్ తిరిగి వచ్చాం. ఆ యాత్రలో దశశ్వమేద ఘాట్ లో జరిగిన గంగ హారతి కన్నుల పండుగగా చూసాం. ఆ యాత్ర ఫోటోలు చూడండి.
Subscribe to:
Posts (Atom)