సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు తలచుకుంటేనే వొళ్లంతా పులకరిస్తుంది. సుందరకాండ మహా క్రతువు ప్రారంభమైన రోజు. వారం రోజులు ఎలా గడిచిపోయాయో ఎవరికీ తెలియకుండానే గడిచిపోయాయి. వారం రోజుల పాటు ఆ ప్రాంగణమంతా ఉత్సాహమే. హనుమత్ నామ సంకీర్తనే. ఉదయం వేళల్లో గురువుగారు సుందరకాండ శ్లోకాలు చదువుతూ ఉంటే హోమ గుండంలో హనుమత్ నామం జపిస్తూ సమిధలు వేస్తూ హనుమత్ దీక్ష తీసుకున్న దంపతులచే క్రతువు. సాయంత్రం వేళల్లో గురువుగారి సుందరకాండ ప్రవచనాలు. శ్రీపురం కాలనీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆణువణువూ భక్తి పారవశ్యం. సుందరకాండ కుటుంబ సభ్యుల్లో పెల్లుబికిన ఉత్సాహం. ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ గురువుగారికి హనుమత్ భక్తులందరికీ ఎంతో ఇష్టమైన ఎం.ఎస్.రామారావు సుందరకాండ విని ఆనందించండి, పరవసించండి...
http://www.youtube.com/watch?v=AtotZ-y4LLM&playnext=1&list=PL504153C39800E41F&index=9
Guruji conducted 1st Sundarakanda Kratuvu from 19th December 2009...This is the First Anniversary Day of that great event...